E-Paper
Advertisement

Telangana Govt: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. 148.11 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌గా ప్రకటన

Telangana Govt: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. 148.11 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌గా ప్రకటన
Advertisement

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం అటవీ సంరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లాలో 148.11 ఎకరాల విస్తీర్ణాన్ని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌గా ప్రకటించింది. కాలేశ్వరం సర్కిల్, మంచిర్యాల రేంజ్ పరిధిలో ఈ అటవీ బ్లాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అడవుల ముఖ్య సంరక్షణాధికారి (ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్) సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రిజర్వ్ బ్లాక్ ఏర్పాటు ఉద్దేశం.. అటవీ భూములను పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యత కాపాడటం.

ఈ రిజర్వ్ ఫారెస్ట్ మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని పలు సర్వే నంబర్లలో విస్తరించి ఉంది. సర్వే నంబర్లు 178, 397, 193, 819 పరిధిలో ఈ అడవిని రిజర్వ్ చేస్తున్నారు. మొత్తం 148.11 ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో అడవి బ్లాక్‌గా తీర్చిదిద్దనున్నారు. దీనికి అదనంగా.. మంచిర్యాల జిల్లా పెగడపల్లీ గ్రామంలో కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్లాక్ సుమారు 60 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు.. అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఈ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కార్యక్రమం దోహదపడుతుంది.

Advertisement

ఈ నోటిఫికేషన్‌ను డిసెంబర్ 4వ తేదీన ప్రత్యేక గెజిట్‌లో ప్రచురించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రింటింగ్ విభాగం ఈ గెజిట్ నోటిఫికేషన్ 200 కాపీలను ఫారెస్ట్ శాఖకు తక్షణమే సరఫరా చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మొత్తం ప్రక్రియ సజావుగా జరిగేందుకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ముఖ్యపాత్ర వహిస్తారు. కలెక్టర్ గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురించి.. తదుపరి చర్యలు వేగంగా తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటవీ సంరక్షణ ప్రయత్నాలలో మహత్తర ఘట్టంగా నిలుస్తుంది. ఇది రాష్ట్రంలో పచ్చదనం పెంచే లక్ష్యానికి బలం చేకూరుస్తుంది. అటవీ భూములు ఇతర అవసరాలకు మళ్ళించకుండా శాశ్వతంగా కాపాడటానికి ఈ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ ప్రకటన ఎంతో ఉపయోగపడుతుంది. స్థానికంగా అటవీ శాఖ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించి, బ్లాక్ ఏర్పాటు పనులు త్వరగా ప్రారంభించాలి.

Advertisement

ALSO READ: Passenger Train: బ్రిడ్జి మీది నుంచి పట్టాల మీద పడిపోయిన ట్రక్, రైళ్ల రాకపోకలు బంద్!

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×