Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే ప్రతి సంవత్సరం టెక్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూసే అతిపెద్ద డిస్కౌంట్ పండుగగా మారిపోయింది. ముఖ్యంగా ఆపిల్ డివైస్‌లపై వచ్చే తగ్గింపులు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తాయి. 2025 బ్లాక్ ఫ్రైడే మాత్రం గత ఏళ్లన్నింటినీ మించి రికార్డ్ స్థాయి ధర తగ్గింపులతో సంచలనాన్ని సృష్టిస్తోంది. సాధారణంగా ఆపిల్ తన ప్రొడక్ట్స్ ధరలను తగ్గించడంలో చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఈసారి అమెజాన్, బెస్ట్ బై, వాల్‌మార్ట్ వంటి ప్రముఖ రిటైలర్లు సంప్రదాయాన్ని పక్కన పెట్టి భారీ తగ్గింపులతో వినియోగదారులను ఆశ్చర్యపరిచారు. అమెరికా మార్కెట్‌లో కనిపిస్తున్న డీల్స్ చూసి అనేక మంది నమ్మలేకపోతున్నారు. భారతదేశ ధరలతో పోల్చుకుంటే తేడా ఎంత ఉందో చూస్తే ఈ ఆఫర్లు ఎందుకు గోల్డెన్ ఛాన్స్ అనిపిస్తాయో అర్థమవుతుంది.
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4. రూ.33,000 వరకు సేవింగ్
ప్రస్తుతం అత్యధికంగా చర్చనీయాంశంగా నిలుస్తున్న ఆఫర్ ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4. సాధారణంగా అమెరికాలో దీని ధర $820. కానీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ కారణంగా ఇప్పుడు అమెజాన్‌లో కేవలం $750కి లభిస్తోంది. అంటే భారత కరెన్సీలో మార్చుకుంటే సుమారు రూ66,900 మాత్రమే. ఇదే మోడల్ భారత ఆపిల్ స్టోర్‌లో లేదా ఆన్‌లైన్ మార్కెట్లో సుమారు రూ.99,900 వరకు ఉంటుంది. అంటే దాదాపు రూ.33,000 వరకు సేవింగ్. అల్ట్రా-స్లిమ్ డిజైన్, శార్ప్ 12ఎంపి వెబ్‌క్యామ్, కోడింగ్ నుండి 4కె వీడియో ఎడిటింగ్ వరకు సాఫీగా హ్యాండిల్ చేసే పర్‌ఫార్మెన్స్, మాగ్‌సేఫ్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఇది ఇప్పటికే విపరీతంగా డిమాండ్‌లో ఉన్న ల్యాప్‌టాప్. ఇప్పుడు ధర తగ్గడంతో విద్యార్థులు, ఆఫీస్ వర్కర్లు, క్రియేటర్లు అందరూ అమెరికా డీల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆపిల్ ఐప్యాడ్ .. సుమారు రూ.10వేలు తగ్గింపు
ఐప్యాడ్ విభాగం కూడా బ్లాక్ ఫ్రైడేలో అత్యధిక అమ్మకాలకెక్కినది. ఆపిల్ యొక్క తాజా 11th జెన్ ఐప్యాడ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్, వాల్‌మార్ట్‌ల్లో $275కి అందుబాటులో ఉంది. అంటే భారత రూపాయల్లో సుమారు రూ.24,550. అదే మోడల్ ఇండియాలో కనీసం రూ.34,900 వరకు ఉంటుంది. అంటే రూ.10,000 పైగా తేడా. చదువులు, ఆన్‌లైన్ క్లాసులు, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ అవసరాలు అన్నింటికీ సరిపోయే ఆల్ రౌండర్ టాబ్లెట్ కావడంతో దీనిపై భారీ డిమాండ్ ఏర్పడింది.
ఐప్యాడ్ ప్రో ఎం5 పై దాదాపు రూ.44,500 తేడా
పవర్ యూజర్ల కోసం ఐప్యాడ్ ప్రో ఎం5 మరింత ఆకర్షణీయంగా మారింది. 11ఇంచ్ 256జిబి వేరియంట్ అమెరికాలో ఇప్పుడు $900కి విక్రయించబడుతోంది. అంటే భారత కరెన్సీలో రూ.80,400. కానీ ఇదే మోడల్ ఇండియాలో సుమారు రూ.1,24,900 వరకు ఉంది. అంటే దాదాపు రూ.44,500 తేడా. ఓఎల్‌ఈడి డిస్‌ప్లే, ఆపిల్ పెన్సిల్ ప్రో సపోర్ట్, ఐప్యాడ్‌ఓఎస్ 26 మల్టీటాస్కింగ్ సామర్థ్యం, డిజైనర్లు, ఆర్టిస్టుల కోసం అద్భుత ఫ్లో అనుభవం ఇవన్నీ కలిపి దీన్ని పవర్‌ఫుల్ క్రియేటివ్ డివైస్‌గా నిలబెడుతున్నాయి. అయితే పూర్తిస్థాయి ల్యాప్‌టాప్ పనులను భర్తీ చేయడంలో ఇది ఇంకా కాస్త పరిమితంగా ఉంటుందని తెలుస్తుంది.
