E-Paper
Advertisement

women be Alert: ఆల్ఫా మేల్ ఢమాల్! అమ్మాయిలూ.. బీ అలర్ట్!

women be Alert: ఆల్ఫా మేల్ ఢమాల్! అమ్మాయిలూ.. బీ అలర్ట్!

women be Alert: ఇందుమూలముగా.. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలందరికీ తెలియజేయునది ఏమనగా.. మీ జీవితంలోకి రాబోయే మేల్ విషయంలో.. మీరంతా మేల్కొనాల్సిన టైమొచ్చింది. అయినా.. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ.. ఎంత మూల్యానికి? మీరు గనక ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే.. మీ జీవితంలో వంశం.. అనే అంశాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. సో.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలకే కాదు.. పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అబ్బాయిలు కూడా తప్పకుండా చూడాల్సిన స్టోరీ ఇది. తర్వాత.. మీ ఇష్టం!

అబ్బాయిల్లో మ్యాటరే.. పెద్ద మ్యాటర్!
అమ్మాయిలు.. మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అందంగానే ఉండొచ్చు. మంచి ఉద్యోగమే చేస్తుండొచ్చు. లక్షలు సంపాదిస్తుండొచ్చు. సిబిల్ స్కోర్ ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉండొచ్చు. ఆస్తులు, అంతస్తులు, మంచి వాస్తులున్న ఇళ్లు కూడా ఉండొచ్చు. వీటితో పాటు మీరు చూడాల్సింది మరొకటుంది. అదే.. ఇప్పుడు ఇంపార్టెంట్. మీరు చేసుకోబోయే అబ్బాయి.. పిల్లల్ని కనడానికి పనికొస్తాడా? లేదా? అనేది చూసుకోండి. సిబిల్ స్కోర్ల కంటే ముందు.. వారి స్పెర్మ్ కౌంట్ స్కోరెంతో తెలుసుకోండి. మీ లైఫ్ పార్ట్‌నర్‌తో.. లైఫ్ జాలీగా ఉండాలన్నా.. పిల్లల విషయంలో మీపై ఎవరూ జాలి చూపించకుండా ఉండొద్దన్నా.. స్పెర్మ్ కౌంట్ ఎంతుందో కచ్చితంగా తెలుసుకోవాలంటున్నారు డాక్టర్లు.

గతంలో మహిళల్లోనే ఎక్కువా ఫెర్టిలిటీ సమస్యలు
కొన్నేళ్ల కిందటి వరకు.. మహిళల్లోనే ఈ ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువగా కనిపించేవి. వాళ్ల కోసం ఇప్పటికే మార్కెట్‌లో.. ఎన్నో ఫెర్టిలిటీ సెంటర్లున్నాయ్. కానీ.. ఇప్పుడీ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్.. మొనగాళ్లమని చెప్పుకునే మగాళ్లలోనూ కనిపిస్తున్నాయ్. అందుకే.. మగాళ్ల కోసం ప్రత్యేకంగా ఆండ్రో క్లినిక్‌లు అందుబాటులోకి వస్తున్నాయ్. ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్‌లో మనుషుల జీవితాల్లో ఎన్నో మార్పులొస్తున్నాయ్. దశాబ్దాలు గడుస్తున్నకొద్దీ.. సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయ్. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లోనే ఉంటుందనే అపోహల్లో ఉంటారంతా! కానీ.. దీనికి పురుషులు కూడా అతీతులేమీ కాదు. డాక్టర్లు ఎప్పటినుంచో ఈ విషయం చెబుతున్నా.. జనం ఈ మధ్యకాలంలోనే నమ్మడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో వస్తున్న ఇన్‌ఫెర్టిలిటీ కేసుల్లో.. మహిళలతో పోలిస్తే 50 శాతానికి పైగా మగాళ్లలోనే సమస్యలు ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయ్. రోజులు గడిచేకొద్దీ.. సంతానలేమి సమస్యలు పెరుగుతూ పోతున్నాయ్.

