E-Paper
Advertisement

Black Friday Sale 2025: బెస్ట్ డీల్ అంటే ఇదిగో ఇలా ఉండాలి.. ప్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్..

Black Friday Sale 2025: బెస్ట్ డీల్ అంటే ఇదిగో ఇలా ఉండాలి.. ప్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్..
Advertisement

Black Friday Sale 2025:  స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఏడాది పొడవునా ఆఫర్లు వస్తుంటాయి కానీ వినియోగదారులు నిజంగా ఎదురు చూస్తేది ఒక్కటే, బ్లాక్ ఫ్రైడే సేల్. ప్రతి సంవత్సరం ఈ సేల్‌లో వచ్చే ఆఫర్లు ఎవరి అంచనాలను అయినా మించి సంచలనాలు సృష్టిస్తాయి. ఈసారి కూడా అదే జరిగింది. ప్రత్యేకంగా శామ్‌సంగ్ అభిమానులకైతే ఈ బ్లాక్ ఫ్రైడే సీజన్ నిజంగా గోల్డ్ ఛాన్స్. ఎందుకంటే గత సంవత్సరం లాంచ్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 ఇప్పుడు ఎవ్వరూ ఊహించని స్థాయికి ఆఫర్‌లోకి వచ్చింది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 .. ధర తగ్గడం ఏమిటి నిజమేనా?

Advertisement

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అంటే ఇప్పటికే ప్రీమియమ్ కేటగిరీలో తనదైన గుర్తింపు కలిగిన ఫోన్. అప్‌డేటెడ్ లుక్, ప్రీమియమ్ ఫీల్, దానికి తోడు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్3 చిప్‌సెట్‌ అన్నీ కలిసి ఈ మోడల్‌ని ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో నిలబెట్టాయి. ఇప్పుడు అదే ఫోన్ ధర దాదాపు సగానికి తగ్గడంతో మార్కెట్‌లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Advertisement

గెలాక్సీ 24లో ఇచ్చిన 6.2-అంగుళాల డైనమిక్ ఎల్‌టిపిఓ అమోలెడ్2ఎక్స్ డిస్‌ప్లే చూసిన క్షణం నుంచి ప్రీమియమ్ అనుభూతి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌లో స్క్రోలింగ్ స్మూత్‌గా అనిపిస్తుంది. 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వలన బయట ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌కి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఇవ్వడంతో డ్యామేజ్‌కు మంచి సేఫ్టీ లభిస్తుంది. డిజైన్ కూడా చాలా కాంపాక్ట్‌గా ఉండడంతో చేతిలో పట్టుకున్నప్పుడు అద్భుతంగా ఫీల్ అవుతుంది.

ఫోన్ ప్రాసెసర్ ఎలా ఉంటుంది?

తర్వాత మాట్లాడాల్సింది ప్రాసెసర్ గురించి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ అనేది ఇప్పటికే మార్కెట్‌లో తన శక్తిని నిరూపించుకున్నది. ఈ చిప్‌సెట్‌లో యాప్ ఓపెనింగ్ వేగం, గేమింగ్ పర్‌ఫార్మెన్స్, మల్టీటాస్కింగ్ అన్నీ అత్యంత స్మూత్‌గా కనిపిస్తాయి. 8జిబి ర్యామ్‌తో కలిపి ఇచ్చిన 128జిబి స్టోరేజ్ వినియోగదారులకు రోజువారీ వాడకానికి తగినంతగా ఉంటుంది. గెలాక్సీ ఎస్24 ఆండ్రాయిడ్14 మీద రన్ అవుతూ శామ్‌సంగ్ ఇచ్చిన 7 పెద్ద అప్‌డేట్స్ ప్రామిస్ వలన ఈ ఫోన్ మరిన్ని సంవత్సరాలు అప్‌టుడేట్‌గా వినియోగదారులతో ఉంటుంది.

Also Read: Oppo Reno 6G: 2026 ఒప్పో రెనో 14 ఎఫ్ఎస్ 6జి ఫోన్.. ఫుల్‌ డే బ్యాటరీ, స్ట్రాంగ్ స్పీడ్‌తో ఎంట్రీ ఇస్తున్న రెనో

4000mAh బ్యాటరీతో ఫోన్ క్వాలిటీ

కెమెరా గురించి చెప్పుకుంటే శామ్‌సంగ్ ఎప్పటిలాగే తన క్లాస్‌ని చూపించింది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఓఐఎస్ సపోర్ట్‌తో రావడం వలన నైట్ ఫోటోలు కూడా బ్లర్ లేకుండా అందంగా వస్తాయి. 12ఎంపి అల్ట్రా వైడ్ షాట్స్ డే లైట్‌లో అద్భుతంగా కనిపిస్తాయి. 10ఎంపి టెలిఫోటో కెమెరా ఇచ్చిన 3x ఆప్టికల్ జూమ్ సోషల్ మీడియా ఫోటోలకి మంచి డీటైల్ ఇస్తుంది. ముందు ఇచ్చిన 12ఎంపి సెల్ఫీ కెమెరా వీడియో కాల్స్, స్టోరీస్, రీల్స్ అన్నీ చాలా క్లియర్‌గా రికార్డ్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఇచ్చిన 4000mAh బ్యాటరీ ఒకరోజు సాధారణ వాడకానికి తగినంతగా పనిచేస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడంతో ఛార్జ్ చేయడం కూడా పెద్ద సమస్య కాదు.

అసలు ధర ఎంత? ఆఫర్‌‌లో ఎంత తగ్గింది?

ఈ ఫోన్ మొదట లాంచ్ అయినప్పుడు ధర రూ.74,999. కానీ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ధర నేరుగా రూ.40,999కి పడిపోయింది. అంటే ఒక్కసారిగా రూ.34,000 తగ్గింది. అంతే కాదు, ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్‌బిఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే మరింత ఆఫర్‌గా రూ.4,000 తగ్గింపు రావడంతో ఫైనల్ ధర నేరుగా రూ.36,999కి చేరుతుంది. అంటే ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ని మిడ్ రేంజ్ ధరలో పొందే అరుదైన అవకాశం వచ్చినట్టే.

మళ్లీ ఇలాంటి డీల్ దొరకడం చాలా కష్టం

బ్లాక్ ఫ్రైడే 2025 సేల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా అన్నీ ప్లాట్‌ఫాంలలో భారీ ఆఫర్లతో ప్రారంభమవుతున్న ఈ సమయంలో కొత్త ఫోన్ కొనాలని అనుకునేవారికి గెలాక్సీ ఎస్24 ఆఫర్ నిజంగా బెస్ట్ టైమ్ సేవింగ్ డీల్. ఇంత పెద్ద తగ్గింపు సాధారణంగా సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది. అందుకే చాలా మంది ఇప్పుడే బుక్ చేసుకుంటున్నారు. ప్రీమియమ్ క్వాలిటీ, పర్‌ఫార్మెన్స్, అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ అన్నీ ఒకే ఫోన్‌లో కావాలనుకుంటే ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్ మిస్ అయితే మళ్లీ ఇలాంటి డీల్ దొరకడం చాలా కష్టం. శామ్‌సంగ్ ఎస్24 ప్రస్తుతం ఉన్న తగ్గింపు వల్ల మార్కెట్‌లో మరోసారి అత్యధికంగా డిమాండ్ ఉన్న మోడల్‌గా మారిపోయింది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×