E-Paper
Advertisement

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?
Advertisement

Galaxy Unpacked 2026: శాంసంగ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026’ ఈవెంట్‌కు సర్వం సిద్ధమైన వేళ.. సరికొత్త మోడళ్లతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు సంస్థ సిద్ధమైంది. ఈసారి మడతపెట్టినా చెక్కుచెదరని ‘ఫ్లెక్స్ టైటానియం’ డిస్‌ప్లేతో Galaxy Z Fold 8, Z Flip 8 మోడళ్లను పరిచయం చేయబోతోంది. వీటితో పాటు సరికొత్త స్మార్ట్‌వాచ్‌లు, ఓ సీక్రెట్ ఫోల్డబుల్ ఫోన్ కూడా సందడి చేయనున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ జరగనుంది? లీకైన మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం!

జులై 22న గ్రాండ్ ఈవెంట్:

గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. జూలై 22న లండన్ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. మన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు శాంం‌సంగ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, వెబ్‌సైట్లలో ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో చూడవచ్చు.

Advertisement

Also Read: కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు:

ఇందులో ప్రధానంగా Galaxy Z Fold 8, Z Flip 8 ఫోన్లు సందడి చేయనున్నాయి. Z Fold 8 మోడల్ మెరుగైన బ్యాటరీ, సూపర్ పెర్ఫార్మెన్స్‌తో రానుండగా.. Z Flip 8 స్టైలిష్ లుక్, సరికొత్త ప్రాసెసింగ్ పవర్‌తో వస్తోంది. వీటితో పాటు పాస్‌పోర్ట్ డిజైన్‌లో ఉండే మరొక కొత్త రకం పాకెట్ ఫ్రెండ్లీ ఫోల్డబుల్ ఫోన్‌ను కూడా శాంం‌సంగ్ పరిచయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఫ్లెక్స్ టైటానియం డిస్‌ప్లే:

Advertisement

ఈసారి ఫోల్డబుల్ స్క్రీన్ల కోసం శాంసంగ్ ప్రత్యేకంగా Flex Titanium టెక్నాలజీని వాడుతోంది. స్క్రీన్ కింద టైటానియం అల్లాయ్ పొర ఉండటం వల్ల డిస్‌ప్లే చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది. ఫోన్ మడిచినప్పుడు వచ్చే మడత మచ్చలు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 12GB ర్యామ్, 45W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఈ ఫోన్లలో ఉండనున్నాయి.

ఇతర గాడ్జెట్స్, స్పైడర్ మ్యాన్ ట్విస్ట్:

ఫోన్లతో పాటు Galaxy Watch 9, Watch Ultra 2 స్మార్ట్‌వాచ్‌లను కూడా సంస్థ లాంచ్ చేయనుంది. ఇవి కొత్త హెల్త్ ట్రాకింగ్, ఏఐ వెల్నెస్ ఫీచర్లతో రాబోతున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కొత్త స్పైడర్ మ్యాన్ సినిమాతో శాంసంగ్ ఈసారి పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకుంది. ఈ ఫోన్లు, వాచ్‌ల ధరలు, ప్రీ-ఆర్డర్ వివరాలు జులై 22న జరగబోయే ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Also Read: 9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

Related News

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

రూ.7,490కే కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్..బడ్జెట్‌ నంబర్ 1 మోడల్

రూ.1,699కే ఫైర్‌బోల్ట్ గ్లిట్జ్ స్మార్ట్‌వాచ్.. లుక్ అదిరిపోయిందిగా!

వావ్ అనిపించే ఫీచర్లతో Pixel Watch 5 Stephen Curry Edition సేల్ షురూ.. ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×