E-Paper
Advertisement

రూ.30,000 లోపు కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్లు.. చిటికెలో ఫ్రీజర్‌ను ఫ్రిడ్జ్‌గా మార్చుకోవచ్చు!

రూ.30,000 లోపు కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్లు.. చిటికెలో ఫ్రీజర్‌ను ఫ్రిడ్జ్‌గా మార్చుకోవచ్చు!
Advertisement

Refrigerators: అందరి ఇంట్లోనూ ప్రతిరోజూ నాన్‌స్టాప్‌గా రన్ అయ్యే పరికరం ఏదైనా ఉందంటే అది రిఫ్రిజిరేటర్ మాత్రమే. ఈ పరికరం కూరగాయలు, పండ్లు, పాలు, డ్రింక్స్‌తో పాటు వండిన ఆహారాన్ని కూడా ఎక్కువ రోజులు నిల్వ చేయాల్సి వస్తుంది. అందుకే కొత్త ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కేవలం ధర, లీటర్ల సామర్థ్యం మాత్రమే కాకుండా ఉపయోగపడే ఫీచర్లను కూడా చూడాలి. ముఖ్యంగా కన్వర్టిబుల్ ఫ్రీజర్ ఉన్న మోడళ్లు అవసరానికి తగ్గట్టు స్టోరేజ్ మార్చుకునే సౌకర్యాన్ని ఇస్తాయి. ఈ నేపథ్యంలో రూ.30 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఆప్షన్స్ చూద్దాం.

కన్వర్టిబుల్ ఫ్రీజర్ అంటే ఇదే:

సాధారణ ఫ్రిడ్జ్‌లో ఫ్రీజర్ భాగాన్ని ఎక్కువగా ఫ్రీజింగ్ కోసం మాత్రమే వాడాలి. కానీ కన్వర్టిబుల్ ఫ్రీజర్ ఫ్రిడ్జ్‌లో అవసరాన్ని బట్టి ఆ భాగాన్ని ఫ్రిడ్జ్ స్టోరేజ్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో ఫ్రీజర్ అవసరం తక్కువగా ఉన్నప్పుడు అదనపు కూరగాయలు, పండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలకు స్థలం పెంచుకోవచ్చు. ఎక్కువగా కూరగాయలు, గ్రాసరీ కొనేవారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

విప్రూల్ ఫ్రిడ్జ్‌లో సూపర్ ఫీచర్లు:

Advertisement

రూ.30 వేలలో విప్రూల్‌కు చెందిన కొన్ని డబుల్ డోర్ మోడళ్లు కన్వర్టిబుల్ స్టోరేజ్‌తో కనిపిస్తున్నాయి. ఇంటెల్లిసెన్స్ ఇన్వర్టర్ కంప్రెసర్ కూలింగ్ అవసరాన్ని బట్టి పని చేస్తుంది. దీంతో స్థిరమైన కూలింగ్‌తో పాటు విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. మోడళ్లలో మల్టీ ఎయిర్‌ఫ్లో కూలింగ్, పవర్ కట్ సమయంలో కూలింగ్ నిలుపుకునే సదుపాయం కూడా ఉంటుంది. చిన్న కుటుంబాలకు 235 లీటర్ల చుట్టూ సామర్థ్యం రోజువారీ అవసరాలకు సరిపోతుంది.

Also Read: ఫిట్‌నెస్ లవర్స్‌కు పండగే.. మతిపోగొట్టే ఫీచర్లతో Motorola Watch Ultra గ్లోబల్ ఎంట్రీ!

