E-Paper
Advertisement

వర్షాకాలంలో బ్యాడ్ స్మెల్‌కి గుడ్‌బై.. బట్టలను పూర్తిగా ఆరబెట్టే వాషింగ్ మెషీన్స్

వర్షాకాలంలో బ్యాడ్ స్మెల్‌కి గుడ్‌బై.. బట్టలను పూర్తిగా ఆరబెట్టే వాషింగ్ మెషీన్స్

Best Washer Dryers 2026: బయట చూస్తేనేమో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ఇంట్లోనేమో ఆరని బట్టల కుప్పలు. వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఇదే పెద్ద తలనొప్పి. బట్టలు సరిగ్గా ఆరక, ఒక రకమైన  మురికి వాసన వస్తూ ఉంటాయి. ఇలాంటి టైమ్‌లో కేవలం బట్టలు ఉతికే మెషీన్ మాత్రమే సరిపోదు, ఉతికిన వెంటనే వంద శాతం ఆరబెట్టే ‘స్మార్ట్’ టెక్నాలజీ కావాలి. అందుకే.. మీ హోమ్ ల్యాండ్రీని ఈజీగా మార్చేస్తూ, వర్షంలోనూ బట్టలను సూపర్ ఫాస్ట్‌గా ఆరబెట్టే 3 బెస్ట్ ప్రీమియం వాషింగ్ మెషీన్స్ డీటెయిల్స్ మీకోసం.

వర్షాకాలంలో బట్టలు ఆరడం లేదా? ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌తో నో టెన్షన్!

ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. బట్టలు ఉతికిన తర్వాత మళ్ళీ తీసి డ్రైయర్‌లో వేసే ఓపిక ఎవరికీ ఉండటం లేదు. అందుకే మార్కెట్లోకి ‘వాషర్ డ్రైయర్ కాంబో’ మెషీన్స్ వచ్చాయి. ఇవి బట్టలు ఉతకడమే కాదు, 100% ఆరబెట్టి, ఇస్త్రీ చేసినట్లుగా బయటకు ఇస్తాయి. 2026 లో ట్రెండ్ అవుతున్న 3 ప్రీమియం వాషింగ్ మెషీన్స్ ఫీచర్లు..

ట్రెండ్ అవుతున్న ప్రీమియం వాషింగ్ మెషీన్స్

1. LG 10.5 Kg / 7 Kg Inverter Wi-Fi Washer Dryer (AI DD టెక్నాలజీ):
ప్రీమియం వాషింగ్ మెషీన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే బ్రాండ్ ఎల్‌జీ (LG). దీనిలోని AI DD (Artificial Intelligence Direct Drive) టెక్నాలజీ బట్టల బరువును, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నెస్‌ను తానే.. గుర్తించి దానికి తగ్గట్టుగా ఉతుకుతుంది.

డ్రైయింగ్ పవర్: ఇందులో 10.5 కేజీల వాషింగ్ కెపాసిటీతో పాటు 7 కేజీల కంప్లీట్ డ్రైయింగ్ కెపాసిటీ ఉంటుంది. 1400 RPM హై-స్పీడ్ స్పిన్ వల్లే బట్టల్లోని తడి మొత్తం పిండేస్తుంది.

ప్రత్యేకత: ఇందులోని TurboWash 360 ఫీచర్ వల్ల కేవలం 39 నిమిషాల్లోనే బట్టలు క్లీన్ అవుతాయి. అలాగే Eco Hybrid టెక్నాలజీతో వేడి గాలినే రీసైకిల్ చేస్తూ కరెంట్, వాటర్ ఆదా చేస్తూ బట్టలను ఫాస్ట్‌గా ఆరబెడుతుంది. వర్షాకాలంలో బట్టలపై వచ్చే అలర్జీలను పోగొట్టడానికి ఇందులో ‘స్టీమ్ వాష్’కూడా ఉంది.

2. Samsung 9 Kg 5 Star AI EcoBubble Washer Dryer:
సామ్‌సంగ్ కంపెనీ ఏఐ ఫీచర్లతో హోమ్ అప్లయన్స్ రంగంలో దూసుకుపోతోంది. ఈ మెషీన్ మీ బట్టలు ఉతికే పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది.

