Washing Machine Under 10000: రూ. 10వేల లోపు మంచి వాషింగ్ మెషీన్ కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్‌లో వివిధ రకాల మోడల్స్ ప్రస్తుతం డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే 10 వేల లోపే కొన్ని కంఫాక్ట్ ఫుల్లి ఆటోమేటిక్ మెడల్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇంతకీ మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్, ఫీచర్లు, పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 10 వేల లోపే బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు:
తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషీన్లు కొనడం ప్రస్తుతం చాలా ఈజీ. ఎందుకంటే Samsung, Croma, Voltas Beko, Whirlpool, Candy వంటి వివిధ రకాల బ్రాండ్స్ 10 వేల రేంజ్ లనే మంచి ఆప్షన్లు అందిస్తున్నాయి.
1. Whirlpool 6.5kg Magic Clean Semi-Automatic (రూ. 9,290):
ప్రస్తతం ఈ మోడల్‌లో 1400 RPM మోటార్ ఉండటం వల్ల బట్టలు త్వరగా ఆరిపోతాయి. దీనిలోని Magic Clean scrubber వల్ల మొండి మరకలు, మచ్చలు కూడా త్వరగా తొలగిపోతాయి. చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.
2. Samsung 6.5kg Semi-Automatic (Air Turbo)(రూ.9,990):
శామ్ సాంగ్ ఈ మోడల్‌లో ఎయిర్ టర్బో డైయింగ్ సిస్టమ్ ఉంది. ఇది బట్టలను వేగంగా ఆరబెట్టడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా దీనిలోని డ్యూయల్ స్ట్రోమ్ వల్ల చాలా తక్కువ టైంలోనే బట్టలు శుభ్రం అవుతాయి. అంతే కాకుండా కరెంట్ కూడా దీనికి తక్కువ ఖర్చు అవుతుంది.
3. Voltas Beko 6kg Semi-Automatic:
ఈ మోడల్ వాషింగ్ మెషీన్లలో అడ్వాన్స్డ్ వాష్ టెక్నాలజీ ఉంది కాబట్టి నెమ్మదిగా బట్టలను ఇది శుభ్రం చేయడంతో పాటు డ్యామేజ్ కాకుండా కూడా కాపాడుతుంది.
4. Croma 8kg Semi-Automatic:
ఈ మోడల్ పెద్ద కుటుంబాలకు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలో మూడు వాష్ మోడ్ లు ఉంటాయి. కాబట్టి అవసరానికి అనుగణంగా (gentle, normal, strong) మీరు ఉపయోగించుకోవచ్చు.
5. Candy 6.5kg Fully Automatic:
ఇది ఆటోమేటిక్ వాష్ ప్రోగ్రామ్ సహాయంతో పనిచేస్తుంది. కాబట్టి దీనికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అంతే కాకుండా ఇది తక్కువ కరెంట్ వాడుకుని త్వరగా బట్టలను శుభ్రం చేస్తుంది.
ఫుల్లీ ఆటోమెటిక్ :
వాడకం ఈజీ
టైం సేవింగ్ కూడా
సెమీ ఆటోమేటిక్:
తక్కువ ధరకు లభిస్తాయి.
నీరు తక్కువ అవసరం అవుతుంది.
మాన్యువల్ కంట్రోల్ ఉంటుంది.
కొనే ముందు గుర్తించుకోవాల్సినవి:
వాషింగ్ మెషీన్ కెపాసిటీ:
2-3 సభ్యులు-6-6.5 కేజీ
4-5 సభ్యులు- 7 నుంచి 8 కేజీ
Also Read: మిడిల్ క్లాస్ బడ్జెట్‌కి సరిపోయే.. బెస్ట్ వాషింగ్ మెషీన్లు, ఆఫర్ చూస్తే ఆగలేరు
మోటార్ స్పీడ్:
ఎక్కువ RPM ఉంటే బట్టల నుంచి త్వరగా నీరు లాగేస్తుంది.
క్వాలిటీ:
Rust-free body ఉన్న మెషీన్లు తీసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.
కరెంట్ ఖర్చు:
స్టార్ రేటింగ్ ఉన్నవి తీసుకోవడం మంచిది.
రూ.10 వేల లోపు వాషింగ్ మెషీన్ కొనాలంటే మాత్రం సెమీ ఆటోమేటిక్ మోడల్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ కన్వీనియన్స్ కావాలంటే Candy వంటి ఫుల్లీ ఆటోమేటిక్ మోడల్ తీసుకోవడం బెటర్. మీ అవసరాన్ని బట్టి సరైన మోడల్ ఎంచుకోవడం మంచిది.
గమనిక:
ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.