boAt Airdopes Prime 511: పాటలు వినాలన్నా, ఎవరితోనైనా ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడాలన్నా మన చేతిలో ఉండాల్సిన మెయిన్ గాడ్జెట్ ఇయర్‌బడ్స్. వైర్లు చిక్కుకునే బాధ లేకుండా..చెవుల్లో ఈజీగా ఇమిడిపోయే ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌కి మార్కెట్లో ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. యూత్ ట్రెండ్‌కి తగ్గట్టుగా మార్కెట్‌లోకి వచ్చిన సరికొత్త మోడలే boAt Airdopes Prime 511. కేవలం స్టైలిష్ లుక్ మాత్రమే కాకుండా.. అదిరిపోయే ఫీచర్లతో.. వస్తున్న ఈ ఇయర్ బడ్స్ ధర కేవలం రూ. 1,299 మాత్రమే. మరి ఈ బడ్జెట్‌లో బోట్ అందించిన స్పెషల్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1.అల్ట్రా లాంగ్ 50 గంటల బ్యాటరీ బ్యాకప్:
ఇయర్ బడ్స్ కొనేటప్పుడు అందరూ ముందుగా.. చూసేది బ్యాటరీ లైఫ్ గురించే. తరచూ ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ లేకుండా.. ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ విషయంలో ఈ మోడల్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో, ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఏకంగా 50 గంటల పాటు నాన్ స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. మీరు ట్రిప్స్‌కి వెళ్లినా లేదా రోజంతా.. ఆఫీస్ కాల్స్‌లో బిజీగా ఉన్నా బ్యాటరీ అయిపోతుందనే టెన్షనే ఉండదు.
ఈ ఇయర్ బడ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్ ‘వాల్యూమ్ స్వైప్ కంట్రోల్స్’. సాధారణంగా వాల్యూమ్ పెంచాలన్నా, తగ్గించాలన్నా ఫోన్ తీయాలి లేదా ఇయర్ బడ్ మీద పదే పదే క్లిక్ చేయాలి. కానీ ఇందులో.. వేలితో స్వైప్ చేయడం ద్వారా చాలా ఈజీగా వాల్యూమ్‌ని కంట్రోల్ చేయెచ్చు. టెక్నాలజీ పరంగా ఇది యూజర్లకు చాలా సింపుల్ అండ్ కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది.
బయట రద్దీగా ఉండే.. రోడ్లలో లేదా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు.. ఫోన్ మాట్లాడితే అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపించదు. ఈ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్.. కన్సలేషన్ టెక్నాలజీ చుట్టు పక్కల ఉన్న అనవసరమైన సౌండ్ తగ్గించి.. మీ మాటలను అవతలి వారికి చాలా క్లియర్‌గా చేర వేస్తుంది. ఆఫీస్ మీటింగ్స్,ఆన్‌లైన్ క్లాసులకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఈ బడ్జెట్ రేంజ్‌లో.. యాప్ సపోర్ట్ రావడం చాలా అరుదు. కానీ.. ఈ ఇయర్ బడ్స్‌కి అఫిషియల్ boAt App సపోర్ట్ లభిస్తుంది. దీని సహాయంతో ..మీరు ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. టచ్ కంట్రోల్స్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. డివైజ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ని ఈజీగా మేనేజ్ చేయెచ్చు. ఇది గాడ్జెట్ లవర్స్‌కి ఒక అద్భుతమైన ఫీల్ ఇస్తుంది.
Also Read: రూ.99,990కే 75 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీ..ఇంట్లోనే పక్కా థియేటర్ వైబ్స్!
లుక్స్ పరంగా ఈ ఇయర్ బడ్స్ చూడ్డానికి చాలా రిచ్‌గా,మోడర్న్‌గా కనిపిస్తాయి. క్లాసీ కలర్ అయిన Zinc White కలర్ వేరియంట్‌లో ఇవి వస్తాయి. చెవుల్లో పెట్టుకున్నప్పుడు.. ఎలాంటి ఇబ్బంది కలగ కుండా ఎర్గోనామిక్ డిజైన్‌తో వీటిని తయారు చేసారు. ఇవి లైట్ వెయిట్ కారణంగా ఎక్కువ సేపు పెట్టుకున్నా చెవులకు నొప్పి ఉండదు.
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, అద్భుత మైన కాల్ క్వాలిటీ కోరుకునే వారికి.. ఈ మోడల్ ఒక అల్టిమేట్ ఆప్షన్. కేవలం రూ.1,299 ధరకే లభిస్తున్న ఈ ట్రెండింగ్ ఇయర్‌బడ్స్‌ని మీరు కూడా సొంతం చేసుకోవాలనుకుంటే ఈ డీల్‌ను అస్సలు మిస్ కావద్దు.