E-Paper
Advertisement

BGMI Vehicle: పాపులర్ వీడియో గేమ్‌లో క్రేజీ ఫీచర్.. ఇక వాహనాలతోనూ దాడి చేయవచ్చు.. కొత్త అప్డేట్స్ ఇవే

BGMI Vehicle: పాపులర్ వీడియో గేమ్‌లో క్రేజీ ఫీచర్.. ఇక వాహనాలతోనూ దాడి చేయవచ్చు.. కొత్త అప్డేట్స్ ఇవే
Advertisement

BGMI Vehicle Combat| గేమింగ్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్. త్వరలోనే బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) వీడియో గేమ్‌లో పెద్ద గేమ్‌ప్లే అప్‌డేట్ వస్తుంది. ఈ అప్‌డేట్‌లో కొత్త వెహికల్ స్పెషలైజేషన్ ఫీచర్ వస్తుంది. ఈ ఫీచర్ వెహికల్‌లను స్ట్రాటజిక్ కాంబట్ టూల్స్‌గా మారుస్తుంది. ఇకపై వీడియో గేమ్‌లో వాహనాలు కేవలం ప్లేయర్స్ రాకపోకల కోసమే కాదు, కంబాట్ (దాడులు చేయడానికి), పొజిషనింగ్ టాక్టిక్స్‌కు కూడా ఉపయోగపడతాయి. దీని కోసం డెవలపర్స్ ప్రత్యేకంగా కొత్త డ్రైవింగ్ మోడ్ జోడించ లేదు. బదులుగా వెహికల్ పెర్ఫామెన్స్‌ మెరుగుపరిచే ప్యాసివ్ బఫ్‌లు వస్తాయి. ఇవి మిడ్-గేమ్ బ్యాటిల్స్ పేస్‌ను మార్చవచ్చు.

ప్యాసివ్ బఫ్‌లతో మరింత మెరుగైన పెర్ఫామెన్స్

వెహికల్ స్పెషలైజేషన్ సిస్టమ్ ప్యాసివ్ పవర్ అప్‌గ్రేడ్‌లు ఇస్తుంది. ఇందులో ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గడం ఉంటుంది. వెహికల్‌ల డ్యూరబిలిటీ మెరుగవుతుంది. కొన్ని వెహికల్‌లకు నైట్రో బూస్ట్ ఫీచర్ వస్తుంది. క్రాఫ్టాన్ ప్రకారం ఈ మార్పులు స్క్వాడ్ మొబిలిటీని మెరుగుపరుస్తాయి. టీమ్‌లు మ్యాప్‌లో త్వరగా రొటేట్ చేయవచ్చు. ఓపెన్ ఏరియాల్లో ప్లేయర్లు ఎక్కువ కాలం సర్వైవ్ చేయవచ్చు. వెహికల్‌లు అటాక్, డిఫెన్స్ స్ట్రాటజీలకు ఉపయోగపడతాయి. స్క్వాడ్‌లు ఎంగేజ్‌మెంట్ ప్లాన్ చేసే విధానం మారవచ్చు.

స్ట్రాటజిక్ గేమ్‌ప్లే మీద ఫోకస్

Advertisement

ఈ అప్‌డేట్ ఫాస్టర్ గేమ్‌ప్లే లూప్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ సాయంతో గేమ్ సమయంలో వాహనాలను చాకచక్యంగా స్ట్రాటజిక్ అసెట్‌లుగా చూసే టీమ్‌లు అడ్వాంటేజ్ పొందతాయి. ప్లేయర్లు వాహనాలను ఎలా ఉపయోగించాలో ముందుగానే ఆలోచించాలి. దీనికోసం డ్రైవర్ రోల్ మరింత ముఖ్యమవుతుంది. సరైన సమయంలో నైట్రో ఉపయోగించడం ద్వారా మ్యాచ్ ఫలితాలే మార్చేయవచ్చు. స్మార్ట్ పొజిషనింగ్ నిర్ణయాలు సర్వైవల్ చాన్స్‌లను నిర్ణయిస్తాయి. రిస్క్-రివార్డ్ బ్యాలెన్స్ చేయాలి. అగ్రెసివ్ టీమ్‌లు బూస్టెడ్ వాహనాలతో శత్రువులపై పైచేయి సాధించవచ్చు. డిఫెన్సివ్ స్క్వాడ్‌లు కూడా తమ పొజిషన్‌లను బలంగా హోల్డ్ చేయవచ్చు.

ఇన్-మ్యాచ్ కస్టమైజేషన్ ఫీచర్

కొన్ని వాహనాలలో కస్టమైజ్ బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ మ్యాచ్‌లో అప్‌గ్రేడ్ ఇంటర్‌ఫేస్ తెరుస్తుంది. ప్లేయర్లు మ్యాచ్ సమయంలో థీమ్డ్ అప్‌గ్రేడ్‌లు యాక్టివేట్ చేయవచ్చు. ఇవి పర్మనెంట్ మార్పులు కావు. క్లిష్టమైన పరిస్థితుల్లో టెంపరరీ బూస్ట్‌లు ఇస్తాయి. మ్యాచ్ కండిషన్‌ల ఆధారంగా అప్‌గ్రేడ్‌లు ఎంచుకోవాలి. ఇలా చేస్తే వాహన ఉపయోగంతో టాక్టికల్‌గా నిర్ణయాలు తీసుకునేందుకు సాయపడుతుంది.

Advertisement

Also Read: మీ ప్రైవేట్ ఫొటో, వీడియో లీక్ చేస్తామని ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ఇలా చేయండి

అడ్వాన్స్ గేమింగ్ అభివృద్ధిలో కీలక అడుగు

వెహికల్ స్పెషలైజేషన్ సిస్టమ్ అప్‌డేట్ క్లాస్ మెకానిక్స్‌లో ముఖ్యమైన మార్పు. వాహన గేమ్‌ప్లే స్ట్రాటజీలను ప్రమోట్ చేస్తుంది. బ్యాటిల్ రాయల్ లాంటి ఎక్స్‌పీరియన్స్ లాగానే ఉంటుంది. కానీ రిస్క్-రివార్డ్ ఎలిమెంట్ బలంగా ఉంటుంది. వాహనాలు ఉపయోగిస్తూ బ్యాటిల్స్ చేస్తుంటే అవి మరింత తీవ్రంగా, అర్థవంతంగా మారతాయి. వెహికల్ స్పెషలైజేషన్ మాస్టర్ చేసిన ప్లేయర్లు మ్యాచ్‌లలో డామినేట్ చేయవచ్చు. టీమ్ స్ట్రాటజీ గేమింగ్ విధానంలో పెద్ద మార్పు రావచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×