E-Paper
Advertisement

రెడ్ అండ్ బ్లాక్ లుక్‌లో హ్యుందాయ్ బేయాన్.. ఫీచర్లు అదుర్స్!

రెడ్ అండ్ బ్లాక్ లుక్‌లో హ్యుందాయ్ బేయాన్.. ఫీచర్లు అదుర్స్!
Advertisement

New Hyundai Bayon SUV: హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తున్నవారికి మరో క్రేజీ అప్‌ డేట్. త్వరలో భారత మార్కెట్లోకి రానున్న హ్యుందాయ్ బేయాన్ ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకుంటోంది. ఫైరీ రెడ్ కలర్‌తో పాటు బ్లాక్ రూఫ్‌తో కనిపించిన ఈ కారు స్పై ఫొటోలు ఇప్పుడు ఆటో ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అక్టోబర్ 26, 2026న ఈ కారును అధికారికంగా విడుదల కానుంది.

రెడ్ అండ్ బ్లాక్ కలర్‌లో స్పెషల్ లుక్

హ్యుందాయ్ బేయాన్ డిజైన్‌లో ముందు భాగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బోనెట్ అంచు వెంట LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), ఇరువైపులా నిలువుగా అమర్చిన లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మెయిన్ హెడ్‌ ల్యాంప్స్‌ ను కిందివైపు బంపర్‌ లో అమర్చారు. సిల్వర్ స్కిడ్ ప్లేట్ తరహా డిజైన్ ముందు భాగానికి స్పోర్టీ లుక్ ఇస్తుంది. సైడ్ ప్రొఫైల్‌ లో బ్లాక్ రూఫ్, రూఫ్ రైల్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, బేయాన్ పేరుతో కూడిన టెయిల్‌ గేట్ డిజైన్, రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి. మొత్తంగా ఈ SUV రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించేలా రూపొందించినట్లు తెలుస్తోంది.

క్యాబిన్‌లో రెండు పెద్ద డిస్‌ ప్లేలు

Advertisement

కారు లోపల టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మరో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సెంటర్ కన్సోల్‌లో మీడియా, మ్యాప్, హోమ్ లాంటి ఫంక్షన్ల కోసం స్పెషల్ బటన్లు, వాల్యూమ్ కంట్రోల్ రోటరీ నాబ్ ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ కోసం స్పెషల్  ప్యానెల్‌తో పాటు రెండు USB-C పోర్టులు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 12V పవర్ అవుట్‌లెట్  లాంటి సదుపాయాలు కూడా కనిపిస్తున్నాయి.

1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్

ఇండియా స్పెక్ బేయాన్‌లో 1.5 లీటర్, నాలుగు సిలిండర్ల MPi పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని తెలుస్తోంది. ఇది 115 PS పవర్, 144 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. గేర్‌ బాక్స్ ఎంపికల్లో 6-స్పీడ్ మాన్యువల్‌తో పాటు IVT ఆటోమేటిక్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ఫీచర్లు ఉండవచ్చని, టాప్ వేరియంట్లలో లెవల్-2 ADAS అందించే అవకాశం ఉందని సమాచారం.

ధర ఎంత ఉండొచ్చు?

Advertisement

హ్యుందాయ్ బేయాన్ అంచనా ధర రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. బుకింగ్స్ కోసం రూ.11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉందని సమాచారం. ఈ SUV హ్యుందాయ్ వెన్యూ, క్రెటా మధ్య స్థానాన్ని భర్తీ  చేయనుంది. అంతేకాదు, మారుతి సుజుకి విక్టోరిస్, హోండా ఎలివేట్ లాంటి మోడళ్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. ధర, వేరియంట్లు, ఫీచర్లు, బుకింగ్ వివరాలపై కంపెనీ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.

Read Also: స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

Tags

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

Big Stories

Advertisement
×