ఏళ్లు గడుస్తున్న పిల్లలు లేక బాధపడే భార్యాభర్తలెందరో..
పెళ్లిళ్లయి.. ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేక బాధపడే భార్యాభర్తలెందరో.. మన చుట్టూ కనిపిస్తూనే ఉంటారు. పిల్లల కోసం ఎందరో దేవుళ్లకు మొక్కుతుంటారు. పూజలవీ చేస్తుంటారు. ఇంకా ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆఖరికి.. దంపతులిద్దరూ ఫెర్టిలిటీ సెంటర్లని ఆశ్రయించి ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. ఇలా.. చికిత్స తీసుకునేవారిలో ఆడవారితో పాటు మగవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. ఈ విషయంలో.. ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు మగాళ్లు మొహమాటపడుతుంటారు. అలాంటి వాళ్లు.. ఆండ్రాలజీ క్లినిక్స్‌కి, మేల్ ఫెర్టిలిటీ సెంటర్లకి వెళ్తున్నారు. ఇటీవలికాలంలో.. ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న దంపతుల్లో.. సగానికి పైగా మగవారే ఉంటున్నారని, ఈ సమస్యలకు అనేక కారణాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

తెలంగాణలో 15-20 శాతానికి పెరిగిన మేల్ ఇన్‌ఫెర్టిలిటీ కేసులు
ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలు కూడా మగవారిలో సంతానలేమి సమస్యలు అధికమవుతున్నాయ్. ఇటీవల మెన్స్ డే సందర్భంగా.. హైదరాబాద్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ ఓ సర్వే నిర్వహిస్తే.. షాకింగ్ విషయాలు బయటపడ్డాయ్. తెలంగాణలో.. మేల్ ఇన్‌ఫెర్టిలిటీ కేసులు 15 నుంచి 20 శాతం పెరిగనట్లు రిపోర్టులు చెబుతున్నాయ్. మొత్తం కేసుల్లో.. 30 నుంచి 50 శాతానికి పైగా పురుషులవే ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రస్తుత తరంలో.. ప్రపంచంలోని ప్రతి ఏడు జంటల్లో.. ఒక జంట సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. వీరిలో సగం మంది మగవారిలో.. వీర్యకణాల లోపమే కారణంగా కనిపిస్తోంది. వీర్యకణాలు తగినన్ని లేకపోవడం, కణాలు అసాధారణంగా కదలడం, ఇంకొందరిలో వీర్యమే లేకపోవడం సమస్యగా మారింది. జన్యులోపాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని తెలిసినప్పటికీ.. ఏ జన్యువులు కారణంగా నిలుస్తున్నాయో ఇప్పటికీ తేలలేదు. దీనిపై.. 2023లో సీసీఎంపీ సైంటిస్టులు.. మరో మూడు పరిశోధన సంస్థలతో కలిసి.. రీసెర్చ్ చేశారు. వీర్యకణాల లోపం ఉన్న వారి స్పెర్మ్ శాంపిల్స్‌ని, ఎలాంటి లోపం లేని వారి వీర్యం నమూనాలను.. అధునూతన సీక్వెన్సింగ్ ప్రాసెస్ ద్వారా పరిశీలించారు. ఈ క్రమంలో.. రెండు T.E.X 13B జన్యు మ్యుటేషన్లని గమించారు. మొదటి మ్యుటేషన్ సంతాలనం లేని వారి వీర్యంలో కొంత మేర కనిపించగా, రెండో మ్యుటేషన్ సంతానం ఉన్నవారి వీర్యంలో స్పష్టంగా కనిపించిందని.. శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

