BigTV English

Nara Devansh: రికార్డ్ బద్దలు కొట్టిన నారా దేవాన్ష్.. 9 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డ్..

Nara Devansh: రికార్డ్ బద్దలు కొట్టిన నారా దేవాన్ష్.. 9 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డ్..

Nara Devansh: తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నాడు నారా దేవాన్ష్. 9 ఏళ్ల వయస్సులో అరుదైన రికార్డు సాధించి, దేవాన్ష్ ఔరా అనిపించుకున్నాడు. మనవడి విజయాన్ని తెలుసుకున్న తాతలు సీఎం చంద్రబాబు, బాలకృష్ణ, తండ్రి మంత్రి నారా లోకేష్ లు దేవాన్ష్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ ఫాస్టెట్స్ చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్ అనే ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అవార్డును అందుకున్నాడు. అంతేకాదు తన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ చెక్‌మేట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును కూడా దక్కించుకున్నాడు. ఈ రికార్డ్‌ సాధించేందుకు దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పూర్తి చేశాడు. ప్రసిద్ధ చెస్ క్రీడ నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్ ఈ రికార్డును సాధించగలిగాడు.

మరో 2 రికార్డులు దేవాన్ష్ సొంతం..
ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1నిమిషం 43సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా ,మన లక్ష్యాన్ని చేరుకోవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగివున్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునకగా చెస్ ఛాంపియన్స్ అభివర్ణిస్తున్నారు.


పిన్నవయసులో తనయుడు దేవాన్ష్ సాధించిన విజయంపై తండ్రి లోకేష్ స్పందిస్తూ… దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందుతూ అత్యంత ప్రతిభ కనబరిచేవాడని తెలిపారు. గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి దేవాన్ష్ ప్రేరణ పొందాడన్నారు. దేవాన్ష్ కు చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు చెప్పారు లోకేష్. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5 – 6 గంటల పాటు శిక్షణ పొందాడని లోకేష్ తెలిపారు. దేవాన్ష్ కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి కూడా దేవాన్ష్ విజయంపై స్పందిస్తూ “దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థిగా అభివర్ణించారు. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం దేవాన్ష్ లో ఉందన్నారు.

Also Read: Benefit Shows In AP: ఏపీలో బెనిఫిట్ షోస్ రద్దుకు డిమాండ్స్.. ప్రభుత్వం ఎలా స్పందించెనో?

కాగా దేవాన్ష్ సాధించిన విజయంపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. నెటిజన్స్, టీడీపీ లీడర్స్, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. 9 ఏళ్ల వయస్సులో 3 ప్రపంచ రికార్డు నెలకొల్పే స్థాయికి దేవాన్ష్ చేరుకోవడం అభినందించదగ్గ విషయమని సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×