శాంసంగ్‌ 236L ప్రత్యేకత ఇదే:

Advertisement

శాంసంగ్ 236 లీటర్ల డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఈ బడ్జెట్‌లో మంచి మోడల్. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అవసరాన్ని బట్టి కూలింగ్‌ను సర్దుబాటు చేస్తుంది. ఆల్‌రౌండ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా చల్లని గాలి వివిధ భాగాలకు చేరుతుంది. కన్వర్టిబుల్ ఫ్రీజర్ వల్ల అవసరమైనప్పుడు అదనపు ఫ్రిడ్జ్ స్థలాన్ని పొందొచ్చు. కూరగాయల కోసం మాయిశ్చర్ ఫ్రెష్ జోన్, బాటిల్స్ పెట్టేందుకు ప్రత్యేక స్థలం ఉన్నాయి. ఎక్కువ స్థలం అవసరం లేని వాళ్లకు, చిన్న కుటుంబాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఐఎఫ్‌బీ, గోద్రేజ్‌.. ఇవీ హైలైట్స్:

ఐఎఫ్‌బీ మోడల్‌లో 30 గంటల వరకు కూలింగ్ రిటెన్షన్ ఉండటం ఆకర్షణ. తరచుగా విద్యుత్ పోయే ప్రాంతాల్లో ఇది ఉపయోగపడుతుంది. సుమారు 241 లీటర్ల సామర్థ్యంతో రోజువారీ స్టోరేజ్‌కు సరిపోతుంది. గోద్రేజ్ మోడళ్లలో 6-ఇన్-1 కన్వర్టిబుల్ ఫ్రీజర్, కూల్ షవర్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత కూలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొన్ని మోడళ్లలో నానో షీల్డ్ టెక్నాలజీ కూడా లభిస్తుంది. ధర, సామర్థ్యం, ఫీచర్లను బట్టి వీటిని పరిశీలించవచ్చు.

ఏ ఫ్రిడ్జ్ కొనడం ఉత్తమం?

రూ.30 వేల బడ్జెట్‌లో ఫ్రిడ్జ్ కొనేవారు ముందుగా ఇంట్లో ఎంతమంది ఉంటారో? ఫ్రీజర్ ఎంత అవసరమో.. నిర్ణయించుకోవాలి. చిన్న కుటుంబాలకు 235 నుంచి 244 లీటర్ల మోడళ్లు సరిపోవచ్చు. ఎక్కువగా సరుకులు నిల్వ చేసేవారు 269 లీటర్ల వరకు సామర్థ్యం ఉన్న మోడళ్లను చూడొచ్చు. కన్వర్టిబుల్ ఫీచర్ నిజంగా ఉపయోగపడుతుందా, ఎనర్జీ రేటింగ్ ఎంత, కంప్రెసర్ వారంటీ, సర్వీస్ సెంటర్లు ఎలా ఉన్నాయి అనే విషయాలు కూడా చెక్ చేయాలి. ఆన్‌లైన్‌లో ధరలు ఆఫర్లను బట్టి మారవచ్చు. కాబట్టి.. కొనుగోలు ముందు తాజా ధరను పరిశీలించడం మంచిది.

Also Read: వావ్ అనిపిస్తున్న మోటరోలా తొలి వైడ్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ ఫీచర్లకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Tags

Related News

ప్రొజెక్టర్ డిస్‌ప్లే మసకగా ఉందా? ఈ 4 మార్పులు చేస్తే సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

డస్ట్ మాయం, ఇల్లు క్లీన్.. సోఫాలు, కార్నర్స్ కోసం అదిరిపోయే వ్యాక్యూమ్ క్లీనర్స్!

గేమింగ్ పీక్స్ చూపిస్తాయ్.. రూ.1.5 లక్షలలోపు బెస్ట్ లాప్‌టాప్స్ ఇవే భయ్యా!

సామ్‌సంగ్ 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్..ఆఫర్ ముగిసేలోపే కొనేయండి

ఫిట్‌నెస్ లవర్స్‌కు పండగే.. మతిపోగొట్టే ఫీచర్లతో Motorola Watch Ultra గ్లోబల్ ఎంట్రీ!

వావ్ అనిపిస్తున్న మోటరోలా తొలి వైడ్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ ఫీచర్లకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×