E-Paper
Advertisement

Oman To India: ఒమన్ నుంచి భారత్‌కు గ్యాస్ పైప్‌లైన్.. ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్, హార్మూజ్‌ సంబంధం లేకుండా

Oman To India: ఒమన్ నుంచి భారత్‌కు గ్యాస్ పైప్‌లైన్.. ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్, హార్మూజ్‌ సంబంధం లేకుండా
Advertisement

Oman To India: పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా యుద్ధం మొదలై 100 రోజులు పూర్తి చేసుకుంది. పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. కాల్పుల విరమణ పేరుతో ఇరు దేశాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నాయి. పరిస్థితి గమనించిన భారత్, ఇంధన సరఫరాను సురక్షితంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఒమన్ నుంచి గుజరాత్‌కు అరేబియా సముద్రం ద్వారా 2 వేల కిలోమీటర్ల గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు అనుకున్నట్లు జరిగితే ఇంధన రంగంలో భారత్ గేమ్ ఛేంజర్‌గా మారవచ్చని అంటున్నారు.

ఒమన్ నుంచి భారత్‌కు గ్యాస్ పైప్‌లైన్.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ చర్చ

Advertisement

ఒమన్-భారత్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ మూడు దశాబ్దాలుగా కాగితాలకు పరిమితమైంది. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ఇంధన భద్రతపై ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఒమన్ నుంచి గుజరాత్ వరకు అరేబియా సముద్రం ద్వారా దాదాపు 2 వేల కిలోమీటర్ల మేరా గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం. ఈ ప్రాజెక్టు రూపు దాల్చితే భారత్‌కు సహజ వాయువు సరఫరా నిరంతరాయంగా పొందవచ్చు.

హార్మూజ్‌ జలసంధిపై ఆధారపడకుండా గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా పొందవచ్చు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 40 వేల వ్యయం అవుతుందని ఓ అంచనా. ఒమన్-భారత్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు మూడు దశాబ్దాలుగా నలుగుతోంది. భారీ వ్యయాలు, సాంకేతిక సవాళ్లు, వాణిజ్యపరమైన అడ్డంకుల కారణంగా ఒక్క అడుడు ముందుకు పడలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్న సౌత్ ఆసియా గ్యాస్ ఎంటర్‌ప్రైజ్-SAGE సంస్థ సర్వేలు, సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనాలను పూర్తి చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చినట్లయ్యింది.

Advertisement

ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్, హార్మూజ్‌ సంబంధం లేకుండా

అంతా అనుకున్నట్లు జరిగితే ప్రపంచంలో సముద్రం గ్యాస్ పైప్‌లైన్‌ల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే గల్ఫ్ నుంచి భారత్‌కు నేరుగా గ్యాస్ రావనుంది. హార్మూజ్‌ జలసం రవాణాపై ఆధారపడే పరిస్థితి తగ్గే అవకాశం ఉంది. ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది భారత్ . అవసరమైన ముడి చమురు, సహజ వాయువులో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. అదంగా హార్మూజ్‌ జలసంధి ద్వారా వస్తుంది. ఈ మార్గంలో అంతరాయాలు ఏర్పడితే ఇంధన ధరలు, రవాణా, సరఫరా గొలుసులపై పెను ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పైప్‌లైన్‌ సముద్ర మట్టానికి 3,000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నిర్మించాలి. అంత లోతులో నిర్మాణ పనులు చేపట్టేందుకు అత్యాధునిక సాంకేతికత అవసరం కానుంది. ఏదైనా లీకయితే సాంకేతిక వైఫల్యాన్ని మరమ్మత్తు చేయడం ఖర్చుతో కూడుకున్నది. సమయం కూడా పడుతుంది. నిధుల సమీకరణ మరో సవాలుగా మారనుంది. ప్రాజెక్టు ప్రతిపాదనల ప్రకారం.. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ రవాణా ఖర్చు ప్రతి మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(MMBtu)కు సుమారు 2 నుంచి 2.25 డాలర్ల మధ్య ఉండవచ్చని ఓ అంచనా. ఈ ప్రాజెక్టుకు ఎవరు నిధులు సమకూరుస్తారు? భాగస్వాముల మధ్య నష్ట భయాలను ఎలా పంచుకుంటారు? దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలు పెట్టుబడిదారులకు తగినంత భరోసాను అందించగలవా? ఇలా అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

ALSO READ: ఇంట్లోకి చొరబడి.. మాజీ మంత్రి ముఖంపై కోడిగుడ్లతో దాడి.. ఆ వెంటనే అర్ధరాత్రి అరెస్ట్!

Related News

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

Big Stories

Advertisement
×