Zebronics Juke Bar 3903: స్మార్ట్‌టీవీల వాడకం పెరిగిన తర్వాత, మంచి విజువల్స్‌తో పాటు పవర్ఫుల్ ఆడియో ఫీల్ కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.అయితే చాలా టీవీల బిల్ట్-ఇన్ స్పీకర్లు ఆశించిన స్థాయిలో సౌండ్‌ను ఇవ్వలేవు. ఆ లోటును తీరుస్తూ ప్రముఖ ఆడియో బ్రాండ్ జెట్రానిక్స్ అత్యంత ప్రజాదరణ పొందిన ‘Zebronics Juke Bar 3903’ సౌండ్‌బార్‌ను మార్కెట్లోకి తెచ్చింది. వీటికి ప్రస్తుతం డిమాండ్ చాలానే ఉంది. బడ్జెట్ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోడపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సౌండ్ బార్ క్లాసిక్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అంతే కాకుండా ఇది మోడర్న్‌గా డిజైన్ చేయబడింది. మీ లివింగ్ రూమ్‌లో టీవీ కింద దీనిని..సెట్ చేసినప్పుడు ఇల్లు ఒక మినీ థియేటర్ లాగా మారి పోతుంది. దీని కాంపాక్ట్ సైజ్ , ప్రీమియం ఫినిషింగ్ రూమ్ అందాన్ని మరింత పెంచుతుంది. గోడకు మౌంట్ చేసుకోవడానికి లేదా టీవీ టేబుల్‌పై పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.
ఈ సౌండ్‌బార్ మెయిన్ హైలైట్ దీని ఆడియో అవుట్‌పుట్. ఇది ఏకంగా 120 వాట్స్ పవర్ఫుల్ సౌండ్‌ను అందిస్తుంది. ఇందులో ఉన్న డ్యూయల్ డ్రైవర్లు ,వర్చువల్ 5.1 సరౌండ్ సౌండ్ టెక్నాలజీ కారణంగా.. సినిమా చూస్తున్నప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు ఆడియో ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. అంతే కాకుండా దీని బేస్ చాలా డీప్‌గా, క్లియర్‌గా వినిపిస్తుంది.
ప్రస్తుత టెక్నాలజీకి తగ్గట్టుగా ఇది లేటెస్ట్ బ్లూటూత్ v5.1 సపోర్ట్‌తో వస్తుంది. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్‌ను వైర్ లెస్ పద్ధతిలో.. క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. దీని కనెక్షన్ ఎప్పుడూ స్టేబుల్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఆడియో లాగ్ సమస్యలు అస్సలు రావు. బ్లూటూత్‌తో.. పాటు ఇతర మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఇందులో.. అందుబాటులో ఉన్నాయి. తద్వారా మీరు వివిధ డివైజెస్‌ను ఈజీగా కనెక్ట్ చేయెచ్చు.
Also Read: రూ.750కే అద్భుతమైన బ్లూటూత్..ఇయర్ బడ్స్! అస్సలు మిస్సవ్వొద్దు!
ఈ సౌండ్‌బార్ 2.1 ఛానల్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది డైలాగ్ క్లారిటీని ,మ్యూజిక్ బీట్స్‌ను విడి విడిగా స్పష్టంగా వినిపిస్తుంది. మీరు ఓటీటీలో సినిమాలు చూస్తున్నప్పుడు..అంతే కాకుండా స్పోర్ట్స్ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు లేదా పార్టీ సాంగ్స్ పెట్టినప్పుడు.. ఇది గదిని హోరెత్తిస్తుంది. కుటుంబం అంతా కలిసి వినోదాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.
అన్ని.. అడ్వాన్స్డ్ ఫీచర్లు, భారీ సౌండ్ పవర్‌తో.. వస్తున్న ఈ మోడల్ సౌండ్‌బార్ అసలు ధర మార్కెట్లో కేవలం రూ. 2,799 మాత్రమే ఉండటం నిజంగా నమ్మలేని విషయం. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ హోమ్ థియేటర్ ఫీల్ కోరుకునే వారికి ఇది సూపర్ డీల్.
అతి తక్కువ బడ్జెట్లో 120W పవర్ ఫుల్ సౌండ్, స్టైలిష్ లుక్ , మోడర్న్ కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఎంటర్ టైన్మెంట్ ఫీల్ ఇప్పుడే డబుల్ చేసుకోండి!