Mobile discount offer today: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ధరల తగ్గింపును ప్రకటించాయి. ఈరోజు ఆఫర్లలో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్స్ నుంచి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ వరకు అన్నిటిపైనా లిమిటెడ్ పీరియడ్ డీల్స్ ,బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరి లేటెస్ట్ ఫోన్లపై ఈరోజు ఉన్న బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఐఫోన్ లేదా వన్‌ప్లస్ లాంటి సూపర్ ప్రీమియం ఫోన్లను భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవాలనుకుంటే ఈరోజు ఆఫర్లను అస్సలు వదులుకోవద్దు. మార్కెట్లోకి వచ్చిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ వన్‌ప్లస్ 13 మొబైల్ పై ఏకంగా 21 శాతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీనివల్ల 12GB రామ్ , 256GB స్టోరేజ్ ఉన్న ఈ పవర్‌ఫుల్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 57,999 ధరకే అందుబాటులోకి వచ్చింది. హై-ఎండ్ పర్ఫార్మెన్స్ , అదిరిపోయే కెమెరా క్వాలిటీ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.
యాపిల్ బ్రాండ్ ప్రేమికులకు కూడా ఈరోజు మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సరికొత్త యాపిల్ ఐఫోన్ 17e మోడల్ ఇప్పుడు రూ. 64,900 ప్రారంభ ధర నుంచి కొనుగోలు చేయడానికి లభిస్తోంది. దీంతో పాటు గతంలో భారీ డిమాండ్ ఉన్న ఐఫోన్ 15 మోడల్ పై కూడా మంచి ప్రైస్ డ్రాప్ కనిపించింది. ఈ లేటెస్ట్ సేల్ లో ఐఫోన్ 15 128GB వేరియంట్ కేవలం రూ. 57,900 లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రీమియం మోడల్స్ పై లభించే అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.
భారీ ఫీచర్లు , స్టైలిష్ లుక్ ఉండే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ల కేటగిరీలో కూడా బ్రాండ్లు సూపర్ డీల్స్ అందించాయి. పవర్‌ఫుల్ గేమింగ్ ప్రాసెసర్, స్పీడ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఐకూ 15R స్మార్ట్‌ఫోన్ పై ఈరోజు 13 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని వల్ల 8GB రామ్ ,256GB స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ఇప్పుడు రూ. 46,999 ధరకు అందుబాటులో ఉంది. అలాగే కెమెరాకు, ప్రీమియం లుక్‌కు పేరుగాంచిన ఒప్పో రెనో 14 5G ఫోన్ ధర భారీగా డ్రాప్ అయింది. ఈ 12GB రామ్, 256GB స్టోరేజ్ ఉన్న లేటెస్ట్ ఫోన్ ఫ్రీ డెలివరీ ఆప్షన్‌తో ఇప్పుడు కేవలం రూ. 30,999 లకే లభిస్తోంది.
సాధారణ కస్టమర్లకు తక్కువ ధరలోనే బెస్ట్ 5G ఫోన్ కావాలనుకునే మిడిల్ క్లాస్ యూజర్లకు ఈరోజు కొన్ని బెస్ట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ నుంచి వచ్చిన సరికొత్త రియల్‌మీ 14T 5G స్మార్ట్‌ఫోన్ ఈరోజు సేల్ లో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. 8GB రామ్ , 128GB స్టోరేజ్ ఉన్న ఈ లేటెస్ట్ మొబైల్‌ను కేవలం రూ. 13,499 లకే సొంతం చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రామ్ మరియు మంచి లుక్ కోరుకునే వారికి ఇది వంద శాతం పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.
దీంతో పాటు మార్కెట్లో మంచి నమ్మకాన్ని సంపాదించుకున్న రెడ్‌మి బ్రాండ్ నుండి వచ్చిన రెడ్‌మి 13 5G ఫోన్ కూడా ఆఫర్ల లిస్ట్ లో నిలిచింది. ఈ 8GB రామ్ ,128GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను ఈరోజు ఆఫర్ లో భాగంగా కేవలం రూ. 13,999 లకే కొనుగోలు చేయవచ్చు. పెద్ద డిస్‌ప్లే, నమ్మకమైన సాఫ్ట్‌వేర్ , మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ వెతికే వారికి ఈ రెడ్‌మి మొబైల్ చాలా బాగా సెట్ అవుతుంది.