E-Paper
Advertisement

చిన్న కిచెన్.. తక్కువ బడ్జెట్! రూ. 20వేలలోపు టాప్ టేబుల్ టాప్ డిష్‌వాషర్స్

చిన్న కిచెన్.. తక్కువ బడ్జెట్! రూ. 20వేలలోపు టాప్ టేబుల్ టాప్ డిష్‌వాషర్స్
Advertisement

Best Small Dishwasher Under 20000: ఈ రోజుల్లో ఇల్లు చిన్నదైనా, కిచెన్ ఇరుకుగా ఉన్నా సరే.. పని మనిషి తిప్పలు లేకుండా గిన్నెలు కడుక్కోవడానికి స్మార్ట్ గ్యాడ్జెట్స్ వచ్చేశాయి. చాలా మంది డిష్‌వాషర్ అంటే ఎక్కువ ధర ఉంటుందని, పెద్ద కిచెన్ కావాలని అనుకుంటారు. కానీ.. కేవలం రూ. 20 వేల లోపు బడ్జెట్‌లోనే కిచెన్ ప్లాట్‌ఫారమ్‌పై పట్టేసే అద్భుతమైన కాంపాక్ట్, టేబుల్ టాప్ డిష్‌వాషర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్స్, వర్కింగ్ కపుల్స్, చిన్న కుటుంబాల రోజువారీ అవసరాలకు పర్ఫెక్ట్‌గా సరిపోయే బెస్ట్ స్మాల్ డిష్‌వాషర్స్ , వాటి ప్రస్తుత ధరల వివరాలు ఇవే!

రూ.20 వేల లోపు బెస్ట్ స్మాల్ డిష్‌వాషర్స్ :

Advertisement

పెద్ద సైజ్ డిష్‌వాషర్లతో పోలిస్తే ఈ స్మాల్ లేదా టేబుల్ టాప్ డిష్‌వాషర్లు చాలా తక్కువ స్పేస్ ఆక్రమిస్తాయి. ఒక మైక్రోవేవ్ ఓవెన్ పట్టేంత స్థలం ఉంటే చాలు.. వీటిని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న టాప్ మోడల్స్ ఇవే..

1. Voltas Beko 8 Place Settings Table Top Dishwasher (DT8S) :
టాటా బ్రాండ్ నమ్మకంతో వస్తున్న వోల్టాస్ బెకో ఈ కేటగిరీలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇందులో 6 వాష్ ప్రోగ్రామ్స్ (ఇంటెన్సివ్, నార్మల్, ఎకో, గ్లాస్ కేర్, క్లీన్ & షైన్, మినీ) ఉంటాయి. ఇండియన్ వంటల జిడ్డును వదిలించడానికి ఇందులోని 70°C హాట్ వాటర్ వాష్ ఫీచర్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది చాలా కాంపాక్ట్ సైజులో ఉండి, కిచెన్ లుక్‌ను పెంచుతుంది.

Advertisement

ప్రస్తుత ధర :రూ. 18,990

2. Midea 8 Place Settings Table Top Dishwasher :
గ్లోబల్ బ్రాండ్ అయిన మిడియా తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. ఈ చిన్న డిష్‌వాషర్‌లో ’70°C High-Temp Intensive Wash’ ఫీచర్ ఉంది. ఇది గిన్నెలకు ఉండే బ్యాక్టీరియాను 99.9% వరకు క్లీన్ చేస్తుంది. దీనిలోని నాన్-స్టిక్ కోటెడ్ బాస్కెట్ వల్ల తుప్పు పట్టే ఛాన్స్ ఉండదు. ఇందులో సెల్ఫ్-క్లీనింగ్ సిస్టమ్ కూడా ఉండటం విశేషం.

