E-Paper
Advertisement

iPhone 17 Pro కొనడం మీ డ్రీమా? ఈ సీక్రెట్ ఆఫర్ తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు!

iPhone 17 Pro కొనడం మీ డ్రీమా? ఈ సీక్రెట్ ఆఫర్ తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు!
Advertisement

iPhone 17 Pro Price Cut: గతేడాది విడుదలై టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన యాపిల్ బ్రాండ్ iPhone 17 Pro కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం రాదు. కొత్తగా వచ్చిన కాస్మిక్ ఆరెంజ్, సిల్వర్ లేదా బ్లూ కలర్ మోడల్‌ను సొంతం చేసుకోవడానికి విజయ్ సేల్స్‌లో అదిరిపోయే డీల్ నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

ధర ఎంత తగ్గుతుందంటే?

ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో iPhone 17 Pro ధరపై రూ.4,000 కంటే ఎక్కువ తగ్గింపుతో రూ.1,30,790కే లభిస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ ద్వారా కొంటే.. బ్యాంక్ ఆఫర్ కింద మరో రూ.9,750 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర దాదాపు రూ.1,21,000కి తగ్గుతుంది. అలాగే మీ వద్ద ఉన్న పాత ఫోన్‌ను ఎక్ఛేంజ్ చేసుకోవాలనుకుంటే.. మరికొంత లబ్ధి పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు ఇలా..

Advertisement

ఒకవేళ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ లేకపోయినా ఎస్‌బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ.4,000 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. అలాగే కస్టమర్లు నెలకు రూ.21,131 చొప్పున 6 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. వీటితో పాటు రూ.981 విలువైన రివార్డ్ పాయింట్లు కూడా లభిస్తాయి. వీటిని వచ్చే ఏడాది వాడుకోవచ్చు.

Also Read: కెమెరా ప్రియులకు పండగే.. లీకైన Vivo V80, Vivo S2 ఫీచర్లు.. లుక్స్ వేరే లెవల్ అంతే!

iPhone 17 Pro స్పెసిఫికేషన్స్..

Advertisement

ఈ సరికొత్త మోడల్‌లో యాపిల్ సంస్థ ట్రిపుల్ కెమెరాతో కూడిన కొత్త స్క్వేర్ కెమెరా డిజైన్, మెరుగైన బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లేను ఇచ్చింది. అలాగే దీనిలో శక్తివంతమైన ఏ19 ప్రో చిప్, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. దీంతోపాటు ఫోన్ వేడెక్కకుండా వాటర్ వేపర్ ఛాంబర్ టెక్నాలజీని, మెరుగైన మన్నిక కోసం సెరామిక్ షీల్డ్ 2ను ఉపయోగించారు.

కొనాలా? వద్దా?

మీరు గనుక ఇప్పటికే iPhone 15 Pro లేదా అంతకంటే పాత మోడల్ వాడుతుంటే.. ఈ ఫోన్ అద్భుతమైన అప్‌గ్రేడ్ అవుతుంది. దీనిలో రెండు నుండి మూడు గంటల అదనపు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. అయితే, ఇప్పటికే iPhone 16 Pro ఉన్నవారికి ఈ మార్పులు పెద్దగా అనిపించకపోవచ్చు. పాత ఫోన్ల వినియోగదారులకు ఈ ఆఫర్ ధరలో ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

Also Read: ఐకూ దెబ్బ మామూలుగా లేదుగా.. 8000mAh బ్యాటరీతో 15T మోడల్ వచ్చేస్తోంది.. ఆ రోజే లాంచ్!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×