E-Paper
Advertisement

Best Solar Ac: కరెంట్ బిల్లుకు చెక్.. 2026లో బెస్ట్ సోలార్ ఏసీలు ఇవే ! ధర, ఫీచర్ల వివరాలు

Best Solar Ac: కరెంట్ బిల్లుకు చెక్.. 2026లో బెస్ట్ సోలార్ ఏసీలు ఇవే ! ధర, ఫీచర్ల వివరాలు
Advertisement

Best Solar Ac: వేసవి ఎండలు ఏటా ముదురుతున్నాయి. ఒకప్పుడు ఏసీ అనేది లగ్జరీగా ఉండేది. కానీ ఇప్పుడు అది ప్రతి ఇంట్లో అవసరంగా మారింది. అయితే.. ఏసీ వాడటం వల్ల వచ్చే కరెంట్ బిల్లులు మధ్యతరగతి సామాన్యులకు గుదిబండగా మారుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారమే సోలార్ ఏసీ (Solar AC). సూర్యరశ్మి ద్వారా పనిచేసే ఈ ఏసీలు 2026 నాటికి మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. కరెంట్ బిల్లుల భయం లేకుండా.. పర్యావరణానికి మేలు చేస్తూ చల్లని గాలిని ఆస్వాదించాలనుకునే వారికి సోలార్ ఏసీ ఒక వరం.ప్రస్తుతం మార్కెట్ లో లభించే బెస్ట్ సోలార్ ఏసీల గురించి, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

సోలార్ ఏసీ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?
సాధారణ ఏసీలు కేవలం గ్రిడ్ (ప్రభుత్వ) కరెంట్ తో నడుస్తాయి. కానీ సోలార్ ఏసీలు మీ ఇంటి పైకప్పుపై అమర్చిన సోలార్ ప్యానెల్స్ నుండి వచ్చే శక్తితో పనిచేస్తాయి. ఇందులో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి..

Advertisement

హైబ్రిడ్ సోలార్ ఏసీ (Hybrid Solar AC): ఇది పగటిపూట సోలార్ ప్యానెల్స్ ద్వారా.. ఎండ లేనప్పుడు గ్రిడ్ కరెంట్ తో నడుస్తుంది. 2026లో ఇవే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.

ఆన్-గ్రిడ్ సోలార్ ఏసీ (On-Grid): ఇది నేరుగా ప్రభుత్వ కరెంట్ లైన్లతో కలిసి పనిచేస్తుంది. అదనంగా తయారైన సోలార్ కరెంట్ ను తిరిగి గ్రిడ్‌కు పంపవచ్చు.

Advertisement

ఆఫ్-గ్రిడ్ సోలార్ ఏసీ (Off-Grid): ఇది పూర్తిగా బ్యాటరీల మీద ఆధారపడి ఉంటుంది. కరెంట్ అస్సలు లేని ప్రాంతాలకు ఇది బెస్ట్.

ఇండియా టాప్ సోలార్ ఏసీ బ్రాండ్లు:
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్, యూజర్ రివ్యూల ప్రకారం కొన్ని బెస్ట్ సోలార్ ఏసీలు..

1. Nexus Solar Energy:
నెక్సస్ కంపెనీ సోలార్ రంగంలో అగ్రగామిగా ఉంది.వీటి NXSOL సిరీస్ ఏసీలు హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్నాయి.

ప్రయోజనం: ఇవి 1.5 టన్ కెపాసిటీలో లభిస్తాయి. వీటికి సూర్యరశ్మి ఉంటే చాలు.. గ్రిడ్ కరెంట్ అవసరం లేదు.

ధర: సుమారు రూ. 45,000 నుంచి రూ.. రూ.60,000 వరకు (ప్యానెల్స్‌తో కలిపి ధర మారుతుంది).

2. Kenbrook Solar:
కెన్‌బ్రూక్ సోలార్ ఏసీలు తమ మన్నికకు, సర్వీస్‌కు ప్రసిద్ధి. వీరి హైబ్రిడ్ ఏసీలు చాలా తక్కువ మెయింటెనెన్స్‌తో పనిచేస్తాయి.

ప్రయోజనం: ఇవి పగటిపూట 100% సోలార్ పవర్ మీద నడుస్తూ కరెంట్ బిల్లును పూర్తిగా సున్నా చేస్తాయి.

3. Godrej & Blue Star :
సంప్రదాయ ఏసీ బ్రాండ్లు అయిన గోద్రెజ్ , బ్లూ స్టార్ కూడా ఇప్పుడుసోలార్ కంపాటబుల్ ఏసీలను మార్కెట్లోకి తెచ్చాయి. వీటిని సోలార్ PCU (Power Conditioning Unit) ద్వారా అనుసంధానించవచ్చు.

ప్రయోజనం: బ్రాండ్ నమ్మకం , వేగవంతమైన కూలింగ్ వీరి ప్రత్యేకత.

4. Sinfin:
సిన్ఫిన్ కంపెనీ 2026లో బడ్జెట్ ధరలో మంచి సోలార్ ఏసీలను అందిస్తోంది.

ప్రయోజనం: చిన్న గదుల కోసం 1 టన్ , పెద్ద హాల్స్ కోసం 2 టన్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి.

సోలార్ ఏసీ వల్ల లాభాలేంటి?
కరెంట్ బిల్లుల ఆదా: పగటిపూట మీరు ఎంత ఏసీ వాడినా కరెంట్ బిల్లు అస్సలు రాదు. దాదాపు 80% వరకు విద్యుత్ ఖర్చు తగ్గుతుంది.

పర్యావరణానికి మేలు: బొగ్గు విద్యుత్తు కాకుండా సహజ సిద్ధమైన సూర్యరశ్మిని వాడటం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి.

Also Read: 100 ఇంచుల రెడ్ మీ టీవీ వచ్చేసిందోచ్.. ఇక మీ ఇల్లు థియేటర్ అవడం గ్యారంటీ !

తక్కువ శబ్దం: సోలార్ ఇన్వర్టర్ ఏసీలు సాధారణ ఏసీల కంటే.. చాలా తక్కువ శబ్దాన్ని చేస్తాయి.

మెయింటెనెన్స్: వీటిని ఒక్కసారి అమర్చుకుంటే ప్యానెల్స్ 25 ఏళ్ల వరకు పని చేస్తాయి. మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ.

ఏది బెస్ట్?
మీకు ఒకవేళ పగటిపూట ఏసీ వాడకం ఎక్కువగా ఉంటే.. (ఉదాహరణకు ఆఫీసులు లేదా పిల్లలు ఇంట్లో ఉండే వారు), Nexus లేదా Kenbrook వంటి ప్యూర్ సోలార్ ఏసీలను ఎంచుకోవడం బెస్ట్. ఇప్పటికే సోలార్ ప్యానెల్స్ ఇంట్లో ఉన్నవారు Godrej లేదా Blue Star బ్రాండ్ల ఇన్వర్టర్ ఏసీలను తీసుకోవచ్చు. ప్రారంభ పెట్టుబడి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ.. 4-5 ఏళ్లలోనే మీరు ఆదా చేసిన కరెంట్ బిల్లుల ద్వారా ఈ డబ్బు తిరిగి వచ్చేస్తుంది.

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×