E-Paper
Advertisement

ట్రక్ కొన్నా డెలివరీ ఇవ్వని షో రూమ్ సిబ్బంది, అమెరికాలో ఆసక్తికర ఘటన!

ట్రక్ కొన్నా డెలివరీ ఇవ్వని షో రూమ్ సిబ్బంది, అమెరికాలో ఆసక్తికర ఘటన!
Advertisement

అమెరికా కాన్సాస్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన ఫోర్డ్ F 250 పికప్ ట్రక్కును యజమానికి డెలివరీ చేయాల్సి ఉండగా,  చివరి క్షణంలో డెలివరీ ఇవ్వలేమని తేల్చి చెప్పారు షోరూమ్ సిబ్బంది. ఇందుకు కారణం ఓ పక్షి అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? పక్షికి, ట్రక్ డెలివరీకి సంబంధం ఏంటి? అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ట్రక్ టైరు మీద గూడు పెట్టిన రాబిన్ పక్షి

Advertisement

డెలివరీకి ముందు డీలర్‌ షిప్ సిబ్బంది ట్రక్కును పరిశీలిస్తున్న సమయంలో ట్రక్కు టైరు దగ్గర చిన్న గూడు ఉండటాన్ని గమనించారు. తొలుత అది సాధారణ విషయం అనుకున్నా, ఆ గూడు లోపల నాలుగు గుడ్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో ట్రక్ డెలివరీ ఇవ్వలేమని షోరూమ్ సిబ్బంది తేల్చి చెప్పారు. పక్షి పిల్లలు చేసి, అవి బయటకు వెళ్లే వరకు డెలివరీ ఉండదన్నారు.

సిబ్బంది ఎందుకలా చేశారు?  

అమెరికాలో వలస పక్షులను రక్షించడానికి ప్రత్యేక ఫెడరల్ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం, స్థానిక పక్షుల గూళ్లను,  వాటి పిల్లలను ఇబ్బంది పెట్టడం నిషేధం. ముఖ్యంగా గూడు ఉన్న ప్రదేశాన్ని కదిలించడం, తొలగించడ, పక్షి పిల్లలకు హాని కలిగేలా వ్యవహరించడం చట్ట విరుద్ధం. అందులో భాగంగానే ఆ ఫోర్డ్ ట్రక్కు టైరు మీద ఉన్న గూడును కదిలించేందుకు సిబ్బంది ఒకప్పుకోలేదు.  పక్షి పిల్లలు పెరిగి గూడు విడిచే వరకు ట్రక్కు అక్కడే ఉండాల్సి ఉంటుందన్నారు. సాధారణంగా రాబిన్ పక్షి పిల్లలు కొన్ని వారాల్లోనే ఎగురుతాయి. అప్పటి వరకు ఆ ట్రక్కు అలాగే నిలిపి ఉంచనున్నారు.

సరదాగా తీసుకున్న ట్రక్ యజమాని!

Advertisement

అటు, ట్రక్కు కొనుగోలు చేసిన యజమాని ఈ ఘటనపై అసహనం చూపించకుండా సరదాగా తీసుకున్నారు. ఆయన కూడా పక్షి పిల్లలు సురక్షితంగా పెరగాలని కోరుకుంటున్నట్లు మీడియా వెల్లడించింది. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో  వైరల్ అయింది.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

చాలామంది నెటిజన్లు ఈ ఘటనపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నపారు. “ఇది అమెరికాలో అత్యంత సురక్షితమైన పికప్ ట్రక్ అయి ఉండొచ్చు” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు “ట్రక్కు ఇప్పుడు అధికారికంగా రాబిన్ కుటుంబ ఆస్తి” అని మరికొంత మంది జోకులు పేలుస్తున్నారు. ప్రకృతి, జంతువుల సంరక్షణ విషయంలో అమెరికా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి చూపించింది. సాధారణంగా మనం వాహనాలను కేవలం వస్తువులుగా చూస్తాం. కానీ, చిన్న పక్షి గూడు కారణంగా లక్షల రూపాయల విలువైన ట్రక్కును కూడా కదపకుండా ఆపేయడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ ట్రక్కు డెలివరీ ఎప్పుడు జరుగుతుందనేది పక్షి పిల్లలపైనే ఆధారపడి ఉంది. అవి గూడు విడిచి ఎగిరిపోయిన తర్వాతే యజమానికి కొత్త ట్రక్కు అందుతుంది.

Read Also: AMT vs CVT vs DCT vs DSG.. వామ్మో.. ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ లో ఇన్ని రకాలున్నాయా?

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×