E-Paper
Advertisement

ఏసీ లాంటి చల్లదనం.. బడ్జెట్ ధరలో ‘థర్మల్ ప్రొటెక్షన్’‌ ఉన్న బెస్ట్ ఎయిర్ కూలర్లు!

ఏసీ లాంటి చల్లదనం.. బడ్జెట్ ధరలో ‘థర్మల్ ప్రొటెక్షన్’‌ ఉన్న బెస్ట్ ఎయిర్ కూలర్లు!
Advertisement

Best Air Coolers: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండల పరిస్థితి ఎలా ఉందంటే.. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో కొందరు ఏసీలు కొంటే.. మరి కొందరు ఎయిర్ కూలర్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే, కూలర్ కొన్న కొద్ది రోజులకే వోల్టేజ్ తేడాల వల్ల మోటార్ కాలిపోవడం, రిపేర్ల కోసం వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టడం వంటివి తరచూ జరుగుతుంటాయి కూడా. ఇప్పుడీ ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ప్రముఖ ఉష కంపెనీ తమ లేటెస్ట్ కూలర్లలో ‘థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్’ అప్డేటెడ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడీ కొత్త ఫీచర్ వలన కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం.

 థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ అంటే?

సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది కూలర్ మోటార్‌కు బాడీగార్డ్ లాంటిది. ఒక్కోసారి కూలర్‌లో నీళ్లు అయిపోయినా లేదా కరెంట్ హెచ్చుతగ్గులు ఉన్నా మోటార్ విపరీతంగా వేడెక్కిపోతుంది. అలాంటప్పుడు ఈ టెక్నాలజీ వెంటనే స్పందించి మోటార్‌ను ఆపేస్తుంది. దీనివల్ల మోటార్ కాలిపోయే ప్రమాదం తప్పుతుంది. పదే పదే రిపేర్లు చేయించే బాధ ఉండదు. పైగా మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్లు అవ్వకుండా రక్షణ కూడా ఉంటుంది.

హాల్లో పెట్టుకోవాలంటే..

Advertisement

హాలులో లేదంటే పెద్ద గదిలో కూర్చున్నప్పుడు గది మూలమూలకూ గాలి రావాలంటే ఈ 50 లీటర్ల మోడల్ ది బెస్ట్. ఇది గాలిని నాలుగు వైపులా సమానంగా పంపిణీ చేస్తుంది. అలాగే దీని ప్రత్యేకత ఏంటంటే.. పదే పదే నీళ్లు నింపే పని లేకుండా ఆటో ఫిల్ సదుపాయం ఉంది. చిన్న చిన్న పట్టణాల్లో పవర్ కట్స్ ఎక్కువ కాబట్టి.. ఇది ఇన్వర్టర్ మీద కూడా నడుస్తుంది.

Also Read: చైనా బ్రాండ్లకు చెక్.. భారత్‌లో ఇకపై ఈ 5 మేక్ ఇన్ ఇండియా CCTV కెమెరాలదే హవా!

ఎక్కువ గాలి వీచే స్ట్రైకర్ మోడల్..

Advertisement

గాలి చాలా ఫోర్స్‌గా రావాలి అనుకుంటే.. ఈ ఉష స్ట్రైకర్ కూలర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇది దాదాపు 11 మీటర్ల దూరం వరకు గాలిని విసురుతుంది. అలాగే ఇందులో ఉండే హనీకోంబ్ ప్యాడ్లు ఇంటిని ఇట్టే చల్లబరుస్తాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రిజల్ట్ ఇచ్చే కూలర్ ఇది.

ఆఫీసుల కోసం ఏరోస్టైల్..

ఆఫీసులో పెట్టడానికి బెస్ట్ కూలర్ కోసం చూస్తుంటే.. ఈ 105 లీటర్ల కెపాసిటీ ఉన్న ఏరోస్టైల్ బాగుంటుంది. దీనిలో పెద్ద ఐస్ బాక్స్ ఉంటుంది. అందులో ఐస్ ముక్కలు వేస్తే చాలు ఏసీ లాంటి చల్లదనం వస్తుంది. వర్షాకాలంలో వచ్చే ఉక్కపోతను తగ్గించడానికి ఇందులో హ్యుమిడిటీ కంట్రోల్ కూడా ఇచ్చారు.

బ్యాచిలర్స్ కోసం..

ఒక్కరి కోసం లేదంటే చిన్న రూమ్ కోసం చూస్తుంటే.. ఈ 20 లీటర్ల స్టెల్లార్ లేదా 35 లీటర్ల కూల్ బాయ్ మోడల్స్ బాగా సెట్ అవుతాయి. ఇవి తక్కువ కరెంట్ తీసుకోవడమే కాకుండా గది మూలల్లో ఇట్టే పట్టేస్తాయి. వీటిలో కూడా ఐస్ వేసుకునే వెసులుబాటు ఉండటం విశేషం. ఫైనల్‌గా కరెంట్ బిల్లు తక్కువ రావాలి, కూలర్ ఎక్కువ కాలం మన్నాలి అనుకునే వారికి ఈ థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఉన్న మోడల్స్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.

Also Read: ఎండలు ముదిరినా, కరెంట్ పోయినా ఏం పర్లేదు.. ఈ సోలార్ ఫ్యాన్ ఉంటే రోజంతా చల్లని గాలే!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×