BigTV English
Advertisement

Smartphones In 2024 : 2024లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ఇవే! ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ

Smartphones In 2024 : 2024లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ఇవే! ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ

Smartphones In 2024 : 2024 లో లాంఛ్ అయిన బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ఎన్నో ఉన్నాయి. ఇందులో వన్ ప్లస్, రెడ్ మీ, నథింగ్ మొబైల్స్ ఉండగా.. వీటి ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ఈ ఏడాది లాంఛ్ అయిన మొబైల్స్ లో టాప్ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.


Redmi Note 14 series – Redmi Note 14 సిరీస్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Redmi Note 14, Redmi Note 14 Pro, Redmi Note 14 Pro+లలో వనిల్లా మోడల్ అత్యంత తక్కువ ధరలో ఉంటుంది. ఇది 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ని ప్రాసెసింగ్‌గా అందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Poco F6 5G – ఈ స్మార్ట్‌ఫోన్ పెద్ద 6.67 అంగుళాల AMOLED పంచ్ హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, సన్నని బెజెల్స్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. అలాగే HDR10 మద్దతు, 2400 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, డాల్బీ విజన్‌ ఉన్నాయి. గేమింగ్ కోసం చాలా బాగుంది. Poco F6 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది వీడియో ఎడిటింగ్, హై-గ్రాఫిక్స్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి పనులను చాలా స్పీడ్‌గా చేయగలదు. అంతేకాకుండా ఇది లిక్విడ్‌కూల్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. దీని కారణంగా గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా చేస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 8GB RAM + 256GB, 12GB RAM + 512GB వేరియంట్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 3 ఏళ్ల OS, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌తో డ్యూయల్ కెమెరా ఉన్నాయి.


OnePlus Nord 4 5G – కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ 4 కొన్ని వారాల క్రితం విడుదల చేసింది. ఇది 8/12జీబీ ర్యామ్‌తో Snapdragon 7+ Gen 3 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ UFS4.0ని ఉపయోగిస్తుంది. అయితే 128GB UFS 3.1కి రెస్టిక్ట్ చేయబడింది. 120Hz రిఫ్రెష్ రేట్, 2150 nits పీక్ బ్రైట్నెస్‌తో 6.74-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇందులో 50 Mp ప్రైమరీ సోనీ LYT600 సెన్సార్, 8 MP అల్ట్రావైడ్ సెన్సార్‌, సెల్ఫీలు, వీడియోస్ కోసం 16 MP సెన్సార్ ఉంది.

Nothing Phone 2a Plus – నథింగ్​ ఫోన్ 2aకు హై-ఎండ్ వెర్షన్ Nothing Phone 2a Plus. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆకట్టుకునే కెమెరా ఫీచర్‌లతో వచ్చింది. స్పష్టమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. 50 MP డ్యూయల్ కెమెరా సెటప్, 50 MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5000 mAh బ్యాటరీ సదుపాయం కూడా ఈ మెుబైల్ లో ఉంది.

ALSO READ : ఈ రెండింటిలో బెస్ట్ మెుబైల్ ఏది..?

Related News

Motorola Mobile Offer: ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌ డీల్‌.. రూ.19వేల మోటరోలా ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.15వేల లోపే..

Oneplus Nord 2T Ultra 5G: వన్‌ప్లస్‌ నోర్డ్‌ 2టీ అల్ట్రా 5జీ.. ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

AI Hospital Bill Error: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Big Stories

×