E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఈఎస్ఐ ఆస్పత్రిలో సెంట్రింగ్ కూలడంతో ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌లోనే?

Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఈఎస్ఐ ఆస్పత్రిలో సెంట్రింగ్ కూలడంతో ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌లోనే?
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రి భవనంలో పునరుద్ధరణ పనులు (రెనోవేషన్) చేస్తుండగా సెంట్రింగ్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెంట్రింగ్ కార్మికులు పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పైకప్పు స్లాబ్ నుండి పెచ్చులు ఊడి కార్మికులపై పడటంతో సెంట్రింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

ఆసుపత్రి పనులలో నాణ్యత లోపించింది ప్రమాదానికి కారణం కావచ్చు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల భద్రతా ప్రమాణాలను విస్మరించడంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాద వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు విచారణ తరువాత వెల్లడవుతాయి.

ALSO READ: SAIL: డిగ్రీ పాసైన వారికి పండగ లాంటి వార్త.. నెలకు రూ.1,80,000 జీతం.. జస్ట్ అప్లై చేస్తే చాలు గురూ..

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×