E-Paper
Advertisement

Pawan kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కీలక నిర్ణయం.. తెరపైకి కొత్త వ్యక్తి ఎవరంటే!

Pawan kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కీలక నిర్ణయం.. తెరపైకి కొత్త వ్యక్తి ఎవరంటే!
Advertisement

Pawan kalyan: జనసేనలో కీలక పరిణామాలు జరగబోతున్నట్టు సమచారం. ఇప్పటివరకు పార్టీ రాజకీయ వ్యవహారాలు చూసుకున్న ఆ నేతను పక్కనపెట్టి.. కొత్త వ్యక్తిని తెర మీదకి తీసుకొస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలపై అసలు పవన్ టార్గెట్ ఏంటి? పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేయాలని పవన్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాలు చూసుకోబోతున్న ఆ నేత ఎవరు? పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ గా మారిన పవన్ నిర్ణయం జనసేన పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది?

సార్వత్రిక ఎన్నికల్లో హండ్రెడ్‌ పర్సెంట్ స్ట్రైక్‌ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందింది జనసేన పార్టీ. అయితే ఎన్నికల తర్వాత పార్టీని నడిపించడంలో ఎందుకో తడబడుతుందని అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపించాయి. ఎన్నికల ముందు వరకు పార్టీని, పార్టీ కార్యక్రమాలను, నాయకులను, కార్యకర్తలను ఇలా అందరిని తానే ముందుండి నడిపించారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్. ఇప్పుడు వారిద్దరు మంత్రులు అవ్వడంతో పార్టీ కొంత గాడి తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ నేతలతో సమావేశాలు పెట్టుకుని, పార్టీ బలోపేతం మీద చర్చించిన నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పార్టీ నాయకులను, కార్యకర్తలను కలవడం లేదనే విమర్శలు వచ్చాయట. అంతేకాదు పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

దీంతో పార్టీ బలోపేతానికి, పార్టీని గాడిలో పెట్టడానికి కొత్త వ్యక్తులకు పవన్ రంగంలోని దింపబోతున్నారనే చర్చ పార్టీ నేతలమధ్య నడుస్తుందట. రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ వ్యవహారాల బాధ్యతలు ఆ కొత్త వ్యక్తికి అప్పగించబోతున్నారనే చర్చకు అవుననే సమాధానం పార్టీ నేతల నుంచి వినపడుతుందట. పవన్ కళ్యాణ్ సన్నిహితుడుగా ఎన్నో సంవత్సరాల నుండి ఆయనతో ప్రయాణిస్తున్న నిర్మాత రామ్ తాళ్లూరికి పవన్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న రామ్ తాళ్లూరి… ఇకపై జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయ వ్యవహారాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.

అసలు ఇంతకీ ఎవరి ఈ రామ్ తాళ్లూరి? ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు నిర్మించారు. చుట్టాలబ్బాయి, దండుపాళ్యం-3, రవితేజతో నేలటికెట్ అనే సినిమాలు నిర్మించారు. వ్యాపారావేత్తగా కూడా రాణించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ.. ఎలాంటి పదవుల్లో రామ్ తాళ్లూరి పని చేయలేదు. కేవలం బ్యాక్ ఎండ్‌లో ఉంటూ పవన్‌తో ట్రావెల్ చేశారు. తాజాగా గత నెల రెండున రామ్ తాళ్లూరిని రాష్ట్ర ప్రధాని కార్యదర్శిగా నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. గత నెల 16న ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు.

Advertisement

ప్రస్తుతం రామ్ తాళ్లూరి.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలోనే ఉంటూ పార్టీ వ్యవహారాలన్నీ చూస్తున్నారట. ఏపీతోపాటు తెలంగాణలో కూడా పార్టీ బాధ్యతలు అన్నీ రామ్ తాళ్లూరికి అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు జనసేన పార్టీలోని ప్రస్తుతం ఉన్న కమిటీలు రద్దు చేసి.. కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించుకున్నారట. దానిలో భాగంగా పార్టీ నేతలతో కీలక సమావేశం కూడా నిర్వహించారని తెలుస్తోంది. కొత్త కమిటీల ఏర్పాటు బాధ్యతలు కూడా రామ్‌ తాళ్లూరికి పవన్ అప్పగించినట్లు సమాచారం.. అందులో భాగంగా నేతలతో నియోజకవర్గ ఇన్చార్జిలతో రామ్ తాళ్లూరి వరుసగా భేటీ అవుతున్నారట.