మగవారిలో జన్యు లోపం వల్ల సంతానలేమి సమస్యలు
మగవారిలో జన్యు లోపం వల్ల కూడా సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధనల్లో తేలింది. అయితే.. ఇది తండ్రి నుంచి తల్లి నుంచి మగ పిల్లలకు సంక్రమిస్తుందని తేలింది. తల్లి నుంచి T.E.X 13B జన్యువు అందకపోతే.. మగవారు సంతానలేమి సమస్యని ఎదుర్కొంటారు. వీటితో పాటు పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడం కూడా మగాళ్లలో ఇన్‌ఫెర్టిలిటీకీ దారితీస్తుందని.. ఆండ్రాలజిస్ట్‌లు చెబుతున్నారు. 30 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడం, అధిక బరువు, బిగుతు బట్టులు ధరించడం, ధూమపానం, మద్యపానం, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి కారణాలు కూడా సంతానలేమికి కారణమంటున్నారు. లైఫ్‌స్టైల్‌లో వస్తున్న మార్పులు, జంక్ ఫుడ్, ఫ్రోజెన్ ఫుడ్ తీసుకోవడం, నిద్రలేమి లాంటివి కూడా ఫెర్టిలిటీపై ఇంపాక్ట్ చూపుతున్నాయ్. ముఖ్యంగా.. మగాళ్లలో ఎరిక్టైల్ డిస్‌ఫంక్షన్, లో స్పెర్మ్ కౌంట్, నో స్పెర్మ్ కౌంట్ లాంటి అనేక సమస్యలు.. ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్ల.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. ఇప్పుడే జాగ్రత్తపడితే మంచిదని, ఎందుకైనా మంచిది ఓసారి చెక్ చేసుకోండి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటిదేదో జరుగుతుందనే.. కుటుంబసభ్యులు, బంధువులంతా పదే పదే పెళ్లెప్పుడు.. పెళ్లెప్పుడు అని అడుగుతుంటారు. ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరకపోతే.. తర్వాత మీ ముచ్చటే.. అందరి నోళ్లలోనూ నానే అవకాశం ఉంటుంది. అసలు.. మగాళ్లలో సంతానలేమి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయ్? సరైన వయసులో పెళ్లి చేసుకోకపోతే.. ఇన్‌ఫెర్టిలిటీ ఇబ్బందులు తప్పవా? జెన్ జీ అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడు తెలుసుకోవాల్సిందేమిటి?

పురుషుల్లో పెరుగుతున్న సంతానలేమి సమస్యలు
అబ్బాయిలు, అమ్మాయిల్లో.. పెళ్లి చేసుకోవాలనే కోరిక ఎంతుంటుందో.. పిల్లల్ని కనాలనే ఆశ కూడా అంతే ఉంటుంది. కానీ.. ఈ మధ్యకాలంలో సంతానలేమి సమస్యలు కేవలం మహిళల్లోనే కాదు, పురుషుల్లోనూ పెరుగుతున్నాయ్. అందువల్ల.. పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే అమ్మాయిలు.. కాబోయే భర్తలకు స్పెర్మ్ కౌంట్ టెస్ట్ చేయించడం బెటరనే టాక్ మొదలైంది. కొన్నేళ్ల కిందట.. హెచ్ఐవీ టెస్టులు చేసేవారు. ఇప్పుడు జనరేషన్ మారింది. అందుకే.. స్పెర్మ్ సంబంధింత టెస్టులు చేయించాలనే చర్చ మొదలైంది. పురుషుల్లో సంతానలేమికి వయసు ప్రభావం, జీవనశైలి లాంటి ఎన్నో కారణాలున్నాయ్. సంతానలేమి సమస్యలకు 30 నుంచి 40 శాతం వరకు పురుషులే కారణమవుతున్నారని అనేక రీసెర్చ్‌లు చెబుతున్నాయ్. ఇందుకు అనేక రీజన్స్ ఉన్నాయ్. పురుషుల్లో సంతానలేమికి ప్రధాన కారణం.. శుక్రకణాల ఉత్పత్తి, దాని నాణ్యత, చురుకుదనంలో లోపాలు ఉంటున్నాయ్. వీర్యంలో శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉండటమే ఇప్పుడు ప్రధాన సమస్య. అంతేకాదు.. స్పెర్మ్ సెల్స్ నిర్మాణం సరిగా లేకపోవడం, అవి చురుగ్గా కదలకపోవడం కూడా సమస్యే. ముఖ్యంగా.. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ లాంటివి.. శుక్ర కణాల సంఖ్యని, నాణ్యతని దెబ్బతీస్తాయ్. అంతేకాదు.. దీర్ఘకాలిక ఒత్తిడితో కార్టిసాల్ లాంటి హర్మోన్లని విడుదల చేసి.. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. సరైన నిద్రలేకపోవడం కూడా ఓ కారణం.

