E-Paper
Advertisement

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!
Advertisement

తిరుపతి జిల్లా పుంగనూరులో టీడీపీ ఇన్‌ఛార్జి పదవి కోసం తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట ముదురుతోంది..! ఇప్పటి వరకు వైసీపీతో పోరాడిన టీడీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీలోనే రెండు వర్గాలుగా విడిపోయారు. చల్లా రామచంద్రారెడ్డి కొనసాగింపును వ్యతిరేకిస్తున్న వర్గం.. మధుసూదన్‌ నాయుడును ఇంచార్జిగా కోరుతోంది. ఈ వివాదం చివరకు బహిరంగ ఘర్షణకు దారితీసింది.

అసలు చల్లా రామచంద్రారెడ్డి కొనసాగింపుపై ఎందుకు అసంతృప్తి నెల‌కొంది?

2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి.. ఎన్నికల తర్వాత కూడా ఆయన ఇంచార్జిగా కొనసాగుతున్నారు. త‌ను బ‌రిలో ఉన్నందునే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజారిటీని గణనీయంగా తగ్గించగ‌లిగాన‌ని, టీడీపీకి రాజకీయంగా బలం పెంచామని చెబుతున్నారు చ‌ల్లా. అయితే.. క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు, పార్టీ వ్యవహారాల్లో ఆయన వర్గం ఆధిపత్యం పెరగడంపై అసంతృప్తి వంటి కారణాలు ఆయ‌న‌పై నెగెటివిటీని పెంచాయి. అందుకే ఇంచార్జి మార్పు అంశం బ‌లంగా తెర‌పైకి వ‌స్తోంది. మధుసూదన్‌ నాయుడును కొత్త ఇంచార్జిగా నియమించాలనే ప్రతిపాదన కూడా పార్టీ పెద్దల ముందుకు వెళ్లింది.

Advertisement

ఇక ఈ వివాదం ఎంత తీవ్రంగా మారిందంటే.. 2026 జూలైలో పుంగనూరులో జరిగిన టీడీపీ అభిప్రాయ సేకరణ సమావేశమే రణరంగంగా మారింది. ఇంచార్జి మార్పు ఖాయమంటూ మధుసూదన్‌ వర్గానికి చెందిన నేత మాట్లాడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముల్లంగి వెంకటరమణపై దాడి జరగడంతో సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ వివాదంపై చంద్రబాబు జోక్యం చేసుకున్నా మధుసూదన్‌ నాయుడు వర్గం మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

పుంగనూరులో పార్టీపై ఎవరి పట్టు ఉండాలి? వచ్చే ఎన్నికలకు పార్టీని ఎవరు నడిపించాలి? అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఇదే వివాదానికి ప్ర‌ధాన కార‌ణమ‌వుతోంద‌నే వాద‌న ఉంది. ఒకవైపు.. చల్లా బాబును కొనసాగించాలనే వర్గం..మరోవైపు.. మార్పు తప్పనిసరి అంటున్న మధుసూదన్‌ నాయుడు వర్గం…ఇరువర్గాలూ వెనక్కి తగ్గకపోతే.. పుంగనూరులో వైసీపీతో పోరాటం కంటే ముందే టీడీపీకి సొంతింటి పోరు పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.

Advertisement

Also Read: ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

చివరికి చంద్రబాబు నిర్ణయం ఏంటి? చల్లా బాబుకే మరోసారి ఛాన్స్ ఇస్తారా? లేక మధుసూదన్‌ నాయుడు వర్గం డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటారా? అనే అంశం ఆస‌క్తిగా మారింది.

– Written by Dandugula Srinivas, BIG TV

Tags

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×