E-Paper
Advertisement

Best Time to Buy AC: కొత్త ఏసీ ఎప్పుడు కొనాలి? ఉత్తమ సమయం ఏది? చౌకగా ఎలా పొందొచ్చు!

Best Time to Buy AC: కొత్త ఏసీ ఎప్పుడు కొనాలి? ఉత్తమ సమయం ఏది? చౌకగా ఎలా పొందొచ్చు!
Advertisement

Best Time to Buy AC: సాధారణంగా ఏసీల ధరలు.. కాలం, సమయం, డిమాండ్ కు అనుగుణంగా మార్పులకు లోనవుతుంటాయి. ఈ నేపథ్యంలో 2026లో కొత్తగా ఏసీ కొనాలని ప్లాన్ చేసే వారు.. దీనిపై అవగాహన తప్పనిసరి. ఏసీని కొనేందుకు ఉత్తమమైన సమయాన్ని గుర్తించగలిగితే.. తక్కువ ధరకే దానిని సొంతం చేసుకోవచ్చు. దీని వల్ల మీ డబ్బు చాలా వరకూ ఆదా అవుతుంది.

ఏసీ కొనడానికి బెస్ట్ టైమ్ ఏది?

ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య వరకు అధునాతన ఏసీలు కొనడానికి బెస్ట్ టైమ్ గా చెప్పవచ్చు. కంపెనీలు తమ కొత్త 2026 మోడల్స్‌ను లాంచ్ చేసే సమయం ఇది. అదే సమయంలో పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి భారీ డిస్కౌంట్లు సైతం అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలోనే అమెజాన్, ఫ్రిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ సైట్లలో ప్రీ – సమ్మర్ సేల్స్ కూడా నడుస్తుంటాయి. రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి స్టోర్లలోనూ భారీ డిస్కౌంట్లలో ఏసీని పొందవచ్చు.

మరి కొనకూడదని సమయం ఏది?

Advertisement

మార్చి 15 తర్వాత నుంచి ఎండల తీవ్రత తారాస్థాయికి చేరుకుంటాయి. అప్పటి నుంచి మే వరకూ అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కొనసాగుతాయి. కాబట్టి సహజంగానే ఆ సమయంలో ఏసీలకు అధిక డిమాండ్ ఉంటుంది. దీనివల్ల ఏసీల ధరలు గరిష్టంగా ఉంటాయి. అదే సమయంలో ఇన్ స్టాలేషన్ కోసం టెక్నిషియన్లు సైతం దొరకడం కష్టంగా మారుతుంది. దీనిని అవకాశంగా చేసుకొని టెక్నిషియన్లు అధిక మెుత్తంలో డబ్బులు డిమాండ్ చేయవచ్చు.

వర్షాకాలంలో ఏసీల పరిస్థితేంటి?

జూన్ మెుదటి వారంలో రుతుపవనాలు ఎంటరై.. చివరినాటికి పెద్ద ఎత్తున వర్షాలు మెుదలవుతాయి. ఇది సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. అయితే సమ్మర్ తో పోలిస్తే.. వర్ష కాలంలో ఏసీల ధరలు కాస్త స్థిరంగా ఉంటాయి. అలాగనీ చౌకగా లభిస్తాయని చెప్పలేం. కాకపోతే సమ్మర్ తో పోలిస్తే ఏసీలు కాస్త తక్కువకే అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు.

Advertisement

Also Read: Electric Scooter Market: భారత్ లో ఈవీ స్కూటర్ల జోరు, ఏడాదిలో ఎన్ని లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయంటే?

శీతాకాలంలో బెస్ట్..!

అక్టోబర్ – జనవరి మధ్య వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అయితే ఇదే డిస్కౌంట్ లో ఏసీలను కొనుగోలు చేసేందుకు మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు. దీపావళి, న్యూయర్, సంక్రాంతి పండుగ ఆఫర్లు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఏసీలను భారీ డిస్కౌంట్లతో దక్కించుకోవచ్చు. మరోవైపు ఏడాది ప్రారంభంలో వచ్చిన ఏసీల స్టాక్ ను క్లియర్ చేసుకునేందుకు స్టోర్ నిర్వహకులు, కంపెనీలు పెద్ద మెుత్తంలో రాయితీలు ప్రకటిస్తాయి. అక్టోబర్-జనవరి మధ్య కాలాన్ని తక్కువ ధరలో ఏసీ కొనుగోలుకు సరైన సమయంగా చెప్పవచ్చు.

Also Read: Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏబీవీపీ నేతల అరెస్ట్, మెయిన్ గేట్ వద్ద బైఠాయింపు

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×