E-Paper
Advertisement

సంచలనం.. ఫోల్డబుల్ iPhoneతో పాటు 11 కొత్త డివైజ్‌లు.. యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరింది!

సంచలనం.. ఫోల్డబుల్ iPhoneతో పాటు 11 కొత్త డివైజ్‌లు.. యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరింది!
Advertisement

Apple New Devices: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది చివర్లో సరికొత్త సంచలనానికి తెరలేపనుంది. రాబోయే మూడు నాలుగు నెలల్లో ఏకంగా 11 కొత్త డివైజ్‌లను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ భారీ ప్లాన్ చేస్తోంది. ఇందులో iPhone 18 Pro మోడల్స్, ఐప్యాడ్‌లు, కొత్త మ్యాక్ కంప్యూటర్లతో పాటు యాపిల్ లవర్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న Foldable iPhone కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్ నుంచే ఈ లాంచ్‌ల పండగ మొదలుకానుంది.

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో కీలక మార్పులు:

ఈ ఏడాది రాబోయే ఉత్పత్తుల్లో అందరి కళ్లూ iPhone 18 Pro, 18 Pro Max మోడల్స్‌పైనే ఉన్నాయి. ఈసారి యాపిల్ వీటి డిజైన్, కెమెరాల్లో కీలక మార్పులు చేయబోతోంది. ముఖ్యంగా డిస్‌ప్లే కింద ఫేస్ ఐడి టెక్నాలజీని అమర్చడం ద్వారా స్క్రీన్ పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజ్ చాలా తగ్గిపోనుంది. దీనివల్ల స్క్రీన్ మరింత అందంగా కనిపిస్తుంది. అలాగే ఫొటోగ్రఫీ కోసం వేరియబుల్ అపెర్చర్ లెన్స్‌ను తీసుకురానున్నారు. దీనివల్ల తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫొటోలు వస్తాయి. ఈ ఫోన్లలో రాబోయే ఏ20 ప్రో చిప్ మరింత వేగంగా పనిచేస్తూ, ఏఐ ఫీచర్లకు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది.

ఫోల్డబుల్ ఐఫోన్, సరికొత్త ఐప్యాడ్‌లు:

Advertisement

యాపిల్ నుంచి రాబోతున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మల్టీటాస్కింగ్ సులువుగా చేసుకునేలా దీని సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ చేస్తున్నారు. దీంతోపాటు ఐప్యాడ్ లవర్స్ కోసం సరికొత్త ఐప్యాడ్ 12 మోడల్‌ను యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో లాంచ్ చేయనున్నారు. అలాగే ఐప్యాడ్ మినీ మోడల్‌ను సరికొత్త ఓఎల్ఈడీ డిస్‌ప్లే, మెరుగైన డిజైన్‌తో అప్‌గ్రేడ్ చేయబోతున్నారు.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఊహించని విధంగా తగ్గిన Galaxy A36 5G ధర, ఇప్పుడే కొనేయండి!

మ్యాక్ కంప్యూటర్స్, వాచెస్‌లో అప్‌గ్రేడ్స్:

Advertisement

కంప్యూటర్ విభాగంలో కూడా యాపిల్ తన హవా చాటనుంది. మ్యాక్ స్టూడియో, మ్యాక్ మినీ, ఐమ్యాక్ డివైజ్‌లను నెక్ట్స్ జనరేషన్ ‘ఎమ్5’ చిప్స్‌తో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇవి మునుపటి కంటే చాలా వేగంగా పనిచేస్తాయి. ఫిట్‌నెస్ ప్రియుల కోసం యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రా మోడల్స్ సరికొత్త హెల్త్ ఫీచర్లతో రానున్నాయి.

స్మార్ట్ హోమ్ విభాగంలోకి కొత్త డివైజ్‌లు:

ఇంటిని స్మార్ట్‌గా మార్చేందుకు యాపిల్ ఒక ప్రత్యేకమైన స్మార్ట్ హోమ్ హబ్‌ను కూడా తయారు చేస్తోంది. దీని ద్వారా ఇంట్లోని అన్ని స్మార్ట్ డివైజ్‌లను కంట్రోల్ చేయవచ్చు. వీటితో పాటు కొత్త యాపిల్ టీవీ, హోమ్‌పాడ్ కూడా లైన్లో ఉన్నాయి. వీటన్నింటినీ మరింత పర్సనలైజ్డ్ వర్షన్‌తో వచ్చే సరికొత్త Siri వాయిస్ అసిస్టెంట్‌తో కనెక్ట్ చేయనున్నారు. యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. టెక్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఏడాది ద్వితీయార్థం యాపిల్ ప్రియులకు పెద్ద పండగలా మారనుంది.

Also Read: వాటర్ ప్రూఫ్, అడ్వాన్స్‌డ్ జీపీఎస్‌తో Amazfit కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధర ఎంతంటే?

Related News

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Big Stories

Advertisement
×