Tiger Shroff: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంతమంది బడా హీరోలను టార్గెట్గా చేసుకొని బిష్ణోయ్ వర్గం కాల్పులు జరుపుతూ బాలీవుడ్ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గత వారం రోజుల క్రితం బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ వాహనంపై జరిగిన కాల్పుల ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు టైగర్ ష్రాఫ్ పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనే కోణంలో పోలీసులు కూడా లోతుగా పరిశీలిస్తున్నారు. ఇకపోతే టైగర్ ష్రాఫ్ ను రెక్కీ చేసి మరీ ఆయన కారుపై కాల్పులు జరిపిన ముగ్గురు దుండగులను పోలీసులు వెతికి మరీ అరెస్టు చేసిన విషయం తెలిసింది.
ఇకపోతే ఈ కాల్పుల వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని పోలీసులు ప్రథమ విచారణలో తేల్చారు . అయితే ఇప్పుడు ఈ దాడికి సంబంధించిన కోణాలను పోలీసులు లోతుగా పరిశీలించగా.. విస్తుపోయే నిజం బయటపడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ను ఉద్దేశించి టైగర్ ష్రాఫ్ చేసిన కొన్ని ప్రశంసల వ్యాఖ్యలే ఈ దాడి వెనుక ప్రధాన కారణంగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందట. టైగర్ ష్రాఫ్.. “ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ ఒక్కరే అసలైన టైగర్” అంటూ సల్మాన్ ఖాన్ ను పొగుడుతూ ఆయనతో సన్నిహితంగా ఉండటమే కాకుండా గ్యాంగ్ స్టార్ హెచ్చరికలను లెక్కచేయకపోవడం వల్లే ఈ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్కరోజు సల్మాన్ ఖాన్ ను టైగర్ ష్రాఫ్ పొగడకుండా ఉండుంటే.. ఆయనపై దాడి జరిగేది కాదు అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు . ఇంత టెక్నాలజీ, ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ ఎందుకు లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి తగిన శిక్ష పడడం లేదు అంటూ సల్మాన్ ఖాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
also read: ప్రేమలో విఫలమైతే చచ్చిపోవాలా.. రాము రాథోడ్ సంచలన కామెంట్స్!
అసలు ఈ దాడి ఎలా జరిగిందనే విషయానికి వస్తే.. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ బయట టైగర్ ష్రాఫ్ తన కారు తీసుకొని ఇంటికి వెళుతుండగా.. దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ కి ఎలాంటి ప్రమాదం కానప్పటికీ.. ఆయన డ్రైవరు, పక్కన వెళ్తున్న మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటనపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు బాధ్యత వహించింది.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో సంబంధం ఉన్న వారందరినీ కూడా హెచ్చరిస్తున్నామని , బిష్ణోయ్ సమాజానికి సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని ఆ గ్యాంగ్ డిమాండ్ చేసింది. ఈ ఘటనతో బాలీవుడ్ లో మరోసారి కలకలం రేగింది
ఇక సల్మాన్ ఖాన్ తో పాటు ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖుల భద్రతను కూడా పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ చేస్తున్న దాడులు, ఆయన సన్నిహితులపై చేస్తున్న కాల్పులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.