డ్రైయింగ్ పవర్: దీనిలోని ఎయిర్ వాష్ టెక్నాలజీ ఒక వండర్ అనే చెప్పాలి. నీరు, డిటర్జెంట్ లేకుండా కేవలం సూపర్-హాట్ ఎయిర్ (వేడి గాలి) ద్వారా బట్టలలోని బ్యాక్టీరియాను.. చెడు వాసనను తొలగించి డ్రైగా మారుస్తుంది.

ప్రత్యేకత: ఇందులోని AI EcoBubble టెక్నాలజీ డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి బట్టల లోపలికి వేగంగా వెళ్లేలా చేస్తుంది. దీనివల్ల తక్కువ టెంపరేచర్‌లోనే మురికి వదిలిపోతుంది. స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా మీ మొబైల్ నుండే ఈ మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చు. వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరడానికి దీనిలోని ‘మాన్‌సూన్ మోడ్’ బాగా హెల్ప్ అవుతుంది.

3. Bosch 9 Kg / 6 Kg Fully Automatic Front Load Washer Dryer:
జర్మన్ టెక్నాలజీతో వచ్చే బాష్ వాషింగ్ మెషీన్లు వాటి బిల్డ్ క్వాలిటీ, డ్యూరబిలిటీకి కేరాఫ్ అడ్రస్. నిశ్శబ్దంగా, పవర్‌ఫుల్‌గా పనిచేయడం దీని స్పెషాలిటీ.

డ్రైయింగ్ పవర్: ఇందులో AutoDry ఫీచర్ ఉంటుంది. మీ బట్టలు మీకు ఎంత వరకు ఆరాలో (ఐరన్ చేయడానికి సరిపడా లేదా పూర్తిగా వేసుకోవడానికి వీలుగానా) మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ రాగానే మెషీన్ ఆటోమేటిక్‌గా డ్రైయింగ్ ప్రాసెస్‌ను ఆపేస్తుంది.

Also Read: కరెంట్,నీళ్లు ఆదా అవ్వాలా? IFB వాషింగ్ మెషీన్లలో దాగున్న అసలు సీక్రెట్స్

ప్రత్యేకత: ఇందులోని EcoSilence Drive మోటార్ అస్సలు శబ్దం చేయదు. వర్షాకాలంలో బట్టలు ఎక్కువసేపు తడిగా ఉండటం వల్ల ఫంగస్ చేరే ఛాన్స్ ఉంది. కానీ, బాష్‌లోని ‘అలర్జీ ప్లస్’ప్రోగ్రామ్ వేడి గాలితో 99.9% జెర్మ్స్‌ను క్లీన్ చేస్తుంది.

వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడం కోసం ఇల్లంతా తీగలు కట్టి, ఇబ్బంది పడే రోజులకి కాలం చెల్లింది. ఈ ప్రీమియం వాషర్ డ్రైయర్ కాంబోలు కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ, ఇవి ఇచ్చే కంఫర్ట్, టైమ్ సేవింగ్ మరేదైనా ఇవ్వలేదు. మీ బడ్జెట్, ఫ్యామిలీ సైజును బట్టి ఈ మూడింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకుంటే, ఇక వానలకి అస్సలు భయపడాల్సిన అవసరం ఉండదు.

Tags

Related News

WhatsAppలో ఈ ఒక్క సెట్టింగ్ OFFలో ఉంటే.. మీ పర్సనల్ చాట్స్ హాకర్ల చేతికి చిక్కినట్టే!

10000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ కొత్త 5G ఫోన్లు.. ఒక్క ఛార్జ్‌తో 2 రోజుల బ్యాకప్?

ఆండ్రాయిడ్ ఫోన్లను.. ఘోరంగా అవమానించిన యాపిల్.. నెట్టింట రచ్చ రచ్చ!

సంచలనం.. ఫోల్డబుల్ iPhoneతో పాటు 11 కొత్త డివైజ్‌లు.. యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరింది!

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఊహించని విధంగా తగ్గిన Galaxy A36 5G ధర, ఇప్పుడే కొనేయండి!

కరెంట్,నీళ్లు ఆదా అవ్వాలా? IFB వాషింగ్ మెషీన్లలో దాగున్న అసలు సీక్రెట్స్

బజాజ్ ‘యాపిల్ డేస్’ ధమాకా.. రూ.9 వేల క్యాష్‌బ్యాక్, రూ.10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్.. చౌకగా ఐఫోన్లు, ఐప్యాడ్స్!

Big Stories

×