Moto G35 5G Vs Galaxy M15 5G : భారతీయ మార్కెట్లో మొబైల్స్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన వెంటనే టెక్ ప్రియులను ఆకర్షించేస్తుంది. ఇక టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలకు చెందిన మొబైల్స్ లాంచ్ అయ్యి కిరాక్ ఫీచర్స్ తో కిక్కెక్కిస్తున్నాయి. అయితే తాజాగా samsung కంపెనీ galaxy m15 మొబైల్ ను లాంఛ్ చేయగా.. మోటో G35 C మొబైల్ ను తీసుకువచ్చింది. ఇక ఈ రెండు మొబైల్ ఫీచర్స్ అదిరిపోయేలా ఉండగా.. వీటిలో ఏది బెస్ట్? మొబైల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఓ లుక్ చేద్దాం.
Moto G35 5G – Moto… డిసెంబర్ 12న Moto G35 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్, 50MP కెమెరాతో పాటు ఎన్నో ఫీచర్లతో వచ్చేసిన ఈ మెుబైల్… పై నో కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మెుబైల్ ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. 6.7 అంగుళాల FHD + డిస్‌ప్లే, 60Hz 120Hz రిఫ్రెష్ రేట్‌తో లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ లో Unisoc T760 చిప్‌సెట్ వచ్చేసింది.
యూజర్స్ 8GB వరకు RAMను పొడిగించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో రన్ అవుతుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్‌తో డ్యూయల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, ప్రైమరీ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వచ్చేసింది. 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP52 రేటింగ్ కూడా ఉంది. Moto G355G మెుబైల్ 4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.9999గా ఉంది.
Samsung Galaxy M15 5G – ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 12,999గా లిస్ట్ అయింది. అయితే కొనుగోలుదారులు రూ. 1,000 బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. దీంతో దీనిని రూ. 11,999కే కొనుక్కోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వచ్చేసింది. MediaTek డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్, 4GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది.
Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. 4GB + 128GB దీని ధర రూ. 13,499. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 14,999గా ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్‌పై రానుంది. 50మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఫ్రంట్ కెమెరా 13మెగాపిక్సెల్‌తో వచ్చే అవకాశం ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంటుంది.
ALSO READ : రూ.5000లోపే బెస్ట్ ఇయర్‌బడ్స్ ఎన్నో! టాప్ ఆఫ్షన్స్ ఇవే