E-Paper
Advertisement

Watches For Women: కేవలం అందమే కాదు, క్వాలిటీలోనూ అదరగొట్టే 2025 టాప్ ఉమెన్ వాచెస్

Watches For Women: కేవలం అందమే కాదు, క్వాలిటీలోనూ అదరగొట్టే 2025 టాప్ ఉమెన్ వాచెస్
Advertisement

Advertisement

Watches For Women: ఒకప్పుడు మహిళల వాచీలంటే.. కేవలం మగవారి వాచీల సైజు తగ్గించి, కాస్త రంగు లేదా మెరుపులు అద్దితే సరిపోతుందని కంపెనీలు భావించేవి. కానీ ఆ రోజులు ఇప్పుడు మారిపోయాయి! నేటి మహిళలు కేవలం వాచీలు “అందంగా కనిపిస్తే చాలు” అనుకోవడం లేదు. స్టైల్‌తో పాటు దాని లోపల ఉండే మెకానిజం ఎంత పవర్‌ఫుల్‌గా ఉంది ? అది ఎంత నాణ్యమైనది? అనే విషయాలను కూడా గమనిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రముఖ వాచ్ బ్రాండ్లు సైతం మహిళల అభిరుచులకు తగ్గట్టుగా.. అత్యాధునిక టెక్నాలజీతో.. అదిరిపోయే డిజైన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. మీరు ఆఫీస్ వేర్ కోసం చూస్తున్నా, లేదా పార్టీలో స్పెషల్‌గా కనిపించాలనుకున్నా.. 2025లో ఎక్కువ మంది కొన్న 6 వాచీల వివరాలు మీకోసం..

1. టైమెక్స్ లెగసీ బాయ్‌ఫ్రెండ్ 36mm (Timex Legacy Boyfriend):

Advertisement

ఈ వాచీ పేరు కొంచెం వెరైటీగా ఉన్నప్పటికీ.. దీని డిజైన్ అత్యంత క్లాసిక్ గా ఉంటుంది. ధర సుమారు రూ.13 వేలు ఉంటుంది. తక్కువ ధరలో లభించే ఈ వాచీ, రోలెక్స్ వంటి లగ్జరీ వాచీ స్టైల్ గుర్తుకు తెస్తుంది. దీని ఫ్లూటెడ్ బెజెల్ , ఐదు లింకుల బ్రాస్లెట్ దీనికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. దీని 36mm పరిమాణం దాదాపు అందరి చేతికి సెట్ అవుతుంది.

2. ఒమేగా సీమాస్టర్ ఆక్వా టెర్రా 30mm (Omega Seamaster Aqua Terra):

లగ్జరీ, నాణ్యతను కోరుకునే మహిళలకు ఇది ఒక ‘బంగారం’ లాంటి అవకాశం. ఒమేగా ఈ చిన్న వాచీలో కూడా తన అత్యాధునిక ‘కో-యాక్సియల్ మాస్టర్ క్రోనోమీటర్’ కాలిబర్ 8750 మెకానిజంను అందించింది. ఇది కేవలం వాచీ మాత్రమే కాదు.. ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ముఖ్యంగా బ్లాక్ లాక్వెర్ డయల్ ఉన్న స్టీల్ మోడల్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

3. బులోవా గాడెస్ ఆఫ్ టైమ్ (Bulova Goddess Of Time Reissue):

1970ల నాటి వింటేజ్ డిజైన్‌ను ఇష్టపడే వారికి ఇది సరైన ఎంపిక. స్టోన్ డయల్, మెష్ బ్రాస్లెట్‌తో వచ్చే ఈ వాచీలు చాలా కలర్‌ఫుల్‌గా , ఫ్యాషన్‌గా ఉంటాయి. వింటేజ్ స్టైల్‌ను తిరిగి తీసుకురావడంలో బులోవా సక్సెస్ అయింది.

4. సీకో 5 స్పోర్ట్స్ SRPK33 (Seiko 5 Sports):

ఇది యూనిసెక్స్ (స్త్రీ, పురుషులు ఎవరైనా ధరించగలిగే) అప్పీల్ ఉన్న వాచీ. మెకానికల్ మూవ్‌మెంట్ కలిగి ఉండి.. రంగురంగుల డయల్స్‌తో లభించే ఈ వాచీ యువతను బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా దీనిలోని టీల్ కలర్ డయల్ మంచి కూల్ లుక్‌ను ఇస్తుంది.

5. కాసియో MTP1302D-2AVT (Casio):

తక్కువ బడ్జెట్‌లో (80 డాలర్ల లోపు) అత్యుత్తమ నాణ్యతను ఇచ్చే బ్రాండ్ కాసియో. ఇది రోజువారీ వాడకానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్లూటెడ్ బెజెల్, సింపుల్ డేట్ ఫంక్షనాలిటీతో ఇది చాలా ఖరీదైన వాచీలా కనిపిస్తుంది.

Also Read: చేతికి వాచీ బోర్ కొట్టిందా ? అయితే ఈ వాచ్ రింగ్‌పై ఒక కన్నేయండి

6. లాంగిన్స్ మినీ డోల్స్ వీటా (Longines Mini Dolce Vita):

ఆర్ట్ డెకో శైలిలో ఉండే ఈ వాచీ క్లాసిక్ ‘ట్యాంక్’ వాచీల విభాగంలో కింగ్ అని చెప్పవచ్చు. దీనికి ఉండే విభిన్నమైన లెదర్ స్ట్రాప్స్ ,మెటల్ బ్రాస్లెట్స్ ఏ రకమైన దుస్తులకైనా చక్కగా సెట్ అవుతాయి. ముఖ్యంగా ఆఫీస్ వేర్ లేదా ఫార్మల్ సందర్భాలకు ఇది ఒక రిచ్ లుక్‌ను ఇస్తుంది.

నేటి మహిళలు కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే కాకుండా.. తమ అభిరుచిని చాటుకోవడానికి వాచీలను ఎంచుకుంటున్నారు. వింటేజ్ మోడల్స్ నుంచి అత్యాధునిక మెకానికల్ వాచీల వరకు మార్కెట్‌లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. కేవలం బ్రాండ్ పేరు చూసి కాకుండా, మీ వ్యక్తిత్వానికి ఏది సరిపోతుందో చూసి ఎంచుకోవడం ఉత్తమం.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×