E-Paper
Advertisement

Smartphone deals: రూ. 15వేల రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు.. ఈరోజు టాప్ 5 బెస్ట్ డీల్స్ పూర్తి వివరాలు

Smartphone deals: రూ. 15వేల రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు.. ఈరోజు టాప్ 5 బెస్ట్ డీల్స్ పూర్తి వివరాలు
Advertisement

Smartphone deals: దేశవ్యాప్తంగా బడ్జెట్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్ రేసు మళ్లీ వేడెక్కింది. ముఖ్యంగా రూ.15,000 రేంజ్‌లో పోటీ మరింతగా పెరిగింది. బడ్జెట్ ధరలో 5జి ఫోన్‌లు కొనాలని చూస్తున్న వినియోగదారుల సంఖ్య పెరగడంతో పాటు, కొత్త మోడల్స్ వరుసగా లాంచ్ అవడం, పాత మోడల్స్‌పై ఆన్‌లైన్ స్టోర్లలో క్లియర్ స్టాక్ ఆఫర్లు రావడం అన్నీ కలిసి ఈరోజు మార్కెట్‌ను వినియోగదారులకే అనుకూలంగా మార్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ తమ ప్లాట్‌ఫారమ్‌లలో బడ్జెట్ 5జి ఫోన్లపై ఈరోజే ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. దీని వల్ల అసలు ధరతో పోలిస్తే రూ.3,000 నుండి రూ.5,000 వరకు తగ్గిన డీల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈరోజు హాట్ సేల్‌లో నిలిచిన టాప్ 5 ఫోన్‌ల ధరలు, ఆఫర్‌లు, తగ్గింపులు ఎలా ఉన్నాయో ఒక్కసారి లుక్ వేయండి.

మోడల్ ఒప్పో కె13ఎక్స్ 5జి ఏకంగా రూ.3,620 తగ్గింపు

Advertisement

మొదటగా మోడల్ ఒప్పో కె13ఎక్స్ 5జి. అసలు ధర రూ.12,999, అయితే అమెజాన్‌లో ప్రస్తుతం రూ.9,379 కు లభిస్తోంది. మొత్తం రూ.3,620 తగ్గింపు ఉండటం, ఈ మోడల్‌ను ఇతర ఫోన్లతో పోలిస్తే ఎక్కువ విలువ కలిగిన డీల్‌గా నిలబెట్టింది. 6000mAh పెద్ద బ్యాటరీ, 5జి నెట్వర్క్‌లో స్టబుల్ కనెక్టివిటీ, రోజువారీ ఉపయోగానికి సరిపోయే పనితీరు అన్నీ ఈ ధరలో చాలా బలంగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఇదే రేంజ్ ధర కనిపించడం వల్ల ఇది దేశవ్యాప్తంగా డిమాండ్ సంపాదిస్తున్న బడ్జెట్ 5జి ఫోన్‌గా మారింది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఆశించే వినియోగదారులు ఈ మోడల్‌నే ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు.

రియల్‌మి జి73 5జి.. రూ.1,000 తగ్గింపు

Advertisement

రియల్‌మి జి73 5జి మరో ప్రముఖ మోడల్. అసలు ధర రూ.12,999, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ధర రూ.11,999, అంటే రూ.1,000 తగ్గింపు మాత్రమే. కానీ తగ్గింపు తక్కువ అయినా ఈ మొబైల్ అమ్మకాలు మాత్రం అధికంగా ఉన్నాయి. రియల్‌మి మోడల్‌లలో ఫోటో క్వాలిటీ, స్టెబిల్ సాఫ్ట్‌వేర్ అనుభవం, ఫాస్ట్ ఇంటర్‌ఫేస్ అన్నీ ఈ మోడల్‌ను యువతకు ఆకర్షణీయంగా చేస్తున్నారు. రోజువారీ పనులకోసం ఎక్కువగా ఫోన్ వాడే వారు, సోషల్ మీడియా, వీడియోలు, కెమెరా అన్నింటిలో స్మూత్ అనుభవం కోరుకునేవారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది.