ఏపీలో వచ్చే ఏడాది జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను జనసేనాని సీరియస్‌గా తీసుకున్నారనే టాక్ నడుస్తుంది. అందులో భాగంగా ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని నేతలకు పవన్ చెబుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను కూడా రామ్ తాళ్లూరికి అప్పగించారట. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసి, అక్కడ బలమైన అభ్యర్థులను నిలబెట్టేలా వ్యూహరచనలు చేస్తున్నారు. ఇక జనసేన పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలని రామ్ తాళ్లూరికి పవన్ సూచించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకార్యకర్తలకు, పార్టీకి మధ్య పెరిగిన గ్యాప్‌ని.. తగ్గించే బాధ్యతను కూడా అప్పగించినట్లు టాక్. వీటితో పాటుగా తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం చేయాలని పవన్ అనుకుంటున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటి బాధ్యతలు కూడా రామ్ తాళ్లూరికి అప్పగించినట్లు సమాచారం.

వాస్తవానికి 2018 నుంచి ఇప్పటివరకు.. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా నాదెండ్ల మనోహర్ చేతుల మీదగానే పార్టీ వ్యవహారాలన్నీ నడిచాయి. ఒకానొక సమయంలో పవన్ తర్వాత నాదెండ్ల మనోహర్ పవర్‌ఫుల్‌ అనే విధంగా పార్టీ నాయకుల్లో కార్యకర్తలు చర్చ జరిగింది. పార్టీలో పదవి రావాలన్న, ఇన్చార్జి బాధ్యతలు కావాలన్నా నాదెండ్ల మనోహర్ ఆమోదం తప్పనిసరి అనే మాటలు పార్టీ నేతలు నుంచి వినిపించాయి. అయితే ప్రస్తుతం నాదెండ్లను ఆ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ బాధ్యతలు రామ్ తాళ్లూరికి అప్పగించడం వెనుక పవన్ రాజకీయ వ్యూహం ఏంటనేది అర్థం కావడం లేదని చర్చ కూడా నడుస్తుందట. నాదెండ్ల మనోహర్ ఉన్న సమయంలో పార్టీలో మోనో పోలీ నడిచిందని, పార్టీలో ఏదైనా తన అనుమతితోనే జరగాలని విధంగా నాదెండ్ల మనోహర్ వ్యవహరించారని ఆరోపణలు కూడా కొంతమంది నేతలు చేశారనే టాక్ పార్టీ వర్గాల్లో ఉందట. అయితే దాని మీద ఇప్పటివరకు ఎప్పుడు పవన్ రియాక్ట్ కాలేదు.. అయితే ఇప్పుడు మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్.. పార్టీని వ్యవహారాలు సరిగా చూసుకోలేకపోతున్న కారణంగానే రామ్ తాళ్లూరిని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని మాట కూడా వినపడుతుంది.

Also Read: ఆల్ఫా మేల్ ఢమాల్! అమ్మాయిలూ.. బీ అలర్ట్!

ఇప్పటివరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూసుకుంటూ వస్తున్నారు. అయితే నాగబాబుకి పార్టీ వ్యవహారాల బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం కూడా ఆ మధ్య నడిచింది. కానీ ఇంటర్నల్‌గా ఏం జరిగిందో తెలియదు కానీ.. సడన్‌గా తెర మీదకి రామ్ తాళ్లూరి పేరు రావడం… ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడం జరిగిపోయాయి. మరి పవన్ రాజకీయ వ్యూహం ఈ విధంగా పనిచేస్తుందో చూడాలి.

Story By Vamshi Krishna, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×