E-Paper
Advertisement

Teja Sajja: తేజా సజ్జా లైనప్ అదిరింది.. ఒకేసారి రెండు సీక్వెల్స్.. జై హనుమాన్ లేనట్లే..?

Teja Sajja: తేజా సజ్జా లైనప్ అదిరింది.. ఒకేసారి రెండు సీక్వెల్స్.. జై హనుమాన్ లేనట్లే..?
Advertisement

Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో స్టార్ హీరోల సరసన నటించాడు.. హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తేజ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన గతంలో చేసిన సినిమాలు అన్నీ కూడా పర్వాలేదు అని అనిపించాయి కానీ బిగ్గెస్ట్ హిట్ మాత్రం అందివ్వలేదు. ఈమధ్య వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ వస్తున్నాడు తేజ.. హనుమాన్, మిరాయ్ మూవీలతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. మిరాయ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా తేజా మరో రెండు సీక్వెల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మూవీల గురించి తెలుసుకుందాం..

భారీ బడ్జెట్ చిత్రాలకు తేజా గ్రీన్ సిగ్నల్..

రీసేంట్ గా మిరాయ్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడేమో సీక్వెల్స్ లో నటిస్తున్నాడు. త్వరలో ‘జాంబిరెడ్డి 2′, ‘మిరాయ్‌ 2’ సినిమాలను సమాంతరంగా పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి మధ్యలో ‘జాంబిరెడ్డి 2’, మార్చిలో ‘మిరాయ్‌ 2’ సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.. ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. తేజ సజ్జా వరుస పాన్‌ ఇండియా విజయాల తర్వాత చేస్తున్న ఈ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.. మార్చి నాటికి ‘మిరాయ్‌ 2’ షూట్‌ ప్రారంభం కానుందని సమాచారం.. సీక్వెల్ మూవీలో భారీ విజువల్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.. ఈ సినిమాల గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది..

Advertisement

Also Read : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు.. ఆ 5 మిస్ అవ్వకండి..

జై హనుమాన్ అటకెక్కినట్లేనా..? 

హీరో తేజా సజ్జా నటించిన హనుమాన్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేయడంతో తేజ ఖాతాలో బిగ్గెస్ట్ హెట్ పడిపోయింది.. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతున్నా కూడా సెట్స్ మీదకి ఇంకా వెళ్ళలేదు. ఆ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ ని త్వరలోనే తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు నిర్మాతల మధ్య గొడవల కారణంగా ఆ సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.. ఆ మధ్య ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని డైరెక్టర్ చెప్పారు. ఇక ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎక్కడ ప్రస్తావించినా దాఖలాలు లేవు.. ఇప్పుడు నిర్మాతలకు, డైరెక్టర్ కు మధ్య జరుగుతున్న గొడవల కారణంగా ఈ సినిమా ఇక ఎప్పటికీ లేనట్లే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏమైన స్పందిస్తారేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందే అంటూ తేజ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు…

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×