E-Paper
Advertisement

Redmi Smart TV MAX 100-inch 2026:100 ఇంచుల రెడ్ మీ టీవీ వచ్చేసిందోచ్.. ఇక మీ ఇల్లు థియేటర్ అవడం గ్యారంటీ !

Redmi Smart TV MAX 100-inch 2026:100 ఇంచుల రెడ్ మీ టీవీ వచ్చేసిందోచ్.. ఇక మీ ఇల్లు థియేటర్ అవడం గ్యారంటీ !
Advertisement

Redmi Smart TV MAX 100-inch 2026: టీవీల ప్రపంచంలో పెద్ద స్క్రీన్ అంటే.. ఇష్టం ఉన్నవాళ్లకు ఇది ఒక పెద్ద సర్‌ప్రైజ్! రెడ్‌మీ ఇప్పుడు తన కొత్త స్మార్ట్ టీవీ MAX 100-inch 2026 మోడల్‌ను లాంచ్ చేసింది. 100 ఇంచుల భారీ డిస్‌ప్లే.. 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లతో ఇది హోమ్ థియేటర్ అనుభవాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్తోంది. సినిమాలు, స్పోర్ట్స్, గేమింగ్ వంటి ఆన్ ఇన్ వన్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి ఇది ఒక సూపర్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఈ టీవీ సైజ్ గురించి చెప్పాలి. 100 ఇంచుల టీవీ అంటే నిజంగా చాలా పెద్దది. మనం సినిమా థియేటర్‌లో చూసే స్క్రీన్ ఫీలింగ్ దాదాపు ఇంట్లోనే వస్తుంది. పెద్ద హాల్ లేదా లివింగ్ రూమ్ ఉన్నవాళ్లకు ఇది బాగా సూట్ అవుతుంది. చిన్న గదుల్లో అయితే ఇది ఓవర్‌గా అనిపించొచ్చు.

ప్రత్యేకతలు:
ఇంకా ముఖ్యమైన విషయం 144Hz రిఫ్రెష్ రేట్. సాధారణంగా.. చాలా టీవీలు 60Hz లేదా 120Hz ఉంటాయి. కానీ ఇది 144Hz కాబట్టి స్క్రీన్ మీద మోషన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ముఖ్యంగా.. క్రికెట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తే.. బంతి బ్లర్ అవకుండా క్లియర్‌గా కనిపిస్తుంది. గేమింగ్ చేసే వాళ్లకు అయితే ఇది మరింత బాగుంటుంది.

Advertisement

పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే.. రెడ్ మీ ఈ టీవీలో అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లే టెక్నాలజీ వాడింది. కలర్స్ బ్రైట్‌గా, నేచురల్‌గా కనిపిస్తాయి.హెచ్డీఆర్ సపోర్ట్ ఉండటంతో డార్క్ సీన్స్ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి ప్లాట్‌ఫార్మ్‌లలో సినిమాలు చూస్తే నిజంగా థియేటర్ ఫీలింగ్ వస్తుంది.

సౌండ్:
సౌండ్ కూడా ఈ టీవీ లో బాగానే ఉంది. పెద్ద స్క్రీన్ ఉన్న టీవీలకు సౌండ్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండాలి కాబట్టి రెడ్‌మీ దానిపై కూడా ఫోకస్ పెట్టింది. అయితే.. మీరు ఇంకా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే.. సౌండ్‌బార్ వాడితే ఇంకా బెటర్. స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా స్మార్ట్ టీవీ. వై ఫై బ్లూటూత్, వాయిస్ కంట్రోల్ లాంటి ఆల్ ఇన్ వన్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. రిమోట్‌తోనే గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు. యూట్యూబ్, ఓటిటి యాప్స్ అన్నీ సులభంగా యాక్సెస్ చేయొచ్చు.

Advertisement

Also Read: కొత్త వాషింగ్ మెషిన్ కొంటున్నారా? ఈ 3 బ్రాండ్ల మధ్య తేడాలు తెలియకుండా అస్సలు కొనకండి!

ఇదిలా ఉంటే.. దీని డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. బీజెల్స్ చాలా తక్కువగా ఉండటంతో ఫుల్ స్క్రీన్ లుక్ వస్తుంది. గోడకు మౌంట్ చేస్తే.. ఇంకా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

ఇప్పుడు ఒక చిన్న డౌట్.. ఇది ఎవరికి బెస్ట్?
1.పెద్ద స్క్రీన్ ఇష్టపడేవాళ్లకు
2.గేమింగ్ లవర్స్‌కు
3. హోమ్ థియేటర్ సెటప్ ప్లాన్ చేసేవాళ్లకు
కానీ.. బడ్జెట్, స్పేస్ రెండూ సరిపోతేనే ఈ టీవీ తీసుకోవాలి.

మొత్తానికి.. Redmi Smart TV MAX 100-inch 2026 ఒక ప్రీమియం, ఫీచర్-ప్యాక్‌డ్ టీవీ. పెద్ద స్క్రీన్, మంచి పిక్చర్ & సౌండ్ క్వాలిటీ అన్నీ కలిపి ఇది నిజంగా ఒక నెక్ట్ లెవల్ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×