E-Paper
Advertisement

రూ.18 వేలకే క్యూఎల్ఈడీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు.. లైనప్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

రూ.18 వేలకే క్యూఎల్ఈడీ, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు.. లైనప్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!
Advertisement

Budget Smart TVs: సాధారణంగా స్మార్ట్ టీవీ అనగానే మనందరికీ ముందుగా గుర్తుచొచ్చేది రిమోట్‌తో ఆపరేట్ చేయడం. అయితే ప్రతిసారీ స్క్రీన్ మీదున్న కీబోర్డ్‌తో అక్షరాలను వెతుక్కుంటూ టైప్ చేయడం నిజంగా కాస్త విసుగు తెప్పించే విషయమే. అందుకే ఇప్పుడు చాలామంది వాయిస్ రిమోట్ ఉన్న టీవీలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కేవలం వాయిస్ ద్వారానే మనకు నచ్చిన సినిమాను లేదా యూట్యూబ్ వీడియోను సెర్చ్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీరు కూడా రూ.18,000 బడ్జెట్‌లో మంచి వాయిస్ కంట్రోల్ టీవీ కోసం చూస్తుంటే.. ఇదిగో కొన్ని బెస్ట్ ఆప్షన్లు మీ కోసం అందుబాటులో ఉన్నాయి.

బ్రాండ్ వాల్యూ, క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చేవారికి Samsung 32-inch HD స్మార్ట్ టీవీ ఒక మంచి ఎంపిక. రూ.14,750 ధరలో లభించే ఈ టీవీ చిన్న గదులకు, బెడ్‌రూమ్‌లకు చాలా బాగుంటుంది. ఇందులో ఇచ్చే వాయిస్ రిమోట్ చాలా వేగంగా పనిచేస్తుంది. పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. టీవీ స్క్రీన్ కాస్త చిన్నదైనా, దీర్ఘకాలిక మన్నికను కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ కావాలనుకుంటే Uniboom 43-inch Full HD QLED టీవీని చూడవచ్చు. దీని ధర రూ.15,190 వరకు ఉంటుంది. సాధారణంగా ఈ రేంజ్‌లో క్యూఎల్ఈడీ డిస్‌ప్లే రావడం అరుదు. ఇందులో ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో పాటు 30 వాట్ల శక్తివంతమైన స్పీకర్లు ఉంటాయి. సినిమా అనుభూతిని మరింత పెంచడానికి ఈ టీవీ బాగా ఉపయోగపడుతుంది. ఇక బడ్జెట్‌లో ఆడియో పరంగా కూడా ఇదే బ్రాండ్‌కి చెందిన అయాన్‌స్టార్ టీవీలు మంచి పోటీని ఇస్తున్నాయి.

Advertisement

ఇక స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విషయానికి వస్తే.. Xiaomi Fire TV మోడల్ రూ.12,999 ధరకు లభిస్తోంది. దీనిలో అలెక్సా వాయిస్ సపోర్ట్ రావడం అతిపెద్ద ప్లస్ పాయింట్. అలాగే యాప్స్ వినియోగం కూడా చాలా సులభంగా ఉంటుంది. మరోవైపు గూగుల్ టీవీ అనుభవాన్ని కోరుకునేవారికి ఫిలిప్స్ 32 అంగుళాల టీవీ రూ.13,999 ధరకు దొరుకుతోంది. దీని ఫ్రేమ్‌లెస్ డిజైన్ టీవీకి మంచి ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ సెర్చ్ చేయడం ఇందులో చాలా తేలిక.

మరీ తక్కువ బడ్జెట్‌ రూ.11,500 లోపే స్మార్ట్ టీవీ కావాలనుకుంటే Unicrone బ్రాండ్ టీవీ అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్, వాయిస్ కంట్రోల్ వంటి ప్రాథమిక స్మార్ట్ ఫీచర్లన్నీ దీనిలో ఉంటాయి. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియుల కోసం Blaupunkt 40-inch మోడల్ కూడా రూ.18,000 బడ్జెట్ పరిధిలోనే దొరుకుతోంది.

Also Read: AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

Related News

బాక్స్ ఓపెన్ చేయగానే మైండ్ పోయింది.. ఐఫోన్ ప్లేస్‌లో ఆయిల్ డబ్బా, ఫ్లిప్‌కార్ట్‌కు ఇచ్చిపడేసిన కోర్టు!

ఓరి దేవుడా.. భారీగా తగ్గిన గెలాక్సీ Z Fold 7 ధర.. కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్!

జియో ‘ఫ్రీడమ్ ప్యాక్’ ఆఫర్.. 100 Mbps స్పీడ్, 1000+ ఛానెళ్లు.. ఫ్రీగా 12 ఓటీటీలు!

సామాన్యుల స్పెషల్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. 72 రోజులు రచ్చ రంబోలా!

జియో మరో క్రేజీ ప్లాన్.. రూ. 1,748 కే 11 నెలల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, డేటా, లైవ్ ఛానల్స్!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 400 లోపే అన్‌లిమిటెడ్ 5G డేటా.. వివరాలివే!

రూ. 26,999 లకే 55 ఇంచుల 4K టీవీ.. బిగ్ స్క్రీన్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్

Big Stories

Advertisement
×