Also Read: Jio Mart Offers: కేవలం రూ.5కే కిలో ఉల్లిపాయలు.. జియోమార్ట్‌ సూపర్‌ సేవింగ్స్‌తో అద్భుత ఆఫర్లు

శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 16 5 జి భారీ తగ్గింపు

శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 16 5 జి మాత్రం ఈరోజు బడ్జెట్ మార్కెట్‌లో హైలైట్ గా మారింది. అసలు ధర రూ.15,499, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999, అంటే రూ.1,500 తగ్గింపు. శామ్‌సంగ్ బ్రాండ్ రెలిబిలిటీ, సెక్యూరిటీ అప్‌డేట్‌లు, ముఖ్యంగా అమోలేడ్ డిస్‌ప్లే అన్నీ ఈ ధరలో పెద్ద బెనిఫిట్‌గా అనే చెప్పాలి. డిస్‌ప్లేనే క్వాలిటీ చూసే వారికి, ఎఫ్16 5జి ఈ రేంజ్‌లో సాటిలేని ఎంపికగా నిలుస్తుంది. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా అన్నంటిలో రంగులు స్పష్టంగా కనిపించడం ఈ మోడల్‌కు పెద్ద ప్లస్ పాయింట్.

లావా స్టార్మ్ ప్లే 5జి పై రూ.1,500 తగ్గింపు

లావా స్టార్మ్ ప్లే 5జి కూడా ఈరోజు భారీగా సేల్ అవుతున్న మోడల్. అసలు ధర రూ.11,999, అమెజాన్‌లో ప్రస్తుత ధర రూ.10,499. మొత్తం రూ.1,500 తగ్గింపు ఈ ఫోన్‌ను దేశీయ వినియోగదారులకు మరింత దగ్గర చేస్తోంది. లావా బ్రాండ్ భారతీయ కంపెనీ కావడమే కాకుండా, ఫోన్‌లో వచ్చే స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి క్లీన్ ఇంటర్‌ఫేస్ వినియోగదారులకు ఇష్టపడే అంశంగా మారింది. ఫోన్‌లో ఉన్న పనితీరు, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ ఈ ధరలో తగినంతగా ఉండటం వల్ల బడ్జెట్ రేంజ్‌లో పరిశీలించదగిన ఆఫర్‌గా ఉంటుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఏ06 ఎంత తగ్గిందంటే?

చివరిగా శామ్‌సంగ్ గెలాక్సీ ఏ06 5జి అసలు ధర రూ.11,499, ప్రస్తుతం అమెజాన్, క్రోమా స్టోర్లలో రూ.10,499 కు లభిస్తోంది. మొత్తం రూ.1,000 తగ్గింపు వచ్చినా శామ్‌సంగ్ బ్రాండ్‌పై విశ్వాసం ఉన్న వినియోగదారులు ఈ మోడల్‌ను బాగా ఎంపిక చేస్తున్నారు. రోజువారీ ఉపయోగానికి కావలసిన బేసిక్ ఫీచర్స్, సరైన బ్యాటరీ బ్యాకప్, బడ్జెట్‌లో అందే శామ్‌సంగ్ యూఐ అన్నీ ఈ మోడల్‌ను పర్‌ఫెక్ట్ ఎంపికగా చూపిస్తున్నాయి.

ఈ అయిదు ఫోన్లలో ఏది బెస్ట్?

ఇప్పుడు ఈ అయిదు ఫోన్లను మొత్తం పరిశీలించి చూస్తే, అత్యధిక తగ్గింపు ఒప్పో కె13ఎక్స్ 5జి పై ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కావాలంటే ఇది బెస్ట్ ఆఫర్. కానీ వినియోగదారుడికి మొత్తం విలువ, బ్రాండ్ నమ్మకం, డిస్‌ప్లే నాణ్యత, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సపోర్ట్ అన్నీ ఒకే సమయంలో కావాలంటే మాత్రం ఈరోజు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం స్పష్టంగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 16 5 జి మీదే ఉంది. రూ.15,000 రేంజ్‌లో అందుబాటులో ఉన్న ఈ మోడల్ వినియోగదారుడికి దీర్ఘకాలికంగా మంచి అనుభవం ఇస్తూ బడ్జెట్ క్లాస్‌లో లీడింగ్‌లో నిలుస్తోంది.

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×