E-Paper
Advertisement

BSNL మరో క్రేజీ ప్లాన్.. 3 నెలల పాటు.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్!

BSNL మరో క్రేజీ ప్లాన్.. 3 నెలల పాటు.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్!

BSNL Plan: దేశంలో అత్యంత చౌకైన ప్లాన్స్ అందించే టెలికాం సంస్థగా బీఎస్ఎన్ఎల్ (BSNL)కు పేరుంది. ఎవరూ ఊహించని ధరలో.. అద్భుతమైన బెనిఫిట్స్ ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ ను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంటుంది. ఈ క్రమంలోనే తీసుకొచ్చిన రూ.599 ప్లాన్.. యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. 3 నెలల ప్రీపెయిడ్ విభాగంలో ఎక్కువ మంది ఈ ప్లాన్ పై ఆసక్తి కనబరుస్తున్నట్లు టెలికాం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.599 ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రూ.599 ప్లాన్ బెనిఫిట్స్..

ఒక కంప్లీట్ ఆల్ రౌండర్ ప్లాన్ గా బీఎస్ఎన్ఎల్ దీనిని తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ కింద.. యూజర్ కు ప్రతీరోజూ 3GB డేటా లభిస్తుంది. ప్లాన్ పూర్తయ్యే కాలానికి ఏకంగా 252 GBని యూజర్ వినియోగించుకోవచ్చు. అంటే రోజుకు సుమారు రూ.7 ఖర్చుతో ఈ డేటా బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు. ఒకవేళ రోజువారీ డేటా పరిమితి ముగిసినా.. 40 Kbps వేగంతో అపరిమితంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మరోవైపు ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం చేసుకోవచ్చు. అలాగే జింగ్ (Zing), కాలర్ ట్యూన్స్ (PRBT), ఆస్ట్రోటెల్ వంటి సేవలను ఉచితంగా పొందొచ్చు.

ఎవరికి లాభం?

రోజువారీ డేటా ఎక్కువ అవసరం ఉన్నవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి, ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు.. 3GB డేటా ప్రయోజనకరంగా ఉంటుంది. సినిమాలు, వీడియోలు, యూట్యూబ్ స్ట్రీమింగ్ చేసేవారికి సైతం ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ, కంప్లీట్ ఆల్ రౌండర్ ప్యాక్ కోరుకునేవారికి ఇది సరిగ్గా సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: జియో దుమ్మురేపే ప్లాన్స్.. అపరిమిత 5G డేటా, నాన్‌స్టాప్ కాల్స్.. ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

మెుబైల్ లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ (BSNL Selfcare) యాప్ డౌన్ లోడ్ చేసి నేరుగా రూ.599 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే థర్డ్ పార్టీ యాప్స్ అయిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పేను ఉపయోగించుకోవచ్చు. ఆయా యాప్స్ లోని రీఛార్జ్ సెక్షన్ లోకి వెళ్లి బీఎస్ఎన్ఎల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ప్లాన్ ను ఎంచుకోవచ్చు. అలా కుదరని పక్షంలో నేరుగా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను దక్కించుకోవచ్చు.

Also Read: KYC సేవలు నిలిపివేత.. 24 గంటల్లో BSNL సిమ్ బ్లాక్.. ఈ ప్రచారంలో నిజమెంత?

Related News

గూగుల్‌కు ‘సెర్చ్’ బ్రేక్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు.. ఆందోళనలో యూజర్లు!

బడ్జెట్ ధరలో టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!

వాషింగ్ మిషన్ వాడుతున్నారా? మీరు చేసే ఈ చిన్న తప్పు.. బట్టలను పనికిరాకుండా చేస్తున్నాయ్!

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు!

వాషింగ్ మిషన్ బ్యాడ్ స్మెల్ వస్తోందా? వెంటనే ఇలా చేయండి.. కేవలం 10 నిమిషాల్లో!

AC Water Tips: ఏసీ నీటిని మొక్కలకు పోస్తున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

ఇంట్లో ఇన్వర్టర్ ఎక్కడ ఉంచాలి ? ఈ చిట్కాలు పాటిస్తే.. బ్యాటరీ లైఫ్ రెట్టింపు!

అయ్య బాబోయ్.. జస్ట్ రూ.799కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్సా? ఫీచర్లు చూస్తే వెంటనే ఆర్డర్ చేసేస్తారు!

Big Stories

×