Theatre Strike: అసలే కలెక్షన్స్ లేక టాలీవుడ్ బాక్సాఫీస్ ఈగలు తోలుకుంటుంటే ఇపుడు మరో గుదిబండ తెలుగు ఇండస్ట్రీపై పడేందుకు సిద్దమయింది. అదే థియేటర్స్ బంద్. అవును ..ఇపుడు టాలీవుడ్ లో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య ఏర్పడ్డ వాటాల పంచాయితీ టాలీవుడ్ ఫ్యూచర్ కి పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టేస్తుంది. యస్ .. ‘మాకు రెంటల్ బేసిస్ వద్దు.. ఆదాయంలో వాటా కావాలి’ అని థియేటర్ ఓనర్స్ డిమాండ్ చేస్తుంటే, ‘ఖర్చులు పెరిగాయ్ కాబట్టి పర్సంటేజీ ఇవ్వడం కష్టం .. పాత పద్ధతిలోనే ముందుకెళ్దాం’ అంటూ మంకు పట్టు పడుతున్నారు సినీ ప్రొడ్యూసర్స్. ఒక వేళ గనుక ఈ ఇద్దరి మధ్య పంచాయితీ తేలకపోతే మాత్రం మే 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లకు తాళాలు పడటం దాదాపు ఖాయమని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.
సినిమాకు వచ్చే రెవెన్యూలో వాటా ఇస్తేనే
ఒక వేళ గనుక ఎగ్జిబిటర్ల సంఘం పిలుపునిచ్చినట్టుగా థియేటర్స్ బ్యాన్ అయితే మాత్రం ఈ సమ్మర్ సీజన్ పై ఆశలు పెట్టుకున్న పలు పెద్ద సినిమాలు నిండా మునగడం ఖాయం. నిజానికి గత కొన్నేళ్లుగా థియేటర్ల ఓనర్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారన్నది వాస్తవం. పవర్ బిల్, వర్కర్స్ సాలరీస్, మెయింటెనెన్స్ అన్నీ తడిసి మోపెడవుతుంటే, మరోవైపు ఓటీటీల ఎంట్రీ తో ఉన్న థియేటర్స్ కాస్తా క్లోజ్ అయ్యే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రెంటల్ బేసిస్ మీద థియేటర్లను నడపడం తమవల్ల కాదని, సినిమాకు వచ్చే రెవెన్యూలో వాటా ఇస్తేనే తాము థియేటర్లను నడపగలమని వాదిస్తున్నారు ఎగ్జిబిటర్లు.
రెవెన్యూలో వాటా ఇవ్వడం అంటే నిండా ముంచడమే
ఇండస్ట్రీలోని ప్రముఖుల మధ్య డిఫరెంట్ ఒపీనియన్స్
అయితే పోయినేడు కూడా ఇదే ఇష్యూ పై థియేటర్ల యజమానులు పట్టుబట్టినప్పటికీ, చర్చల అనంతరం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే ఈసారి మాత్రం తమ పంతం నెగ్గించుకోవడానికే వారు గట్టిగా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇందుకు కౌంటర్‌గా ‘యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ కూడా తమ నిరసనను తెలుపుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఇప్పటికే ఆకాశాన్ని తాకుతోందని, హీరోల రెమ్యూనరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు భరిస్తూ మళ్ళీ రెవెన్యూలో వాటా ఇవ్వడం అంటే నిర్మాతను నిండా ముంచడమేనని వారు స్పష్టం చేస్తున్నారు.
ఒకవేళ థియేటర్లు మూతపడితే
అయితే ఎంకి పెళ్లి సుబ్బు చావు అన్నట్టుగా చూస్తుంటే ఈ వాటాల పంచాయితీ అటు తిరిగి ఇటు తిరిగి మే నెలలో విడుదల కావాల్సిన సినిమాలపై పడబోయేట్టే ఉంది. అసలే సమ్మర్ సీజన్ లో భారీ చిత్రాలు సందడి చేస్తుంటాయి. కానీ ఈసారి పెద్ద సినిమాలు రేసులో లేకపోవడంతో, టాలీవుడ్ మొత్తం మీడియం రేంజ్ మరియు చిన్న చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’ మే నెలలో వచ్చే చాన్స్ ఉందంటున్నారు. మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ థియేటర్లు మూతపడితే నిఖిల్ కెరీర్‌కు ఇది పెద్ద మైనసే అని చెప్పాలి.అలాగే సమంత ప్రధాన పాత్రలో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను నమ్ముకుని రిలీజ్‌కు సిద్ధమైంది. సూర్య నటిస్తున్న ‘కరుప్పు’, వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ వంటి చిత్రాలు కూడా మే నెలలోనే బాక్సాఫీస్ వద్ద తమ లక్ ని టెస్ట్ చేసుకోవడానికి సిద్దం అవుతున్నవే.
ఇండస్ట్రీలోని ప్రముఖుల మధ్య డిఫరెంట్ ఒపీనియన్స్
అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ గొడవలో ఇండస్ట్రీలోని ప్రముఖుల మధ్య డిఫరెంట్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయ్. సొంతంగా థియేటర్లు మరియు పంపిణీ వ్యవస్థ ఉన్న కొందరు బడా నిర్మాతలు కూడా పర్సంటేజీ విధానం వైపు మొగ్గు చూపుతున్నట్లు వినిపిస్తుంది. దీనివల్ల నిర్మాతల్లోనే రెండు వర్గాలు ఏర్పడ్డ పరిస్థితి. మరి మే 1 దగ్గరికి వస్తున్న ఈ టైమ్ లో అయినా కూర్చుని సమస్యని సాల్వ్ చేసుకుంటారో లేక థియేటర్లని మూసేయడానికి మొగ్గు చూపుతారో చూడాలి.