E-Paper
Advertisement

Vanchana OTT : ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తరం కోర్టు డ్రామా… ఈ తెలుగు మూవీని ఎక్కడ చూడచ్చో తెలుసా

Vanchana OTT : ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తరం కోర్టు డ్రామా… ఈ తెలుగు మూవీని ఎక్కడ చూడచ్చో తెలుసా
Advertisement

Vanchana OTT  : తక్కువ బడ్జెట్ తో నిర్మించిన తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా ‘వంచన’. ఇందులో అందరూ కొత్త నటులే ఉండటం, సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అసలు ఇది థియేటర్లలో విడుదలైందని కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమా 2024 నవంబర్ 8న థియేటర్లలోకి వచ్చింది. అరకు వ్యాలీలోని ఒక చర్చి ఫాదర్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పుడు దాదాపు సంవత్సరం తరువాత ఓటీటీలోకి వస్తోంది ఈ సినిమా. ఎట్టకేలకు దీని డిజిటల్ హక్కులను నామమాత్రపు ధరకే విక్రయించినట్లు తెలుస్తోంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

‘వంచన’ (Vanchana) ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా. 2024 నవంబర్ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కు ఉమా మహేష్ మార్పు దర్శకత్వం వహించారు. అతనే ప్రధాన పాత్రలో కూడా నటించారు. సోనీ రెడ్డి, సూర్య కుమార్ భగవందాస్, ఆర్కే నాయుడు ముఖ్య పాత్రల్లో నటించారు.1 గంట 57 నిమిషాలు ఈ చిత్రం డిజిటల్ హక్కులను Sun NXT సొంతం చేసుకుంది. 2026 మార్చి 3 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన శ్రీ చిదంబరం గారు , రోషన్ కనకాల మోగ్లీ విషయంలో కూడా అదే జరిగింది. ఇవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా గుర్తింపు పొందలేదు కానీ ఓటీటీలో మంచి వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ ‘వంచన’ సినిమా విషయంలో ఇలా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అరకు వ్యాలీలోని ఒక చర్చిలో ఫాదర్ ఆండ్రూ జోసెఫ్ దారుణంగా హత్యకు గురవుతాడు. పోలీసులు ఆ ఫాదర్ దగ్గరే డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని నిందితుడిగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. కానీ కృష్ణ (ఉమా మహేష్) అనే ఒక కుర్ర లాయర్‌కి మాత్రం ఈ కేసులో ఏదో తేడా ఉందనిపిస్తుంది. ఆ డ్రైవర్ అమాయకుడని నమ్మిన కృష్ణ, అసలు నిజం తెలుసుకోవాలని సొంతంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో కృష్ణకు ఊహించని నిజాలు తెలుస్తాయి. పైకి ప్రశాంతంగా కనిపించే ఆ ఫాదర్ జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలు, పర్సనల్ గొడవలు ఉన్నాయని బయటపడతాయి. ఆ మర్డర్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఆ డ్రైవర్‌ను లాయర్ ఎలా కాపాడాడు? కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో గెలిచింది ఎవరు? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ కథ సాగుతుంది.

Read Also : Laalo on OTT : 100 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన గుజరాతీ సినిమా ఓటీటీలోకి… ఐయండిబిలో 8.6 రేటింగ్

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×