E-Paper
Advertisement

Telangana Farmer Mela: నాడు మన్మోహన్.. నేడు రేవంత్ రెడ్డి: రైతు సంక్షేమంలో తెలంగాణ సరికొత్త రికార్డు!

Telangana Farmer Mela: నాడు మన్మోహన్.. నేడు రేవంత్ రెడ్డి: రైతు సంక్షేమంలో తెలంగాణ సరికొత్త రికార్డు!

Telangana Farmer Mela: తెలంగాణను ఆయిల్ పామ్ సాగులో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్వహించిన ‘రైతు మహోత్సవంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. “రైతు ఏడిచిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదు” అనే సూత్రాన్ని నమ్మి తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా చేసిన రుణమాఫీ తరహాలోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రూ. 21,000 కోట్ల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. విమర్శలను పట్టించుకోకుండా రైతు కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి బదలాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

కేవలం 16 నెలల్లోనే నర్మెట్టలో ఈ ఫ్యాక్టరీని నిర్మించామని, దీని ద్వారా వచ్చే వ్యర్థాల నుండే 4 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో రిఫైనరీలు లేక ముడి నూనెను పక్క రాష్ట్రాలకు పంపాల్సి వచ్చేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి సహకారంతో రూ. 50 కోట్లతో ఇక్కడే రిఫైనరీకి శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత రైతులకు వరమని చెప్పారు. సాగులో ఎదురయ్యే యూరియా కొరతను అధిగమించేందుకు ముఖ్యమంత్రి పదిసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అదనపు కోటాను సాధించారని గుర్తు చేశారు.

వాగ్దానాల అమలులో వెనకడుగు లేదు: మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తోందని చెప్పారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఎలా ఇచ్చారో, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ ప్రభుత్వం బీదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల పక్షపాతి అని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి: ఎంపీ రఘునందన్ రావు

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి కొండపాక మండల సమస్యలను తీసుకువచ్చారు. తపాసుపల్లి రిజర్వాయర్ నుండి గజ్వేల్ ప్రాంతానికి నీళ్లు వెళ్తున్నప్పటికీ, పక్కనే ఉన్న కొండపాక మండలంలోని బందారం సహా ఎనిమిది గ్రామాలకు పదేళ్లుగా నీళ్లు అందడం లేదని వివరించారు. ఈ చివరి గ్రామాలకు సాగునీరు అందేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ సాగుకు సబ్సిడీల రూపంలో పూర్తి సహకారం అందిస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వారి ఒళ్ళంతా విషమే: మంత్రి పొంగులేటి 

సిద్దిపేట జిల్లా నర్మెట్ట రైతు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తమ హయాంలోనే నిర్మించామని గత పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఒకసారి అద్దంలో ముఖాలు చూసుకోవాలని ఎద్దేవా చేశారు. అధికార దాహంతో కొందరు గుంటనక్కల్లా వ్యవహరిస్తున్నారని.. వారి ఒళ్ళంతా విషమేనని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని.. సాదా బైనామాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని.. అలాగే అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×