E-Paper
Advertisement

డస్ట్ మాయం, ఇల్లు క్లీన్.. సోఫాలు, కార్నర్స్ కోసం అదిరిపోయే వ్యాక్యూమ్ క్లీనర్స్!

డస్ట్ మాయం, ఇల్లు క్లీన్.. సోఫాలు, కార్నర్స్ కోసం అదిరిపోయే వ్యాక్యూమ్ క్లీనర్స్!
Advertisement

Best vacuum cleaners for home: ఇంట్లో పేరుకుపోయిన దుమ్మును వదిలించుకోవడం నిజంగా పెద్ద పనే. కానీ ఈ మోడర్న్ టెక్నాలజీ యుగంలో ఆ టెన్షన్ అసలు అవసరం లేదు. సోఫాలు, కార్పెట్లు, మంచాల కింద భాగాలు , ఎవరికీ అందని మూలమూలల్లో ఉన్న సూక్ష్మమైన డస్ట్‌ను కూడా ఇట్టే పీల్చేసే అద్భుతమైన గాడ్జెట్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. హైయర్, యూరికా ఫోర్బ్స్ వంటి టాప్ బ్రాండ్లకు చెందిన బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ సహాయంతో మీ ఇల్లును శ్రమ లేకుండా సరికొత్తగా మెరిపించవచ్చు.

పూర్తి వివరాలు:

1. Eureka Forbes SmartClean Auto Bin Turbo:

ఇల్లు శుభ్రం చేసే పనిని పూర్తిగా ఆటోమేటిక్ చేసేయాలనుకునే .. టెక్ లవర్స్ కోసం ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఇది ఏకంగా 7000Pa హైపర్ సక్షన్ పవర్‌తో దూసుకువస్తుంది. లిడార్ ,నేవిగేషన్ టెక్నాలజీ సహాయంతో ఇల్లు మొత్తాన్ని తనంతట తానే మ్యాప్ చేసుకుని తిరుగుతుంది. ఆటో డస్ట్ కలెక్షన్ స్టేషన్ ఉండటం వల్ల దాదాపు 40 రోజుల వరకు మీరు చెత్తను ముట్టుకోవాల్సిన పనే లేదు.

Advertisement

ధర: సుమారు రూ.25,499.

2. Eureka Forbes Wet & Dry Armor Vacuum Cleaner:

ఇంట్లో కేవలం దుమ్ము మాత్రమే కాదు, అనుకోకుండా నీళ్లు లేదా జ్యూస్‌లు వంటి లిక్విడ్ పడితే క్లీన్ చేయడానికి ఇది బెస్ట్ మాన్‌స్టర్. అంతే కాకుండా 22 kPa పవర్ ఫుల్ సక్షన్ పవర్, 20 లీటర్ల పెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ దీని సొంతం. దీంలోని పవర్‌ ఫుల్ బ్లోయర్ ఫంక్షన్‌తో మూలల్లో ఉన్న మొండి డస్ట్‌ను ఇరుకైన ప్రదేశాల నుంచి ఇట్టే బయటి గాలితో ఊడ్చేయొచ్చు.

Advertisement

ధర:సుమారు రూ.6,699.

3. Eureka Forbes Kordfree K20 SuperSilent:

వైర్ల గోల లేకుండా ఇల్లు మొత్తం స్వేచ్ఛగా తిరుగుతూ క్లీన్.. చేసుకోవాలనుకునే వారికి ఈ కార్డ్‌లెస్ గ్యాజెట్ సూపర్‌గా సెట్ అవుతుంది. అంతే కాకుండా ఇది సూపర్ లైట్‌వెయిట్ , ఎలాంటి పెద్ద సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా పని చేస్తుంది. జీరో-బెండ్ టెక్నాలజీ ఉండటం వల్ల మంచాలు, సోఫాల కింద క్లీన్ చేయడానికి నడుము వంచాల్సిన పనే లేదు.

ధర: సుమారు రూ. 14,999.

4. Haier CIVIC X11 Pro RVC:

మోడర్న్ ఇళ్ల స్టైల్‌కు తగ్గట్టుగా హైయర్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ స్మార్ట్ రోబోట్ క్లీనర్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. పవర్‌ఫుల్ మోటార్, అద్దిరిపోయే బ్యాటరీ బ్యాకప్, స్మార్ట్ యాప్ కంట్రోల్ దీని ప్రత్యేకతలు. సోఫాలు, కార్పెట్లపై అతుక్కుపోయే జుట్టు, డస్ట్ కణాలను క్షణాల్లో క్లీన్ చేస్తుంది.

ధర: సుమారు రూ. 22,999.

Also Read: గేమింగ్ పీక్స్ చూపిస్తాయ్.. రూ.1.5 లక్షలలోపు బెస్ట్ లాప్‌టాప్స్ ఇవే భయ్యా!

5. Eureka Forbes Quick Clean DX:

తక్కువ బడ్జెట్‌లో మిడిల్ క్లాస్  ఫ్యామిలీలకు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్. 1200 వాట్ల పవర్‌ఫుల్ మోటార్‌తో వచ్చే ఈ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ బరువు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వచ్చే వేర్వేరు అటాచ్‌మెంట్స్ సాయంతో కర్టెన్లు, సోఫాల మడతలు, కష్టమైన కార్నర్లను నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు.

ధర: సుమారు రూ.3,499.

ఇంట్లో డస్ట్ లేకుండా హైజెనిక్‌గా ఉంచుకుంటే.. అనారోగ్య సమస్యలకు చాలా దూరంగా ఉండొచ్చు. మీ బడ్జెట్, అవసరాలకు తగిన బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఎంచుకుని మీ ఇంటిని మెరిపించేయండి!

Related News

ప్రొజెక్టర్ డిస్‌ప్లే మసకగా ఉందా? ఈ 4 మార్పులు చేస్తే సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

రూ.30,000 లోపు కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్లు.. చిటికెలో ఫ్రీజర్‌ను ఫ్రిడ్జ్‌గా మార్చుకోవచ్చు!

గేమింగ్ పీక్స్ చూపిస్తాయ్.. రూ.1.5 లక్షలలోపు బెస్ట్ లాప్‌టాప్స్ ఇవే భయ్యా!

సామ్‌సంగ్ 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్..ఆఫర్ ముగిసేలోపే కొనేయండి

ఫిట్‌నెస్ లవర్స్‌కు పండగే.. మతిపోగొట్టే ఫీచర్లతో Motorola Watch Ultra గ్లోబల్ ఎంట్రీ!

వావ్ అనిపిస్తున్న మోటరోలా తొలి వైడ్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ ఫీచర్లకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×