E-Paper
Advertisement

Most Searched Actors: 2025 మోస్ట్ సెర్చెడ్ హీరోగా టాలీవుడ్ స్టార్.. అస్సలు తగ్గట్లేదుగా?

Most Searched Actors: 2025 మోస్ట్ సెర్చెడ్ హీరోగా టాలీవుడ్ స్టార్.. అస్సలు తగ్గట్లేదుగా?
Advertisement

Most Searched Actors: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలా పాన్ ఇండియా హీరోలుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వారిలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలు మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోలందరూ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరొక ఐదు రోజులలో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పబోతున్న నేపథ్యంలో ఈ ఏడాదిలో అత్యంత ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేసిన హీరోల జాబితా వెలువడింది.

మోస్ట్ సెర్చెడ్  హీరోగా అల్లు అర్జున్..

ఈ జాబితా ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సరంలో ఎక్కువగా గూగుల్ సర్చ్ చేసిన హీరోల జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మొదటి స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ 2024 డిసెంబర్ 4వ తేదీ పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అల్లు అర్జున్ కోసం గూగుల్ సెర్చ్ ఎక్కువగా చేసినట్టు తెలుస్తోంది.

ఐదో స్థానంలో ఎన్టీఆర్..

Advertisement

ఇలా అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ప్రభాస్ మూడో స్థానంలో మహేష్ బాబు నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్ చివరిగా ఐదో స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. అల్లు అర్జున్ కేవలం గూగుల్ సెర్చ్ లో మాత్రమే కాకుండా డిజిటల్  ప్రపంచంలో కూడా తన ఆధిపత్యాన్ని చాటుతూ మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఇలా ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన హీరోలలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్న నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక అల్లు అర్జున్ కెరియర్ విషయానికి వస్తే ఈయన పుష్ప 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ త్వరలోనే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. రాజమౌళి వారణాసి తరహాలోనే గ్రాండ్ ఈవెంట్ ద్వారా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ వేడుక మార్చి నెలలో ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read; Director Teja: టికెట్ల రేట్ల కంటే పాప్ కార్న్ ధర ఎక్కువ: డైరెక్టర్ తేజ 

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×