E-Paper
Advertisement

Best Mini Air Coolers: చేతిలో పట్టేసే బుల్లి బుల్లి ఏసీలు.. జస్ట్ రూ.700 నుంచి మొదలు, ఆలస్యం చేయొద్దు!

Best Mini Air Coolers: చేతిలో పట్టేసే బుల్లి బుల్లి ఏసీలు.. జస్ట్ రూ.700 నుంచి మొదలు, ఆలస్యం చేయొద్దు!
Advertisement

Best Mini Air Coolers: సాధారణంగా వేసవి కాలం మొదలైందంటే చాలు.. విపరీతమైన వేడి, ఒళ్లంతా చెమటలు.. అబ్బో చాలా చిరాకుగానూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు గంటల కొద్దీ తిరగాల్సిందే. ఈ క్రమంలో కరెంటు బిల్లు వేలకు వేలు వస్తుంటాయి. అయితే ఇంట్లో ఒకరిద్దరు ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆఫీస్‌లో డెస్క్ దగ్గర కూర్చుని పని చేస్తున్నప్పుడు, లేదా రాత్రి మంచంపై విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు.. కేవలం మన వరకు మాత్రమే చల్లని గాలి వస్తే చాలు అని చాలాసార్లు అనుకుంటుంటాం.

ప్రస్తుతం అలాంటి వారి కోసమే చిన్న సైజ్‌లో, తక్కువ ఖర్చుతో పనిచేసే మినీ ఎయిర్ కూలర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కరెంట్ బిల్లు కూడా ఎక్కువ రాదు. వీటిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ నేపథ్యంలో రూ.2వేల లోపే అందుబాటులో ఉండే మినీ ఎయిర్ కూలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. NTMY Portable Mini Air Cooler

Advertisement

అమెజాన్‌లో ఇది మోస్ట్ పాపులర్ మోడల్. ఈ ఎయిర్ కూలర్ నుంచి కేవలం గాలి మాత్రమే కాదు.. చల్లని నీటి తుంపర్లను చిమ్మే మిస్ట్ స్ప్రే ఫీచర్ కూడా ఉంది. ఏకంగా ఏడు రంగుల ఎల్‌ఈడీ లైట్లు, టైమర్ సెట్టింగ్‌లతో ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ కూలర్ USBతో పనిచేస్తుంది కాబట్టి.. పవర్‌బ్యాంక్‌కు కూడా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు.

Also Read: మార్కెట్లోకి అదిరిపోయే పోర్టబుల్ ఏసీలు.. ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలో పెట్టుకోవచ్చు!

2.  Drum stone Mini Portable Air Cooler

Advertisement

ఎలాంటి శబ్ధం లేకుండా పనిచేసే కూలర్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ కూరల్ గాలిని మాత్రమే కాకుండా, గదిలో తేమను పెంచే హ్యుమిడిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది చాలా చిన్నదిగా ఉండటం వల్ల బెడ్ పక్కన లేదా స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

3. Zynero or Dockwin Portable Mini Cooler

లాంగ్ జర్నీల్లో లేదా ఆఫీస్ డెస్క్ మీద వాడుకోవడానికి ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ కూలర్‌లో కొన్ని మోడల్స్‌కు రిమోట్ కంట్రోల్ సదుపాయం కూడా ఉండటం విశేషం. దీనిలోని నీటి ట్యాంక్‌ను నింపితే చాలు.. గంటల తరబడి చల్లని గాలిని అందిస్తుంది. బడ్జెట్ ధరలో ఆల్ ఇన్ వన్ ఫీచర్లు కోరుకునే వాళ్లు ఈ కూలర్‌ను కొనుగోలు చేయొచ్చు.

4. Mitsico USB Mini Evaporative Cooler

డబుల్ ఫ్యాన్ సెటప్‌తో వచ్చే ఈ కూలర్ మిగతా వాటికంటే కొంచెం ఎక్కువ గాలిని ఇస్తుంది. దీని డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. దీంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ కూలర్‌లోని కలర్‌ఫుల్ లైటింగ్ బెడ్ రూం లేదా సింగిల్ రూమ్‌లో అయినా ఓ మోడ్రన్ లుక్‌ను క్రియేట్ చేస్తుంది.

5. Bajaj or Symphony Personal/Tower Mini Cooler

ఒకవేళ పైన చెప్పిన వాటికంటే ఇంకాస్త పవర్‌ఫుల్ కూలర్ కావాలనకుంటే.. ఈ బ్రాండెడ్ పవర్ కూలర్లు తీసుకోవచ్చు. వీటి ధర రూ.5వేల పైనే ఉన్నప్పటికీ, 20 నుంచి 30 లీటర్ల ట్యాంక్ సామర్థ్యంతో బెడ్‌రూమ్‌ను సులభంగా చల్లబరచగలవు. క్వాలిటీ విషయంలో కూడా ఎలాంటి లోపాలు వెతకలేము ఈ కూలర్లలో. అయితే, ఈ మినీ కూలర్లు కేవలం పర్సనల్ అవసరాలకు మాత్రమే ఉపయోగపడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Also Read: ఈ దుస్తులను పొరపాటున కూడా వాషింగ్ మెషీన్‌లో వేయకండి, ఎందుకంటే?

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×