E-Paper
Advertisement

ఫ్యాన్ తిరుగుతుంది కానీ బిల్లు రాదు.. ఈ లేటెస్ట్ ఫ్యాన్ల ధరలు తెలుసా?

ఫ్యాన్ తిరుగుతుంది కానీ బిల్లు రాదు.. ఈ లేటెస్ట్ ఫ్యాన్ల ధరలు తెలుసా?
Advertisement

Best ceiling fans India: ప్రస్తుతం ఎండలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్ అనేది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అయితే నేడు పాతకాలపు ఫ్యాన్లు వాడటం వల్ల గాలి సరిగ్గా రాకపోగా.. నెల తిరిగేసరికి కరెంట్ బిల్లులు మోత మోగిపోతుంటాయి. అందుకే ఇప్పుడు అందరూ స్మార్ట్ అండ్ పవర్‌ఫుల్ బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా రిమోట్‌తో పనిచేస్తూ కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గిస్తాయి. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ పాపులర్ అయిన, కస్టమర్ల నమ్మకాన్ని పొందిన టాప్ 5 బెస్ట్ సీలింగ్ ఫ్యాన్ల ధరలు, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం.

సీలింగ్ ఫ్యాన్ల మార్కెట్లో సరికొత్త టెక్నాలజీ:

ప్రస్తుతం ఫ్యాన్ల రంగంలో పెద్ద విప్లవమే వచ్చింది. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మోడల్స్ అన్నీ 5-స్టార్ రేటింగ్‌తో వస్తున్నాయి. ముఖ్యంగా బిఎల్డిసి అంటే బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్ ఉన్న ఫ్యాన్లు కేవలం 28 నుండి 35 వాట్ల కరెంట్ మాత్రమే వాడుకుంటాయి. దీనికి తోడు వీటికి రిమోట్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉండటంతో ఎక్కడి నుంచైనా స్పీడ్ మార్చుకోవచ్చు లేదా టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ల ధరలు వాటి బ్రాండ్ వాల్యూ , డిజైన్‌ను బట్టి మారుతుంటాయి.

Advertisement

క్రోంప్టన్ ఎనర్జియాన్ 5-స్టార్ బిఎల్డిసి ఫ్యాన్:
క్రోంప్టన్ బ్రాండ్‌కు చాలా క్రేజ్ ఉంది. వీరు అందిస్తున్న ఎనర్జియాన్ సిరీస్ ఫ్యాన్లు కరెంట్ ఆదా చేయడంలో నంబర్ వన్‌గా నిలిచాయి. ఈ ఫ్యాన్ కేవలం 35 వాట్ల పవర్‌ను మాత్రమే తీసుకుంటుంది, దీనివల్ల మీ ఇంటి కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది. ఇది స్మార్ట్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. దీని గాలి వేగం రూమ్ మొత్తం సమానంగా విస్తరిస్తుంది. పెద్ద గదులకు కూడా ఇది చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో క్రోంప్టన్ ఎనర్జియాన్ బేసిక్ మోడల్ అంచనా ధర రూ. 2,999 గా ఉంది.

హావెల్స్ గ్లాజా డెకోరేటివ్ ఫ్యాన్:
మీ ఇంటికి మోడ్రన్ , ఎలిగెంట్ లుక్ రావాలనుకుంటే హావెల్స్ బ్రాండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. హావెల్స్ గ్లాజా సిరీస్ ఫ్యాన్లు చాలా స్టైలిష్ డిజైన్, అద్భుతమైన డ్యూయల్ కలర్ కాంబినేషన్లతో వస్తాయి. ఇందులో యాంటీ-డస్ట్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఈ ఫ్యాన్ రెక్కలపై ధూళి లేదా బూజు అంత త్వరగా పేరుకుపోదు. దీని వల్ల ఫ్యాన్‌ను మాటిమాటికీ తుడవాల్సిన తిప్పలు తప్పుతాయి. సూపర్ గాలితో పాటు హాల్ చూడటానికి ఎంతో రిచ్‌గా ఉండాలి అనుకునే వారి కోసం రూపొందించిన ఈ హావెల్స్ ఫ్యాన్  ధర రూ. 2,499 గా అందుబాటులో ఉంది.