ప్రస్తుత ధర: రూ. 17,490

3. Godrej Eon Dishwasher:
నమ్మకమైన బ్రాండ్ గోద్రేజ్ నుంచి వచ్చిన ఈ టేబుల్ టాప్ డిష్‌వాషర్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇందులో చిన్న కుటుంబానికి సరిపడేలా ఒకేసారి.. 8 ప్లేస్ సెట్టింగ్స్ గిన్నెలను సర్దవచ్చు. దీనిలోని ‘Anti-Bacterial Filter’ గిన్నెలు కడిగేటప్పుడు ఎలాంటి దుర్వాసన రాకుండా లోపలి వాతావరణాన్ని క్లీన్‌గా ఉంచుతుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో ఇది పనిచేస్తుంది.

ప్రస్తుత ధర :రూ. 19,490

4. Faber 8 Place Settings Table Top Dishwasher:
కిచెన్ చిమ్నీలలో టాప్ బ్రాండ్ అయిన ఫేబర్, డిష్‌వాషర్లలోనూ బెస్ట్ క్వాలిటీ ఇస్తోంది. ఈ కాంపాక్ట్ డిష్‌వాషర్ లోపల స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ఉంటుంది, దీనివల్ల మన్నిక చాలా ఎక్కువ కాలం వస్తుంది. ఇందులో ‘Delay Start’ ఫీచర్ ఉంది. అంటే మీరు టైమర్ సెట్ చేస్తే, మీకు నచ్చిన టైమ్‌కి ఇది ఆటోమేటిక్‌గా ఆన్ అయి గిన్నెలను కడిగేస్తుంది.

ప్రస్తుత ధర :రూ. 18,490

5. AmazonBasics 6 Place Settings Cyber Mini Dishwasher:
మీ బడ్జెట్ ఇంకా తక్కువగా ఉండి, ఇంట్లో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటే అమెజాన్ బేసిక్స్ వారి 6 ప్లేస్ సెట్టింగ్ మిని డిష్‌ వాషర్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఇది సైజులో చాలా చిన్నది. లైట్ వెయిట్. ప్లేట్లు, స్పూన్లు, చిన్న గిన్నెలను రోజువారీగా క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా స్మార్ట్ ఆప్షన్. ఇది నీటిని కూడా చాలా తక్కువగా వాడుకుంటుంది.

ప్రస్తుత ధర :రూ. 14,990

స్మాల్ డిష్‌వాషర్ వాడటం వల్ల కలిగే లాభాలు:
నీటి ఆదా: మనం చేత్తో గిన్నెలు కడిగితే దాదాపు 40 లీటర్ల నీరు వృధా అవుతుంది. అదే ఈ చిన్న టేబుల్ టాప్ డిష్‌వాషర్లు కేవలం 6 నుంచి 8 లీటర్ల నీటితోనే క్లీనింగ్ పూర్తి చేస్తాయి.

హైజీన్ : పనిమనుషులు చన్నీళ్లతో కడిగితే జిడ్డు వదలదు. పైగా ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ డిష్‌వాషర్ వేడి నీటితో కడగడం వల్ల గిన్నెలు 100% సురక్షితంగా మారుతాయి.

పెద్ద గిన్నెలు పట్టవా?: చాలా మంది చిన్న డిష్‌వాషర్లలో పెద్ద కడాయిలు పట్టవనుకుంటారు. కానీ స్మాల్ డిష్‌వాషర్లలో కూడా చిన్న ప్రెషర్ కుక్కర్లు, మీడియం సైజ్ కడాయిలను ఈజీగా సర్దుకోవచ్చు.

బిజీ లైఫ్‌లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఇళ్లకు లేదా బ్యాచిలర్స్‌కు ఈ స్మాల్ డిష్‌వాషర్లు ఒక వరం లాంటివి.రూ. 20 వేల లోపు బడ్జెట్ లోనే లభిస్తుండటం వల్ల ఇది వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా మీ నెల వారీ పని మనిషి ఖర్చును, సమయాన్ని ఆదా చేస్తుంది. మీ కిచెన్ స్పేస్ , బడ్జెట్‌ను బట్టి పైన పేర్కొన్న వాటిలో ఒక బెస్ట్ మోడల్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×