E-Paper
Advertisement

పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంకులతో నో టెన్షన్.. ఫాస్ట్ ఛార్జింగ్ గ్యారెంటీ!

పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంకులతో నో టెన్షన్.. ఫాస్ట్ ఛార్జింగ్ గ్యారెంటీ!
Advertisement

Pocket Friendly Power Bank: ఇంటర్నెట్ వాడకం పెరిగాక స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీ చాలా వేగంగా అయిపోతోంది. ముఖ్యంగా మనం ఆఫీసు పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా లాంగ్ జర్నీలు చేస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ అయితే పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జేబులో పవర్ బ్యాంక్ ఉండటం కంపల్సరీ అయిపోయింది. అయితే.. భారీ ధరలు పెట్టకుండా కేవలం రూ.1,500 లోపు బడ్జెట్లోనే లభిస్తూ, ఫోన్లను సూపర్ ఫాస్ట్‌గా ఛార్జ్ చేసే టాప్ 5 పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్స్ ఏంటో వాటి ధరలతో సహా ఇప్పుడు చూద్దాం.

బెస్ట్ పవర్ బ్యాంక్స్:

మార్కెట్లో వందల రకాల పవర్ బ్యాంకులు ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం పాడవకుండా ఉండే నమ్మకమైన బ్రాండెడ్ డివైజ్‌లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ స్మార్ట్‌ ఫోన్‌ను సేఫ్‌గా.. స్పీడ్‌గా ఛార్జ్ చేసే బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్స్ ఇవే..

Advertisement

1. Mi Power Bank 3i (10000mAh):
బడ్జెట్ యాక్సెసరీస్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే మొదటి బ్రాండ్ షావోమి (Xiaomi). ఈ పవర్ బ్యాంక్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉంటుంది. ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మెటాలిక్ బాడీ డిజైన్‌తో వచ్చే ఈ పవర్ బ్యాంక్‌లో అడ్వాన్స్‌డ్ 12-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే మీ ఫోన్ ఓవర్ హీటింగ్ అయ్యే ఛాన్సే లేదు.

ధర: రూ.1,199.

Advertisement

2. Ambrane Stylo 20K (20000mAh):
మీకు రూ. 1500 లోపు భారీ బ్యాటరీ కెపాసిటీ కావాలనుకుంటే అంబ్రేన్ బ్రాండ్ బెస్ట్ ఆప్షన్. ఇది ఏకంగా 20000mAh మెగా బ్యాటరీతో వస్తుంది. దీనిలోని 22.5W గ్రీన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా స్పీడ్‌గా ఛార్జ్ అవుతాయి. ఇందులో ట్రిపుల్ అవుట్‌పుట్ పోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఒకే సారి మూడు డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.

ధర: రూ.1,499.

3. Portronics Titan 35 (20000mAh):
పోర్ట్రానిక్స్ నుంచి రీసెంట్‌గా మార్కెట్లోకి వచ్చిన క్రేజీ మోడల్ ఇది. హెవీ యూజర్లకు ఇది బాగా నచ్చుతుంది. 20000mAh బ్యాటరీతో పాటు బుల్లెట్ స్పీడ్‌తో పనిచేసే 35W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ దీని సొంతం. దీనిపై ఉండే ఎల్‌ఈడీ డిస్‌ప్లే పవర్ బ్యాంక్‌లో ఎంత బ్యాటరీ ఉందో పక్కాగా చూపిస్తుంది.

ధర: రూ. 1,699.

Also Read: ఒకేసారి 3 డివైజ్‌లకు ఛార్జ్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

4. URBN 10000mAh Premium Nano Power Bank:
పెద్ద పెద్ద పవర్ బ్యాంకులు జేబులో పెట్టుకోవడం కష్టం అనుకునే.. వారి కోసం ఈ అల్ట్రా కాంపాక్ట్ పవర్ బ్యాంక్ డిజైన్ చేశారు. ఇది మీ అరచేతి పరిమాణంలో చాలా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటికీ ఇది 22.5W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. జేబులో వేసుకుని తిరగడానికి ఇది చాలా కంఫర్టబుల్.

ధర: రూ.1,299.

5. Realme 10000mAh Power Bank 2:
రియల్‌మి బ్రాండ్ నుంచి వచ్చిన ఈ పవర్ బ్యాంక్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో చాలా ట్రెండీగా కనిపిస్తుంది. ఇది 18W టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో లో-కరెంట్ మోడ్ కూడా ఉంది. దీని వల్ల మీ స్మార్ట్ వాచ్, బ్లూటూత్ ఇయర్‌ బడ్స్‌ను కూడా చాలా సేఫ్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు.

ధర: రూ. 1,099.

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×