E-Paper
Advertisement

పదార్థాలు పాడవకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంతలో ఉండాలి? ఆ తప్పులు మాత్రం చేయొద్దు!

పదార్థాలు పాడవకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంతలో ఉండాలి? ఆ తప్పులు మాత్రం చేయొద్దు!
Advertisement

Fridge Temperature: సాధారణంగా చాలామంది ఫ్రిడ్జ్‌లో ఉన్న వస్తువులు చల్లా ఉన్నాయా? నీళ్లు ఐస్‌లా మారాయా? అని చూసి ఫ్రిడ్జ్‌ బాగానే పనిచేస్తుందని అనుకుంటారు. కానీ, లోపల ఉండాల్సిన ఉష్ణోగ్రత కరెక్ట్‌గా లేకపోతే మనం ఎంతో ఆరోగ్యకరం అనుకుని తినే ఆహారం కాస్తా విషంగా మారే ప్రమాదం ఉంది. అందుకే నిపుణులు చెప్పే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. ఆహారం తాజాగా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది.

ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఎంత ఉండాలి?

ముఖ్యంగా వేసవిలో ఫ్రిడ్జ్ 4°C కంటే తక్కువలో ఉండాలి. అలాగని మరీ 32°F కంటే తగ్గిస్తే కూరగాయలన్నీ గడ్డకట్టిపోయి పాడవుతాయి. ఇక ఫ్రీజర్ విషయానికి వస్తే.. అది ఎప్పుడూ 0°F దగ్గరే ఉండాలి. అప్పుడే బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ మరీ చల్లగా ఉన్నా లోపల ఉన్న పదార్థాల రుచి మారిపోవడంతో పాటు చల్లగా ఉండే పదార్థాలు కుళ్లిపోతాయి కూడా. అందుకే టెంపరేచర్ బ్యాలెన్స్ ముఖ్యం.

టెంపరేచర్ ఎప్పుడు మార్చాలి?

Advertisement

ఎప్పుడూ ఒకే సెట్టింగ్‌లో ఉంచకూడదు. ఎండలు ముదిరినప్పుడు లేదా ఫ్రిడ్జ్ నిండా సామాన్లు సర్దినప్పుడు చల్లదనాన్ని కొంచెం పెంచాలి. ముఖ్యంగా పండగలప్పుడు మాంసం, చేపలు వంటివి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి లోపలి వరకు చల్లగా ఉండాలంటే సెట్టింగ్ మార్చుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల ఎక్కువ రోజులు అవి తాజాగా ఉంటాయి.

ఏ వస్తువును ఎక్కడ పెట్టాలి?

ఫ్రిడ్జ్‌లో లోపల అన్ని వైపులా ఒకేలా చల్లగా ఉండదు. వెనుక వైపు, అలాగే కింది అరల్లో చల్లదనం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలు, మాంసం, పెరుగు వంటివి అక్కడ పెడితే మంచిది. ఇక ఫ్రిడ్జ్ డోర్‌ను మనం పదే పదే తీస్తూ ఉంటాం కాబట్టి.. అక్కడ చల్లదనం తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ సాస్ బాటిళ్లు, డ్రింక్స్ లాంటివి పెట్టుకోవాలి. పాలు, గుడ్లు వంటివి డోర్ సైడ్ పెట్టకపోవడమే మంచిది.

టెంపరేచర్‌ను ఇలా చెక్ చేయొచ్చు..

Advertisement

అలాగే ఫ్రిడ్జ్‌కు ఉండే మీటర్లు అప్పుడప్పుడు తప్పుగా చూపించవచ్చు. అందుకే బయట దొరికే ఒక చిన్న థర్మామీటర్ కొని ఫ్రిడ్జ్ మధ్యలో పెట్టి చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వేర్వేరు అరల్లో పెట్టి చూస్తే ఏ మూల ఎంత చల్లగా ఉందో మీకే అర్థమవుతుంది. ఇలా చేయడం వల్ల ఆహారం పాడవకుండా ఉంటుంది. దీంతో కుంటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×