E-Paper
Advertisement

Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?

Dayakar Rao: నేను రాజకీయాల్లో ఉండాలా.. వద్దా..? కన్నీరు పెట్టుకున్న దయాకర్ రావు, అసలేం జరిగిందంటే..?
Advertisement

తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిన ఈ ప్రక్రియను చూస్తుంటే రాజకీయాల పట్ల విరక్తి కలుగుతోందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ చూడని దారుణాలను ఇప్పుడు చూస్తున్నానని వాపోయారు.

రాజకీయ విరక్తి కలిగిస్తోంది.. ఎర్రబెల్లి

ఎన్నికల నిర్వహణ తీరుపై ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విపక్షాలను అణచివేస్తోందని విమర్శించారు. తొర్రూరులో ప్రజలు తమకు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అధికార బలంతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా రాజకీయ విభేదాలు ఉండేవని.. అయితే ఇంతటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం విప్ జారీ చేయాల్సిన తనను అక్రమంగా అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు.

Advertisement

అరెస్టుల పర్వంపై ఆగ్రహం

పోలీసుల తీరును తప్పుబడుతూ తనను తన భార్యను ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారని ఎర్రబెల్లి ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలోని కార్యాలయానికి వెళ్లే హక్కు కూడా తనకు లేదా అని నిలదీశారు. తనను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అప్రజాస్వామికంగా నిర్వహించారని ఆవేదన చెందారు. ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తూ సాగుతున్న ఇటువంటి కక్షసాధింపు చర్యలు రాష్ట్ర రాజకీయాలకు గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు.

ప్రలోభాలకు లొంగని కౌన్సిలర్లు

Advertisement

పాలక పక్షం ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారని ఎర్రబెల్లి ప్రశంసించారు. తమ అభ్యర్థులకు కోట్ల రూపాయల ఆశ చూపినా వారు లొంగలేదని స్పష్టం చేశారు. నీతి నిజాయితీలతో ఉన్న తమను అధికార బలంతో ఓడించడం పిరికిపంద చర్య అని అభివర్ణించారు. కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం.. ప్రలోభ పెట్టడం వంటి చర్యలు అత్యంత హేయమని పేర్కొన్నారు.

ALSO READ: KCR Birthday Celebrations: ఘనంగా మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు.. ఆయన సేవలు చిరస్మరణీయం

కంటతడి పెట్టిన మాజీ మంత్రి

ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతున్న సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఇటువంటి కుటిల రాజకీయాలు చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ప్రజలు తమ పక్షాన ఉన్నా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగాలా లేక తప్పుకోవాలా అనే ఆలోచన కూడా వస్తోందని తన మనోవేదనను పంచుకున్నారు.

ALSO READ: Telangana: ఢిల్లీకి తెలంగాణ సర్కార్.. హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రుల బృందం కీలక భేటీ!

Related News

హైదరాబాద్‌కు సీఎం రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×