E-Paper
Advertisement

Black Friday Sale 2025: ఐఫోన్ లవర్స్‌కి బంపరాఫర్.. బ్లాక్ ఫ్రైడే సేల్లో యాపిల్ ఫోన్లపై ఆఫర్ల వరద!

Black Friday Sale 2025: ఐఫోన్ లవర్స్‌కి బంపరాఫర్.. బ్లాక్ ఫ్రైడే సేల్లో యాపిల్ ఫోన్లపై ఆఫర్ల వరద!
Advertisement

Black Friday Sale 2025: ఐఫోన్ ప్రియులకు పండగ లాంటి వార్త. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా.. క్రోమా& విజయ్ సేల్స్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17, ఐఫోన్ 16, ఐఫోన్ ఎయిర్‌పై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ కొనాలనుకుంటున్న వాళ్లకి ఇదొక బంపరాఫర్‌గా చెప్పవచ్చు. ఇకపోతే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు కూడా యాపిల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్:

విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ.1,49,900 ధరకు లిస్ట్ చేయబడింది. దీనిపై ఎలాంటి ప్రత్యక్ష ధర తగ్గింపు లేదు. అయితే, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు EMI ద్వారా రూ.10వేల వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనాలనుకుంటున్న వాళ్లకి ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే క్రోమా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై వివిధ బ్యాంకు కార్డుల ద్వారా రూ.4వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మీద ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 17:

Advertisement

రూ.82,900 ప్రారంభ ధరతో విడుదలైన ఐఫోన్ 17పై.. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో బ్యాంక్ కార్డుల ద్వారా రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. మరోవైపు క్రోమా డీల్ ప్రకారం, ఐఫోన్ 17 రీటైల్ ధర రూ.82,900. ఇందులో రూ.1,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ.7,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందొచ్చు. అలాగే పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.29,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని ఆఫర్లు కలిపితే, ఫైనల్ ధర రూ.45,900 మాత్రమే.

ఐఫోన్ 16:

రూ.80,000 ప్రారంభ ధరతో ఐఫోన్ 16ను గతేడాది మార్కెట్‌లోకి తీసుకొచ్చింది యాపిల్ సంస్థ. అయితే ఈ ఏడాది కొత్త ఐఫోన్ 17 లాంచ్‌తో, కంపెనీ పాత మోడల్ ధరను దాదాపు రూ.10 వేలు తగ్గించింది. ఇప్పుడు, బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా.. ఈ ఫోన్‌పై మరింత తగ్గింపు లభిస్తోంది. మరోవైపు ఈ ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ.66,900 ధరకే అందుబాటులో ఉంది. అంతేకాదు.. ఈ ఫోన్‌పై SBI క్రెడిట్ కార్డ్ EMI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ.4వేల వరకు తగ్గింపు పొందవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ నాన్-EMI ఎంపికతో రూ.3వేల వరకు తక్షణ తగ్గింపును లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ ధర కేవలం రూ.62,900 మాత్రమే

ఐఫోన్ ఎయిర్:

Advertisement

ఐఫోన్ ఎయిర్ 256 జీబీ వేరియంట్ అసలు ధర రూ.1,19,900. క్రోమా & విజయ్ సేల్స్‌లో ఇప్పుడీ ఐఫోన్ ఎయిర్‌ను రూ.1,12,900 ధరకే సొంతం చేసుకోవచ్చు. కొన్ని బ్యాంక్ కార్డ్‌లపై రూ.4వేలు తక్షణ తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌పై రూ.7వేల తగ్గింపు, అలాగే బ్యాంక్ డిస్కౌంట్‌తో కూడిన రూ.4వేల తగ్గింపు కలిపి మొత్తం రూ.11వేలు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ల తర్వాత ఐఫోన్ ఎయిర్‌ను రూ.1,08,900 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×