E-Paper
Advertisement

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!
Advertisement

AC Fan Mode Benefits: సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లోనూ నిత్యం ఆన్‌లో ఉండే పరికరం ఏసీ. దీనికి తోడు వాతావరణ మార్పుల వలన ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీని ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. అయితే 24 గంటలూ ఇది ఆన్‌లో ఉండటంతో నెలాఖరులో వచ్చే కరెంటు బిల్లు కూడా సామాన్యులకు ఆర్థిక భారంగా మారుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. మన ఏసీలోనే ఉండే ‘ఫ్యాన్ మోడ్’ను సరిగ్గా ఉపయోగిస్తే విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఫ్యాన్ మోడ్ ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా ఏసీని ‘కూలింగ్ మోడ్’లో పెట్టినప్పుడు కంప్రెషర్ నిరంతరం పనిచేస్తూ గదిని చల్లబరుస్తుంది. కానీ ‘ఫ్యాన్ మోడ్’లో వేసినప్పుడు కంప్రెషర్ ఆగిపోయి, కేవలం ఇండోర్ ఫ్యాన్ మాత్రమే తిరుగుతుంది. గదిలోని గాలిని మాత్రమే ఇది అటు ఇటు సర్క్యులేట్ చేస్తుంది. ఏసీలో ఎక్కువ విద్యుత్ కాలేది కంప్రెషర్ వల్లే కాబట్టి.. అది ఆగిపోవడం వల్ల కరెంట్ బిల్లు బాగా ఆదా అవుతుంది.

Advertisement

Also Read: లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

కరెంట్ ఎంత ఆదా అవుతుంది?

సాధారణ కూలింగ్ మోడ్‌లో 1.5 టన్ ఏసీ సుమారు 1000 నుండి 1800 వాట్ల విద్యుత్‌ను వాడుకుంటుంది. అదే ఫ్యాన్ మోడ్‌లోకి మారిస్తే కేవలం 40 నుండి 100 వాట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది. అంటే మనం ఇంట్లో వాడే సీలింగ్ ఫ్యాన్ తిరిగినంత తక్కువ కరెంట్ మాత్రమే ఇక్కడ వాడబడుతుంది.

ఎప్పుడు వాడితే మంచిది?

Advertisement

గది అప్పటికే బాగా చల్లబడినప్పుడు లేదా ఉదయం, సాయంత్రం వేళల్లో బయట వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు ఏసీని ఫ్యాన్ మోడ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. కొంతసేపు కూలింగ్ మోడ్‌లో గదిని చల్లబరిచాక, ఫ్యాన్ మోడ్‌కి మారిస్తే ఆ చల్లదనం గది మొత్తం సమానంగా పరుచుకుంటుంది. విద్యుత్ కూడా ఆదా అవుతుంది.

ఎప్పుడు వాడకూడదు?

గదిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా వాతావరణంలో తేమ (ఉక్కపోత) ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాన్ మోడ్ అంతగా పనిచేయదు. కూలింగ్ మోడ్ గాలిలోని తేమను తీసివేసి ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఫ్యాన్ మోడ్‌కు ఆ శక్తి ఉండదు. వర్షాకాలంలో లేదా తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు ఫ్యాన్ మోడ్ వాడితే గది మరింత ఉక్కపోతగా అనిపిస్తుంది. అలాగే రిమోట్‌లోని ‘మోడ్’ బటన్ నొక్కి ఈ ఫ్యాన్ మోడ్‌ను సులభంగా ఎంచుకోవచ్చు. సరైన సమయంలో, సరైన పద్ధతిలో దీనిని వాడితే చల్లదనంతో పాటు కరెంటు బిల్లు ఎక్కువ రాకుండా చూసుకోవచ్చు.

Also Read: 9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

Related News

ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు బ్యాటరీ సేవ్ చేయడానికి పాటించాల్సిన 5 రూల్స్!

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!

రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

Big Stories

Advertisement
×