Also Read: Amazon Offer on Smart TV: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.లక్షా70వేల టీవీ కేవలం రూ.64వేలు మాత్రమే..!
ఆపిల్ వాచ్ ఎస్ఈ 3rd జెన్.. రూ.12,000 పైగా తగ్గింపు
వియర్‌బుల్ సెగ్మెంట్‌లో ఈసారి అతి పెద్ద షాక్ ఆపిల్ వాచ్ ఎస్ఈ 3rd జెన్. ప్రస్తుతం అమెరికాలో ధర $200, అంటే భారత రూపాయల్లో రూ.17,860. కానీ ఇది ఇండియాలో రూ.29,900కి అమ్ముడవుతోంది. అంటే రూ.12,000 పైగా తేడా. ఎప్పటికప్పుడు డిస్‌ప్లే, తాజా ఎస్10 చిప్, హెల్త్ అలాగే సేఫ్టీ ట్రాకింగ్ ఫీచర్లతో ఇది బడ్జెట్ రేంజ్‌లో అత్యుత్తమ విలువైన వాచ్‌గా నిలిచింది.
ఆపిల్ వాచ్ సిరీస్ 11 బ్లాక్ ఫ్రైడేలో రూ.19,500 వరకు సేవింగ్
ఇంకా ప్రీమియం అనుభవం కోరుకునే వారికి ఆపిల్ వాచ్ సిరీస్ 11 బ్లాక్ ఫ్రైడేలో భారీ ఆకర్షణ అయ్యింది. అమెరికాలో $340 అంటే సుమారు రూ.30,360. కానీ ఇండియాలో దీని ధర రూ.49,900 వరకు ఉంది. అంటే రూ.19,500 వరకు సేవింగ్. హైపర్‌టెన్షన్ మానిటరింగ్ వంటి ఎఫ్‌డిఏ-సర్టిఫైడ్ ఫీచర్లు, 36 గంటల బ్యాటరీ లైఫ్, పెద్ద డిస్‌ప్లే ఇవన్నీ కలిపి ఇది హై-ఎండ్ వినియోగదారుల కోసం బెస్ట్ ఎంపికగా మారింది.
ఎయిర్‌పాడ్స్ మాక్స్ రూ.40,000 వరకు తగ్గింపు
ఆపిల్ ఆడియో డివైస్‌లలో అత్యధిక డిమాండ్ ఉన్న ఎయిర్‌పాడ్స్ మాక్స్ ఈసారి రికార్డు స్థాయి తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. వాల్మార్ట్
లో $220 అంటే సుమారు రూ.19,650, అమెజాన్‌లో $400. కానీ ఇండియాలో దీని ధర రూ.59,900 వరకు ఉంది. అంటే రూ.40,000 వరకు తేడా. ప్రీమియం నాయిస్ క్యాన్సిలేషన్, అద్భుత ఆడియో అనుభవం, కంఫర్ట్ ఫిట్ ఇవన్నీ దీన్ని సంగీత ప్రేమికులకు అత్యంత మంచి ఎంపిక చేస్తాయి.
ఎయిర్‌ట్యాగ్స్ దాదాపు రూ.4,000 సేవింగ్
ఫోన్స్, బ్యాగులు, కీస్, వాలెట్ వంటి వస్తువులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడే ఎయిర్‌ట్యాగ్స్ నాలుగు ప్యాక్ ఈసారి కేవలం $65 అంటే సుమారు రూ.5,805. ఇదే ప్యాక్ ఇండియాలో రూ.9,900. అంటే దాదాపు రూ.4,000 సేవింగ్. వాలెట్, బ్యాగ్, కారు కీలు లేదా ఫోన్ వంటి వస్తువులను ట్రాక్ చేయాలనుకునే వారికి ఇది అత్యంత అవసరమైన ఉపకరణం.
అమెరికా- భారత ధరలతో పోల్చితే.. 30శాతం నుంచి 50శాతం
ఇన్ని పోలికలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది, అమెరికా బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు భారత మార్కెట్ ధరలతో పోల్చితే 30శాతం నుంచి 50శాతం వరకు తక్కువగా లభిస్తున్నాయి. అందుకే టెక్ ప్రేమికులు దీనిని జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం అంటూ చూస్తున్నారు. ఆపిల్ ప్రొడక్ట్స్ ఎప్పుడూ ఖరీదే అన్న భావనను ఈ బ్లాక్ ఫ్రైడే పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే ఈసారి నిజంగానే ప్రీమియం టెక్నాలజీ తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్లు ఎక్కువ కాలం ఉండవు. కనుక ఆపిల్ డివైస్ కొనడం చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నవారు ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. బ్లాక్ ఫ్రైడే డీల్స్ 2025 డీల్స్ సంవత్సరంలో ఒకసారి వచ్చే అరుదైన వేడుక.