Advertisement

ఓరియంట్ ఎలక్ట్రిక్ అపెక్స్:
మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, ఎక్కువ కాలం ఎలాంటి రిపేర్లు లేకుండా నిరంతరం తిరిగే నమ్మకమైన నార్మల్ ఫ్యాన్ కావాలనుకుంటే.. ఓరియంట్ అపెక్స్ ఒక ఎవర్గ్రీన్ మోడల్. ఇది చాలా ఏళ్లుగా ఇండియన్ ఇళ్లలో సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ ఇస్తోంది. దీని మోటార్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండి, హై-స్పీడ్ గాలిని అందిస్తుంది. మాకు రిమోట్ వద్దు, ఎలాంటి ఫ్యాన్సీ ఫీచర్లు వద్దు, తక్కువ ధరలో గట్టి ఫ్యాన్ చాలు అనుకునే మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది బెస్ట్ ఛాయిస్. మార్కెట్లో ఓరియంట్ ఎలక్ట్రిక్ అపెక్స్ ఫ్యాన్  ధర కేవలం రూ. 1,599 మాత్రమే.

అటమ్‌బర్గ్ స్మార్ట్ ఫ్యాన్:
మనదేశంలో బిఎల్డిసి ఫ్యాన్ల ట్రెండ్‌ను సెట్ చేసిన సరికొత్త అడ్వాన్స్డ్ బ్రాండ్ అటమ్‌బర్గ్. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన రెనెసా మోడల్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం 28 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడుకుంటూ ఇన్వర్టర్ పై ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువ సమయం తిరుగుతుంది. దీని రిమోట్ లో స్లీప్ మోడ్, టైమర్ , గాలిని పెంచే బూస్ట్ మోడ్ వంటి క్రేజీ ఫీచర్లు ఉన్నాయి. దీని లుక్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ అటమ్‌బర్గ్ రెనెసా ఫ్యాన్ ధర రూ. 3,699 గా ఉంది.

ఉషా డిప్లొమాట్ హై స్పీడ్:
మన దేశంలో ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన నమ్మకమైన పాత బ్రాండ్ ఉషా. వీరి నుండి వచ్చిన డిప్లొమాట్ మోడల్ తక్కువ బడ్జెట్ ధరలో సూపర్ స్పీడ్ గాలిని ఇస్తుంది. దీని బ్లేడ్ల డిజైన్ గదిలోని నాలుగు మూలలకూ గాలిని సమానంగా నెడుతుంది. ఇంట్లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కూడా ఇది వేగంగా తిరగడం దీని ప్రత్యేకత. లాంగ్ లైఫ్ , పటిష్టమైన బాడీ క్వాలిటీతో వచ్చే ఈ ఉషా డిప్లొమాట్ ఫ్యాన్  ధర రూ. 1,799 గా మార్కెట్లో లభిస్తోంది.

సీలింగ్ ఫ్యాన్ కొనేటప్పుడు కేవలం ధర మాత్రమే కాకుండా అది ఎంత కరెంట్ బిల్లును మిగులుస్తుంది . దానికి ఎన్ని ఏళ్ల వారంటీ ఉంది అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. మీకు లాంగ్ టర్మ్‌లో కరెంట్ బిల్లు సేవ్ అవ్వాలి, రిమోట్ ఫీచర్ కావాలి అనుకుంటే అటమ్‌బర్గ్ లేదా క్రోంప్టన్ బిఎల్డిసి ఫ్యాన్లను బ్లైండ్‌గా ఎంచుకోవచ్చు. అలా కాకుండా తక్కువ ధరలోనే బ్రాండెడ్ క్వాలిటీ కావాలనుకుంటే ఓరియంట్ లేదా ఉషా మోడల్స్ వైపు వెళ్ళవచ్చు.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×