Girl dies making Instagram reels: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత చేస్తున్న సాహసాలు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కేవలం కొన్ని సెకన్ల వీడియో కోసం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా రహదారులపై విన్యాసాలు చేస్తూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో రీల్స్ పిచ్చితో ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
గాజియాబాద్‌కు చెందిన 19 ఏళ్ల ఇక్రా అనే యువతి, రీల్స్ చేసేందుకు తన స్నేహితుడు హసీంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపైకి వెళ్ళింది. ఇక్రా అతివేగంతో బైక్ నడుపుతుండగా, వెనుక కూర్చున్న హసీం వీడియో చిత్రీకరిస్తున్నాడు. వీడియోలో ఫోజు ఇచ్చే క్రమంలో ఇక్రా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఆ క్షణంలో బైక్ నియంత్రణ కోల్పోయి వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇక్రా మృతి చెందింది. ఆమె స్నేహితుడు హసీం ప్రస్తుతం ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు వారు చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెల్మెట్లు ధరించకపోవడం, అతివేగం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రత కోల్పోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.
యువత రీల్స్ మత్తులో పడి తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల తమకే కాకుండా రహదారిపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
🚨 BREAKING
A tragic accident in Ghaziabad a high-speed sports bike crashed into a divider, leading to the death of Ikra.💔
Reports say Ikra was riding the bike while her friend Hashim was filming a video at the time of the crash. Neither of them was wearing a helmet.
One… pic.twitter.com/fxo9mYASLR
— Rehan_Idrisi (@MR_COOL77777) April 13, 2026
Read Also: విష్ణు ప్రియ పై కేసు…భారీగా పెరిగిన సబ్స్క్రైబర్లు.. అమ్మడికి ఇలా కలిసొచ్చిందా?