E-Paper
Advertisement

LIC Bond Missing: ఎల్ఐసీ బాండ్ మిస్ అయిందా?.. డూప్లికేట్ బాండ్ అప్లై ప్రాసెస్ ఇలా

LIC Bond Missing: ఎల్ఐసీ బాండ్ మిస్ అయిందా?.. డూప్లికేట్ బాండ్ అప్లై ప్రాసెస్ ఇలా
Advertisement

LIC Bond Missing: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)లో ఏదైనా జీవిత బీమా పాలసీ తీసుకుంటే.. ఆ సంస్థ బాండ్‌ను జారీ చేస్తుంది. ఇందులో పాలసీ నంబర్‌, ఇన్సూరర్ పేరు, నామినీ ఇలా పూర్తి వివరాలు ఉంటాయి. ఒకవేళ పాలసీపై లోన్‌ తీసుకోవాలనుకుంటే, క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ టైమ్ లో ఒరిజినల్ బాండ్ అవసరం అవుతుంది. అందుకే ఎల్ఐసీ బాండ్ ను భద్రపరుచుకోవాలి.

మనం లేకపోయినా.. ఒరిజినల్ బాండ్ ఉంటే.. నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణంగా పాలసీ డాక్యుమెంట్‌ పోతే? లేదంటే అగ్నిప్రమాదం, వరదల కారణంగా దెబ్బతింటే, టెన్షన్ పడాల్సిన అవసరంలేదు. పాలసీదారుడి రిక్వెస్ట్ మేరకు ఎల్ఐసీ.. డూప్లికేట్‌ బాండ్‌ను జారీ చేస్తుంది. ఇది ఒరిజినల్‌ బాండ్ లానే పనిచేస్తుంది.

డూప్లికేట్ బాండ్ ప్రాసెస్

  • పాలసీ బాండ్ పోతే ఆ విషయాన్ని ముందుగా ఎల్‌ఐసీ ఏజెంట్‌కు తెలియజేయండి. లేదంటే నేరుగా ఎల్‌ఐసీ బ్రాంచ్‌కు వెళ్లండి.
  • డూప్లికేట్‌ బాండ్‌ కోసం, మీరు గతంలో కట్టిన ప్రీమియం రసీదులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • పాలసీ విలువను బట్టి స్టాంప్‌ డ్యూటీ చెల్లించి, ఇండెమ్నిటీ బాండ్‌ను నోటరీ చేయించి సబ్‌మిట్ చేయాలి.
  • పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌.. ఇలా ఏదైనా ఒక గుర్తింపు కార్డును సమర్పించాలి.
  • రెసిడెన్స్‌ ప్రూఫ్‌ కింద టెలిఫోన్‌ బిల్లు, బ్యాంక్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌, ఎలక్ట్రిసిటీ బిల్లు, రేషన్‌ కార్డు సబ్మిట్ చేయాలి.
  • ఎల్ఐసీ బ్రాంచ్‌ లో పాలసీ ప్రిపరేషన్‌ ఛార్జీలు చెల్లిస్తే మీకు డూప్లికేట్‌ బాండ్‌ను జారీ చేస్తారు.
Advertisement

ఒకవేళ బాండ్ పాక్షికంగా దెబ్బతింటే.. డూప్లికేట్‌ పాలసీకి అప్లై చేసినప్పుడు, పాత బాండ్ పేపర్ ను ఫ్రూఫ్ చూపించవచ్చు. గతంలో పాలసీ బాండ్ ను రెండు పేపర్లలో ఇచ్చేవారు. ప్రస్తుతం బాండ్ ను ఒక బుక్ లెట్ రూపంలో జారీ చేస్తున్నారు. అలాగే పాలసీ తీసుకున్నప్పుడు ఇచ్చిన ఈ-మెయిల్ కు పాలసీ బాండ్ ను మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ ఆన్ లైన్ పాలసీలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎల్ఐసీ యాప్ ల ద్వారా మీ పాలసీ డాక్యుమెంట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Also Read: కాఫీ షాప్స్‌లో టైంపాస్ చేస్తే జరిమానాలు.. కస్టమర్లకు ఇక కష్టాలే!

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×