E-Paper
Advertisement

Varanasi Movie: మహేష్ బాబు ‘వారణాసి’ సీక్వల్‌కు రెడీ అవుతున్న రాజమౌళి!.. కారణం ఇదేనా..

Varanasi Movie: మహేష్ బాబు ‘వారణాసి’ సీక్వల్‌కు రెడీ అవుతున్న రాజమౌళి!.. కారణం ఇదేనా..
Advertisement

Varanasi Movie: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబులదే. వీరిద్దరి కలయికలో రాబోతున్న అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ (Varanasi) గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-Pooja Hegde:’ఆదర్శ కుటుంబం’లో జిగేల్ రాణి.. గుంటూరు కారం ఎఫెక్టేనా?

బాక్సాఫీస్ ట్రెండ్

Advertisement

ఇటీవల విడుదలైన ‘ధురంధర్ 2’, ‘కల్కి’, వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, పెద్ద కథలను రెండు భాగాలుగా చెప్పడం వల్ల కలిగే ప్రయోజనాలను నిరూపించాయి. రాజమౌళి మార్క్ మేకింగ్‌లో ప్రతి సన్నివేశం ఎంతో రిచ్‌గా, విజువల్ గ్రాండియర్‌తో ఉంటుంది. ‘వారణాసి’ కథా నేపథ్యం కేవలం మూడు గంటల సినిమాలో సరిపోదని, కథలోని లోతును ప్రేక్షకులకు పూర్తిగా వివరించాలంటే రెండు భాగాలుగా తీయడమే సరైన నిర్ణయమని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గ్లోబల్ రేంజ్ మార్కెటింగ్ జరుగుతుండగా రెండు పాట్లు అని తెలియడంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

‘రుద్ర’గా మహేష్ బాబు

ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే సాహసోపేతమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇది ఒక టైమ్-ట్రావెల్, ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంతో సాగే సినిమా. వారణాసి నగరం మరియు అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టాక్. కథలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాల్లో మహేష్ బాబు శ్రీరాముడి అవతారంలో కూడా కనిపిస్తారని వస్తున్న వార్తలు అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి.

Advertisement

Read also-Ustad Bhagat Singh: మొదటి వారం పవర్ చూపించలేని ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఇది సరిపోతుందా?

భారీ బడ్జెట్

దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. రాజమౌళి తన సినిమాల్లో ఎమోషన్స్‌ను పీక్ లెవల్‌లో చూపిస్తారు, కాబట్టి పార్ట్-1 చివరలో ఒక భారీ ‘క్లిఫ్ హ్యాంగర్’ (ట్విస్ట్) ఇచ్చి, రెండో భాగంపై అంచనాలు పెంచే ప్లాన్‌లో ఆయన ఉన్నారు. మొదట్లో ఈ సినిమాను ఒకే భాగంగా పూర్తి చేయాలని భావించినప్పటికీ, కథను రాజీ పడకుండా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 7, 2027న ఈ విజువల్ వండర్ మొదటి భాగం విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Related News

M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

బాలీవుడ్ లో సంచలనం.. కియారా – సిద్ధార్థ్ విడాకులా?

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర”టేక్డీ గణపతి ఆఫ్ నాగపూర్’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

Big Stories

Advertisement
×