స్పెర్మ్ కౌంట్‌పై ఎఫెక్ట్ చూపుతున్న ఒబెసిటీ సమస్య
ఒబెసిటీ సమస్య కూడా స్పెర్మ్ కౌంట్‌పై ఎఫెక్ట్ చూపుతోంది. అధిక బరువు వల్ల.. వృషణాల చుట్టూ కొవ్వు పేరుకుపోయి, ఉష్ణోగ్రత పెరుగుతుంది. శుక్రకణాల ఉత్పత్తికి సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత అవసరం. డయాబెటిల్ లాంటి సమస్యలు కూడా లైంగిక సమస్యలకు దారితీస్తోంది. ఇక.. అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యల వల్ల కూడా శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోతోంది. వీటితో పాటు వయసు పెరిగేకొద్దీ.. పరుషుల్లో.. శుక్రకణాల చురుకుదనం, సంఖ్య తగ్గుతుంది. అంతేకాదు.. శుక్రకణాల్లో జన్యుపరమైన లోపాలు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా.. సంతానోత్పత్తికి బయాలాజికల్ క్లాక్ అనేది.. స్త్రీ, పురుషులిద్దరికీ వర్తిస్తుంది. పెళ్లి ఆలస్యం కావడం వల్ల.. సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయ్. మహిళల్లో సంతానోత్పత్తి వయస్సుతో పాటు వేగంగా తగ్గుతుంది. మహిళలు 30 ఏళ్ల లోపు ఉన్నప్పుడు.. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి నెలా సహజంగా గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. అదే.. 30 ఏళ్లు దాటితే.. స్త్రీలలో సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది. 35 ఏళ్ల తర్వాత.. సంతానోత్పత్తి రేటు మరింత వేగంగా పడిపోతుంది. అండంలోని ఎగ్ కౌంట్, నాణ్యత బాగా తగ్గుతాయ్. గర్భస్రావం ప్రమాదం పెరుగుతుంది. 40 ఏళ్ల నాటికి గర్భం దాల్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది.

పురుషుల విషయానికొస్తే.. వయసు పెరిగేకొద్దీ శుక్రకణాల నాణ్యత తగ్గుతుంది. 35 ఏళ్ల లోపే.. ఆరోగ్యకరమైన, చురుకైన శుక్రకణాలు ఎక్కువగా ఉంటాయ్. అదే.. 35 ఏళ్లు దాటితే.. శుక్ర కణాల చలనం, పరిమాణం, నిర్మాణంలో మార్పులు వస్తాయ్. 40 ఏళ్లు దాటితే.. సంతానలేమి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆలస్యంగా పిల్లల్ని కనడం ప్లాన్ చేస్తే.. పుట్టే పిల్లల్లో ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్ లాంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ తరం యువతీ, యువకులు.. తమ కెరీర్ ఫస్ట్.. వెడ్డింగ్ నెక్ట్స్ అనే ఆలోచనతో.. పెళ్లిళ్లు ఆలస్యం చేస్తున్నారు. కానీ.. ఇది సంతానలేమి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అందువల్ల.. అమ్మాయిలైతే.. 30 ఏళ్ల లోపే పెళ్లి చేసుకొని, పిల్లల్ని కంటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. అబ్బాయిలు.. 35 ఏళ్లలోపే తండ్రి కావడం మంచిదంంటున్నారు.

Also Read: సీఎం సీటు ఫైట్! మార్పు తప్పదా?

అమ్మాయిలు.. 25 నుంచి 30 ఏళ్ల మధ్య పిల్లలను ప్లాన్ చేసుకోవడం వల్ల.. శారీరక సంతానోత్పత్తి దృష్ట్యా ఉత్తమమైనది. 35 ఏళ్లు దాటితే.. సంతానోత్పత్తి సామర్థ్యం బాగా తగ్గుతుంది. అబ్బాయిలైతే.. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వివాహం చేసుకోవడం మంచిది. ఈ వయస్సులో శుక్రకణాల నాణ్యత అధికంగా ఉంటుంది. 35 ఏళ్లు దాటితే శుక్రకణాల నాణ్యత తగ్గుతూ వస్తుంది. ఈరోజుల్లో.. సంతానలేమి అనేది కేవలం ఒకరి సమస్య కాదు. దంపతులిద్దరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జీవనశైలిలో మార్పులు చేసుకుని, సరైన వయస్సులో కుటుంబాన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా సంతానం విషయంలో తలెత్తే సమస్యలని అధిగమించొచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు.

Story By Anup, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×