E-Paper
Advertisement

సాధారణ ఫ్యాన్ vs బీఎల్‌డీసీ.. రెండింటికి తేడా ఏంటి? పవర్ ఆదాకు ఏది పర్ఫెక్ట్?

సాధారణ ఫ్యాన్ vs బీఎల్‌డీసీ.. రెండింటికి తేడా ఏంటి? పవర్ ఆదాకు ఏది పర్ఫెక్ట్?
Advertisement

BLDC vs Normal Fans: సాధారణంగా కాలంతో పని లేకుండా చాలా ఇళ్లలో ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. దీనివల్ల నెల నెలా వచ్చే కరెంట్ బిల్లు భారంగా మారుతుంటుంది. అయితే, ఇంట్లో వాడే పాత ఫ్యాన్ల స్థానంలో కొత్త టెక్నాలజీతో పనిచేసే బీఎల్ డీసీ (BLDC) ఫ్యాన్లు వాడితే కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు సాధారణ ఫ్యాన్ కి, బీఎల్ డీసీ ఫ్యాన్ కి తేడా ఏంటి? ఏది ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేస్తుంది? అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం.

సాధారణ ఫ్యాన్ల విద్యుత్ ఖర్చు

మనం సాధారణంగా ఇళ్లలో వాడే పాతకాలపు ఫ్యాన్లలో ‘ఇండక్షన్ మోటార్’ ఉంటుంది. ఇవి సాధారణంగా 75-80 వాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. వీటిలో వేగాన్ని నియంత్రించే రెగ్యులేటర్ల వల్ల కూడా కొంత విద్యుత్ వృథా అవుతుంది. రోజంతా ఈ ఫ్యాన్లను వాడటం వల్ల నెలాఖరులో కరెంట్ బిల్లు భారీగా పెరిగే ఛాన్స్ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు సాధారణ ఫ్యాన్ రోజుకు 12 గంటలు తిరిగితే నెలకి దాదాపు 27 నుండి 30 యూనిట్ల కరెంట్ కాలుస్తుంది.

మరి బీఎల్‌డీసీ ఫ్యాన్ల సంగతేంటి?

Advertisement

బీఎల్ డీసీ అంటే ‘బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్’ (Brushless Direct Current) అని అర్థం. ఈ ఫ్యాన్లలో ఉండే మోటార్ ఏసీ విద్యుత్‌ను డిసీగా మార్చుకుని అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటిలో ఫ్రిక్షన్ (Friction) చాలా తక్కువగా ఉండటం వల్ల వేడి కావడం గానీ, శబ్దం రావడం గానీ ఉండదు. ముఖ్యంగా ఈ ఫ్యాన్లు కేవలం 28 నుండి 35 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడుకుంటాయి. అంటే సాధారణ ఫ్యాన్ తో పోలిస్తే ఇది 65% కంటే ఎక్కువ కరెంట్‌ను ఆదా చేస్తుంది.

Also Read: వెలిగొండపై రేవంత్ సైలెంట్.. తెలంగాణకు తీరని ద్రోహం.. హరీశ్ రావు ధ్వజం!

కరెంట్ బిల్లులో తేడా ఎంత?

Advertisement

ఒక ఇంట్లో మూడు సాధారణ ఫ్యాన్లు ఉండి, అవి రోజుకు 12 గంటలు తిరిగితే.. ఏడాదికి కేవలం ఫ్యాన్ల మీదే దాదాపు రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు కరెంట్ బిల్లు వస్తుందని అంచనా. అదే స్థానంలో బీఎల్ డీసీ ఫ్యాన్లు అమర్చితే ఆ ఖర్చు రూ.1,200 కి తగ్గిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అంటే ఒక ఫ్యాన్ ద్వారానే ఏడాదికి రూ.1,500 వరకు ఆదా చేయవచ్చని సూచిస్తున్నారు. అయితే ఈ ఫ్యాన్ కొనుగోలు చేయడానికి పెట్టే అదనపు ఖర్చు కేవలం ఏడాది, ఏడాదిన్నరలోనే కరెంట్ బిల్లు ఆదా రూపంలో తిరిగి వచ్చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!

Tags

Related News

చెత్తలో పడేసే ప్లాస్టిక్ బాటిళ్లతో.. అద్భుతమైన ఇల్లు.. కెనడా బిల్డర్ల క్రేజీ ఆవిష్కరణ!

రూ.2,390లకే డైమండ్ కట్ డిజైన్ స్మార్ట్‌వాచ్..పెబుల్ వియన్నా స్పెషల్ లుక్!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..4 మైక్ ENC ఫీచర్‌తో కొత్త బౌల్ట్ ఇయర్‌బడ్స్!

క్యాబేజీ, పండ్ల తొక్కలతో నివాసాలు.. ఉంటే నీడ, తింటే ఆహారం.. ఇదెక్కడి టెక్నాలజీ సామీ!

రూ.599లకే 45 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇయర్ బడ్స్..

రూ.18 వేలకే.. స్టాండింగ్ డిష్‌వాషర్, వెంటనే కొనేయండి

రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!

Big Stories

Advertisement
×